S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 05:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15:యావద్భారతం మండిపోతోంది. చండప్రచండ వడగాడ్పులతో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత శుక్రవారం 40డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రత 42.2డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.నిన్నటి కంటే రెండు డిగ్రీల మేర ఎండలు పెరిగిపోవడంతో దేశ రాజధాని వాసులు బెంబేలెత్తిపోయారు.

04/16/2016 - 05:06

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: రెండు నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వినియోగదారులకు శుక్రవారం స్వల్ప ఊరటనందించింది. పెట్రోలుపై లీటరుకు 74 పైసలు, డీజిల్‌పై రూ.1.30పైసల చొప్పున తగ్గించింది. మారిన ఈ రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.61.13 పైసలకు తగ్గింది. అలాగే డీజిల్ రేటు కూడా రూ.49.31పైసల నుంచి 48.01 పైసలకు తగ్గింది.

04/16/2016 - 05:04

ఖమ్మం, ఏప్రిల్ 15: కయ్యాలకు, గిల్లికజ్జాలకు పోకుండా పరస్పరం సహకరించుకుందామని ఆంధ్ర సర్కారుకు తెలంగాణ సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. పొరుగు రాష్ట్రంతో సఖ్యతతో మెలగుతూ సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. దుమ్ముగూడెం తర్వాత ఎలాగూ గోదావరి జలాలను తెలంగాణ వాడుకునే వీలు లేదని, 1000 టిఎంసిలు తెలంగాణ వాడుకున్నా, మిగిలిన 1500 టిఎంసిలు ఆంధ్రా ప్రజలకు ఉపయోగపడతాయని అన్నారు.

04/16/2016 - 05:00

శ్రీకాకుళం(కల్చరల్), ఏప్రిల్ 15: అందాల రాముడు అందరివాడు... అందుకే రామాలయం లేదా రామమందిరం లేని వాడంటూ ఉండరు. శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీతారామ కల్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. పాతశ్రీకాకుళం కలెక్టర్ బంగ్లారోడ్‌లోని సాయి మందిరంలో సీతారామ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ దంపతులను నిర్వాహకులు సన్మానించారు.

04/16/2016 - 04:58

ఎచ్చెర్ల, ఏప్రిల్ 15: మండలంలోని ఎచ్చెర్ల ఎఆర్ క్వార్టర్స్‌లో కొలువై ఉన్న కోదండరామ ఆలయ సన్నిధిలో నవ వసంతాన్ని పురష్కరించుకుని శుక్రవారం రాముల వారి కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఎప్పుడూ విధుల్లో తీరిక లేకుండా గడిపే ఎఆర్ పోలీసులు, వారి కుటుంబాలు సీతారాముల కల్యాణాన్ని సాంప్రదాయబద్దంగా నిర్వహించడం పరిపాటి.

04/16/2016 - 04:58

మందస, ఏప్రిల్ 15: తనను ప్రేమించానంటూ మభ్యపెట్టి చివరకు మోసపోయినట్టు గుర్తించిన బాధితురాలు ప్రేమికుడి ఇంటి ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలంటోంది. మండలంలో పట్టులోగాం గ్రామానికి చెందిన సవర హరిశంకరరావు బోరివంక స్కూల్‌లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నప్పుడు కొంకడాపుట్టుగ పంచాయతీ కుల్లోగాం గ్రామానికి చెందిన సవర భూలక్ష్మితో పరిచయం ఏర్పడింది.

04/16/2016 - 04:57

కోటబొమ్మాళి, ఏప్రిల్ 15: సాగునీటిని రైతులు నూతన వ్యవసాయ విధానాలు అవలంభించడం ద్వారా సంరక్షించుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని సౌఢాం గ్రామంలో వర్షిణి నూతన సాగునీటి విధానం పైలట్ ప్రాజెక్టును శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

04/16/2016 - 04:55

ఎల్ ఎన్‌పేట, ఏప్రిల్ 15: రాజకీయంగా బద్ధశత్రువులగా ఉన్న నాయకులు ఒకే గూటికి చేరారు. శుక్రవారం పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సమక్షంలో దబ్బపాడు గ్రామంలో వైకాపాకు చెందిన పిర్ల సీతారాం తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. గత కొన్నాళ్లుగా దబ్బపాడు గ్రామంలో పిర్ల సీతారాం, జన్ని మోహనరావులు రాజకీయంగా వేర్వేరు పార్టీలో ఉంటూ అదిపత్య పోరు కొనసాగించే వారు.

04/16/2016 - 04:54

శ్రీకాకుళం, ఏప్రిల్ 15: హిందువులకు అత్యంత ఇష్టదైవం శ్రీరాముడుకాగా శ్రీరాముడు పుట్టిన తిధి నవమి సందర్భంగాశ్రీరాముడి జన్మోత్సవాలు జిల్లా అంతటా అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడందరామస్వామి ఆలయం, వాడవాడలా రామాలయాలు, రామమందిరాల్లోనూ, విష్ణు ఆలయాల్లోనూ శ్రీరామనవవి, సీతారామ కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించారు.

04/16/2016 - 04:53

శ్రీకాకుళం, ఏప్రిల్ 15: ఉత్తరాంధ్రా జిల్లాల్లో వివిధ నిర్మాణాలకు ప్రధాన భూమిక పోషించిన సిక్కోలు ఇసుకను దండిగా ఎగుమతి చేసుకొని కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్న వ్యాపారులకు ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీతో ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలోని వంశధార, నాగావళి నదీ పరీవాహక ప్రాంతాలనుండి ఇసుకను తొలుత బాబు సర్కార్ క్యూబిక్ మీటర్ రూ.550 వంతున మీ-సేవా కేంద్రాల ద్వారా పొందిన డిడిలకు సరఫరా చేసింది.

Pages