S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 12:37

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు పరిధిలో ముంపు మండలాలను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ శనివారం ఇక్కడ మీడియాకు చెప్పారు. గోదావరి, కృష్ణా నదులపై మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై రెండు తెలుగురాష్ట్రాలూ ఉమ్మడిగా పోరాటం చేయాల్సి ఉందన్నారు.

04/16/2016 - 12:37

ఖమ్మం: భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం పట్ట్భాషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏటా శ్రీరామనవమి మరుసటి రోజున స్వామివారికి పట్ట్భాషేకం జరుగుతుంది. తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

04/16/2016 - 08:30

హైదరాబాద్, ఏప్రిల్ 15: బిక్షగాళ్లను కూడా దోచుకున్న చరిత్ర మీది అంటూ కాంగ్రెస్ నాయకురాలు డికె అరుణపై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.

04/16/2016 - 08:29

హైదరాబాద్, ఏప్రిల్ 15: దళిత విద్యార్ధులపై వివక్షతో యూనివర్శిటీలు భగ్గుమంటున్న సమయంలో హైదరాబాద్ ఇంగ్లీషు అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (ఇఎఫ్‌ఎల్ వర్శిటీ)లో ఒక దళిత విద్యార్ధిని బహిష్కరించడం వివాదాస్పదంగా మారింది. వర్శిటీ పాలకుల నిర్ణయంపై విద్యార్ధి సంఘాలు భగ్గుమంటున్నాయి.

04/16/2016 - 08:26

హైదరాబాద్, ఏప్రిల్ 15: విందు వినోదాలకు, ఆటపాటలకు, కొత్త కొత్త విషయాలపై శిక్షణ పొందేందుకు, లలిత కళల్లో రాటుదేలేందుకు కూడా వేసవి కాలం ఒక బృహత్తర అవకాశం. రెండు మూడేళ్ల వయస్సున్న పిల్లలు మొదలు ఇంటర్, డిగ్రీ చదివే వారికి సైతం వేసవి కాలం ఒక సువర్ణావకాశం. వార్షిక పరీక్షలు ముగియడం మరో పక్క 16 నుండే సెలవులు రావడంతో రెండు నెలల పాటు సుదీర్ఘకాలం ఏదో ఒక నైపుణ్యాన్ని పొందేందుకు వీలుదొరుకుతుంది.

04/16/2016 - 08:21

సిద్దిపేట, ఏప్రిల్ 15 : మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సుగా టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ ప్రకటించగా మంత్రి హరీష్‌రావు సమక్షంలో ఆ పార్టీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మంత్రి హరీష్‌రావు నూతనంగా ఎన్నికైన టిఆర్‌ఎస్ కౌన్సిలర్లతో శుక్రవారం ఇక్కడి బాలాజీ హోటల్‌లో సమావేశం నిర్వహించారు.

04/16/2016 - 08:20

హైదరాబాద్, ఏప్రిల్ 15: హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ)కు మహర్దశ పట్టనుంది. ఈ ప్రాంతం మొత్తానికి ఏకీకృత మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఉన్న ఐదు మాస్టర్ ప్లాన్లను ఒకటిగా చేసి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు సమాయత్తమవుతోంది.

04/16/2016 - 08:19

మహాదేవపూర్, ఏప్రిల్ 15: గోదావరి నదీ, ప్రాణహిత, అంతర్వాహిని మూడు నదుల (త్రివేణి ) సంగమ స్థానమైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి (త్రినేత్ర)కు నిలయమైన కాళేశ్వరంనకు సమీపంలోని కనె్నపల్లి మెట్టుపల్లి వద్ద తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ (త్రిరాష్ట్ర)లకు వారధిగా నిర్మిస్తున్న వంతెన పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. మూడేళ్ళలో పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ముందే పనులు పూర్తి చేసిన నిర్మాణ సంస్థ.

04/16/2016 - 08:18

వేములవాడ, ఏప్రిల్ 15: కరీంనగర్ జిల్లాలోని హరిహరక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్‌లగ్న సుముహూర్తాన ఉదయం 11.45 గంటలకు కళ్యాణతంతును ఆలయ అర్చకులు ప్రారంభించారు.

04/16/2016 - 08:12

ఒంగోలు, ఏప్రిల్ 15:రాష్ట్రప్రభుత్వం ఇకనుండి డికె పట్ట్భాముల్లోను రొయ్యల,చేపల పెంపకం చేపట్టే విధంగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపధ్యంలో రాష్టవ్య్రాప్తంగా మత్స్యసంపద భారీగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రప్రభుత్వం ఆ మేరకు 128జివోను ఈనెల 4న విడుదల చేయటంతో డికెపట్టాల్లో అధికారికంగా రొయ్యల, చేపలసాగును రైతులతోపాటు, పారిశ్రామికవేత్తలు చేసుకోనున్నారు.

Pages