S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/22/2020 - 02:15

హైదరాబాద్: ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కోవిడ్ -19 నివారణకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ సజ్జనార్‌తో కలిసి మాట్లాడారు. కోవిడ్‌ను నిలువరింప చేసేందుకు జిల్లాలో 48 ప్రత్యేక బృందలను సిద్దం చేసినట్టు చెప్పారు.

03/22/2020 - 02:14

కొందుర్గు, మార్చి 21: రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని ఆగిర్యాల గ్రామానికి చెందిన భార్యభర్తలు వారం రోజుల క్రితం ఆస్ట్రేలియాలకు వెళ్లి వచ్చారు. ఆగిర్యాల గ్రామానికి చెందిన భార్యభర్తలు మార్చి 19న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యుల ఇంటికి చేరుకున్నారు. రెండు రోజులు అక్కడే ఉండి తిరిగి స్వగ్రామం ఆగిర్యాలకు చేరుకున్నారు.

03/22/2020 - 02:14

కీసర, మార్చి 21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రజలందరూ ఈనెల 22 ఆదివారం జనతా కర్ఫ్యూను స్వచ్చందంగా పాటించాలని మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు.
శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా అధికారులతో జనతా కర్ఫ్యూ, కోవిడ్-19 నియంత్రణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

03/22/2020 - 02:13

కేపీహెచ్‌బీకాలనీ: కేపీహెచ్‌బీకాలనీలో కోవిడ్ వైరస్ కలకలం రేపింది. ధర్మారెడ్డికాలనీ ఫేజ్ 2లో నివాసం ఉంటున్న మహిళకు కరోనా వైరస్ నిర్ధారణ జరిగింది. ఆమెతో పాటు ఇంట్లో ఉన్న మరో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. యూకే నుంచి వచ్చిన తన సోదరుడు నుంచి ఈ వ్యాధి సోకినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

03/22/2020 - 02:11

జీడిమెట్ల, మార్చి 21: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు పోలీస్‌స్టేషన్‌లలో కరోనా వైరస్‌పై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, దుందిగల్, బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లలో ఆయా సీఐలు బాలరాజు, గంగారెడ్డి, వెంకటేశం, జగదీశ్వర్ ప్రత్యేకంగా మత పెద్దలతో, అసోసియేషన్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు.

03/22/2020 - 02:10

వికారాబాద్, మార్చి 21: కోవిడ్ వైరస్ మహమ్మారిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం జనతా కర్వ్యూ విధిస్తే, వికారాబాద్ జిల్లాలో రెండు రోజుల పాటు జనతా కర్వ్యూ విధిస్తున్నట్లు కలెక్టర్ పౌసమి బసు అన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాయంలోని తన చాంబర్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.

03/22/2020 - 02:10

ఖైరతాబాద్: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ స్టార్ హోటల్‌లో బస చేసిన విదేశీయులకు వైద్య బృందం శనివారం వైద్య పరీక్షలు నిర్వహించింది. ప్రపంచాన్ని కలవర పెడుతున్న కోవిడ్-19 విదేశీయుల్లోనే కనిపిస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది. రెండు నెలలుగా వివిధ దేశాల నుంచి ఇక్కడి వచ్చిన వారిని గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.

03/22/2020 - 02:08

సనత్‌నగర్: కోవిడ్ వ్యాప్తిని నిరోదించేందుకు ప్రజలను అప్రమత్తం చేయడంలో ట్రాఫిక్ పోలీసులు ముందంజలో ఉన్నారు. చౌరస్తాల వద్ద నిలిచిపోయిన వాహనదారులకు వైరస్ లక్షణాలు, నివారణ చర్యలు, చేయాల్సిన పనులను వివరిస్తున్నారు. శనివారం పంజాగుట్ట ట్రాఫిక్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్టేషన్ల ట్రాఫిక్ సిబ్బంది ఆయా చౌరస్తాల వద్ద ఫ్లకార్డులను పట్టుకొని వాహనదారులు, పాదాచారులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

03/22/2020 - 02:07

హైదరాబాద్: కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా నగరంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. ఈనెల 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వివిధ దేశాల నుంచి సుమారు ఎనిమిది వేల మంది నగరానికొచ్చినట్లు అంచనాలు ఉన్నాయి. కానీ, ఈ సమాచారాన్ని ప్రభుత్వ శాఖలు ధ్రువీకరించకపోయినా, ఇప్పటి వరకు 1400 మంది విదేశీయుల ఇళ్లను పరిశీలించినట్లు, ఎక్కడా కూడా కరోనా ఆనవాళ్లు కన్పించలేదని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది.

03/22/2020 - 01:44

అమరావతి: రాజ్యసభ ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ నెలకొంది. రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణల గడువు పూర్తయింది. నాలుగు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఎన్నిక అనివార్యమైంది.

Pages