S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 05:17

మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 15: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు రామాలయాలు, రామ మందిరాలు, కూడళ్ళల్లో ఏర్పాటు చేసిన చలువ పందిళ్ళల్లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. కళ్యాణ వైభోగమే.. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి.. తదితర భక్తి పాటలతో ఆలయాలు మార్మోగాయి.

04/16/2016 - 05:16

మచిలీపట్నం, ఏప్రిల్ 15: బందరు మండలం ఉల్లిపాలెం గ్రామంలోని శ్రీ హేమకోదండ రామాలయం ట్రస్టు బోర్డు వివాదం నేపథ్యంలో శుక్రవారం పోలీసుల పహారాలో సీతారాములకు రెండు విడతలుగా కళ్యాణాలు జరిగాయి. గ్రామానికి చెందిన ఉల్లి విజయ భాస్కరరావు సదరు రామాలయం తమ వంశీయులదంటూ ఇటీవల ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయగా గత రెండు రోజుల క్రితం దీన్ని గ్రామస్థులంతా తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

04/16/2016 - 05:15

ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 15: వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎనిమిదివ రోజైన శుక్రవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై ఆశీర్వచన మండపంలో ఉత్సవమూర్తికి తెల్ల చామంతులు, కలువ పువువ్వులతో పుష్పార్చన ఘనంగా నిర్వహించారు.

04/16/2016 - 05:15

పటమట, ఏప్రిల్ 15: శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం పటమటలోని వాడవాడల సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. 2వ డివిజన్ రామచంద్రనగర్‌లో జరిగిన సీతారాముల కళ్యాణ కార్యక్రమానికి హాజరైన గద్దె, ఎమ్మార్ రాజా అందజేసిన 100 చీరలను పేదలకు పంపిణీ చేశారు.

04/16/2016 - 05:14

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 15: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విఎంసి కమిషనర్ వీరపాండియన్ అనుసరిస్తున్న అనుచిత వైఖరి చర్చనీయాంశమైంది. పన్ను వసూలులో టార్గెట్ సాధించని రెవెన్యూ సిబ్బందికి చెందిన ఏప్రిల్ నెల జీతాలను నిలిపివేసిన వైనంపై ఇటు విఎంసి ఉద్యోగులలోనే కాక ప్రభుత్వ ఉద్యోగ సంఘాలలో కూడా చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

04/16/2016 - 05:13

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 15: గతంలో రౌడీయిజం చెలాయించిన వారు ఆతర్వాత రాజకీయ అవతారమెత్తేవారు. కాని ఇప్పుడు రౌడీషీటర్లకు రాజకీయ పార్టీల అండదండలు పుష్కలంగా అందుతున్నాయి. ఇందుకు ఏ ఒక్క రాజకీయ పార్టీకి మినహాయింపు లేదు. అధికార పక్షమైనా.. ప్రతిపక్ష పార్టీ అయినా ఆయా పార్టీలో ఉండే కొంతమంది కీలక నాయకుల కనుసన్నల్లో ఈ కరుడుగట్టిన రౌడీషీటర్లు హల్‌ఛల్ చేయడం నగరంలో పరిపాటిగా మారిపోయింది.

04/16/2016 - 05:12

విజయవాడ, ఏప్రిల్ 15: ‘నేను నిద్రపోను.. మిమ్నల్ని నిద్రపోనివ్వను’ అని పదే పదే అధికారులను హెచ్చరించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మాటల్ని అక్షరాలా అమలు చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు బేజారవుతున్నారు. ‘పేరుకే సెలవలు...మాకన్నీ పని దినాలే’నంటూ వాపోతున్నారు. 14వ తేదీ అంబేద్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి కాబట్టి, రాష్టవ్య్రాప్తంగా ఉద్యోగులంతా గురువారం విధులకు హాజరయ్యారు. శుక్రవారం శ్రీరామ నవమి.

04/16/2016 - 05:12

పాతబస్తీ, ఏప్రిల్ 15: పూర్వకాలంలో బెజవాడ.. ప్రస్తుత విజయవాడ రానురాను అమరావతి రాజధానిలో భాగమైంది. నాడు విజయవాడ పక్కనే కృష్ణా అనే జీవనది ఉండేది చరిత్ర ఆధారాల ప్రకారం ఆ జీవనది సాగునీటికి, మంచినీటికి ఆధారమైయ్యేది. రానున్నకాలంలో ఇలాంటి చరిత్ర చదువుకోవాల్సిన పరిస్థితి రానుందా అని భయపడేంతగా కృష్ణానది నీటిమట్టం దిగజారింది. కనీస నీటి మట్టానికి ఆరడుగులు పడిపోయింది.

04/16/2016 - 05:12

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 15: నగర పాలక సంస్థ పరిధి ప్రాంతాల్లో నిర్మితమవుతున్న అనధికార నిర్మాణాలపై విఎంసి కమిషనర్ వీరపాండియన్ పట్టు వదలలేదు.

04/16/2016 - 05:10

విజయవాడ, ఏప్రిల్ 15: ఉచిత ఇసుక ప్రయోజనాలను ఎవరు దెబ్బతీసినా కఠిన చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శుక్రవారం తన నివాసం నుంచి జలవనరులు, భూగర్భ జలాలు, వ్యవసాయ, వైద్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉచిత ఇసుక ప్రతి పేద కుటుంబానికి అందాలని అన్నారు. మండల, జిల్లా స్థాయిలో ఇసుక తవ్వకాలపై కమిటీలు వేయాలని ఆయన ఆదేశించారు.

Pages