S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 05:27

విశాఖపట్నం, ఏప్రిల్ 15: నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (నిమ్స్) తరహాలోనే విమ్స్ ఆసుపత్రిని నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. దీనివల్ల జాతీయ స్థాయిలోనే నియామకాలు జరపాల్సి ఉంటుంది. భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా వైద్యులు ఇక్కడ పని చేసేందుకు రావచ్చు. ఈ విధంగా నియమించే వైద్యుల్లో ఎక్కువ శాతం మంది సీనియారిటీ కలిగి ఉండే వారినే తీసుకోవాల్సి ఉంటుంది.

04/16/2016 - 05:26

విశాఖపట్నం, ఏప్రిల్ 15: నగరంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అందరి ఆరాధ్యదైవమైన శ్రీ సీతారాముల కల్యాణాన్ని చూసేందుకుజనం, భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. జగదాంబ జంక్షన్‌లో ఉన్న శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయం అయిన అంబికాబాగ్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహాత్స్యం ఘనంగా జరిగింది.

04/16/2016 - 05:25

విశాఖపట్నం, ఏప్రిల్ 15: విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఎట్టకేలకు కళ్లు తెరిచింది. మూడు దశాబ్ధాల కిందట సేకరించిన భూమి కళ్లెదుటే ఆక్రమణలకు గురౌతున్నా పట్టించుకోని వుడా హఠాత్తుగా మేల్కొంది. మిగిలిన కొద్దిపాటి భూములనైనా దక్కించుకునేందుకు సిద్ధమైంది. భూమి చుట్టూ కంచె నిర్మించడం ద్వారా ఈ భూములు తమవేనన్న భావన కల్పించనుంది.

04/16/2016 - 05:21

విజయవాడ, ఏప్రిల్ 15: కృష్ణమ్మ ఆవిరైంది.. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలన్నీ నీటి ఎద్దడితో కటకటలాడుతున్నాయి. నది ఎగువ ప్రాంతంలో నీరు లేకపోవడంతో దిగువ ప్రాంతాలన్నీ నీటి కష్టాలను ఎదుర్కోవలసి వస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కృష్ణా పరీవాహక ప్రాంతాల్లోని అన్ని రిజర్వాయర్లలో నీరు డెడ్ స్టోరేజ్‌కు చేరుకుంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం శనివారం నాటికి డెడ్ స్టోరేజ్‌కు చేరుకోబోతోంది.

04/16/2016 - 05:21

కంచికచర్ల, ఏప్రిల్ 15: కృష్ణా పుష్కరాల ప్రత్యేక నిధులతో చేపట్టనున్న రహదారుల నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. కోటి 20లక్షలతో మున్నలూరు, కోటి రూపాయలతో కునికినపాడులో రహదారి నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేసి త్వరితగతిన రోడ్డు నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు.

04/16/2016 - 05:20

కృత్తివెన్ను, ఏప్రిల్ 15: ప్రజలకు మంచినీరు అందించాలని తెలుగు తమ్ముళ్ళు శుక్రవారం 216ఎ జాతీయ రహదారిపై అండర్ టనె్నల్ వద్ద ధర్నాకు దిగారు. గరిసిపూడి ఎంపిటిసి నాగిడి నాగార్జున ఆధ్వర్యంలో గరిసిపూడి గ్రామస్థులంతా రోడ్డుపై బైఠాయించారు. నాటు పడవలను రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారు.

04/16/2016 - 05:19

జగ్గయ్యపేట రూరల్, ఏప్రిల్ 15: మండలంలోని ముక్త్యాల దళితవాడలో ఉన్న శ్రీకోదండ రామస్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన స్వామి వారి కంకణాలు, పసుపు కుంకుమ అక్షింతలను టిటిడి ప్రచార మండలి సభ్యుడు వల్లవరపు వెంకటబాబు శుక్రవారం ఉదయం ఆలయ కమిటీకి అందజేశారు.

04/16/2016 - 05:18

జి.కొండూరు, ఏప్రిల్ 15: తాను చెరువుమాధవరం సొసైటీలో సొమ్మును చెల్లించానని, ఇది ముమ్మాటికీ నిజమని, దీన్ని నిరూపించడానికి ఏ విచారణకైనా సిద్ధమేనని రైతు చెన్నంశెట్టి శేఖర్‌బాబు స్పష్టం చేశారు.

04/16/2016 - 05:18

మైలవరం, ఏప్రిల్ 15: స్థానిక నూజివీడురోడ్‌లోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఉమకు ఆలయం వెలుపనుండి ఆలయ వేద పండితులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికి లోనికి తోడ్కొని వెళ్ళారు. ఆలయంలో పురోహితులు స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం ఉమకు తీర్థ ప్రసాదాలు అందించారు.

04/16/2016 - 05:17

మచిలీపట్నం, ఏప్రిల్ 15: బందరు మండలం ఉల్లిపాలెం గ్రామంలోని శ్రీ హేమకోదండ రామాలయం ట్రస్టు బోర్డు వివాదం నేపథ్యంలో శుక్రవారం పోలీసుల పహారాలో సీతారాములకు రెండు విడతలుగా కళ్యాణాలు జరిగాయి. గ్రామానికి చెందిన ఉల్లి విజయ భాస్కరరావు సదరు రామాలయం తమ వంశీయులదంటూ ఇటీవల ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయగా గత రెండు రోజుల క్రితం దీన్ని గ్రామస్థులంతా తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

Pages