S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/22/2020 - 01:43

గుంటూరు: మానవాళిని హరించేందుకు ముంచుకొచ్చిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా చైతన్యవంతులైన జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం ఉదయం 7నుండి రాత్రి 9గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే గడపాలని, తప్పనిసరై ఎవరైనా బయటకు రావాల్సివస్తే తగిన జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు.

03/22/2020 - 01:40

అమరావతి: కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఈ నెల 22న ‘జనతా కర్ఫ్యూ’ పాటిస్తున్నందున కీలకమైన ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగకుండా తగిన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభి వృద్ధి శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌తో శనివారం చర్చించారు.

03/22/2020 - 01:39

అమరావతి, మార్చి 21: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంపై రాష్ట్రం అంతటా ప్రజానీకం అ‘టెన్షన్’ అవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా కరోనాపై యుద్ధం ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నారు.

03/22/2020 - 01:36

అమరావతి, మార్చి 21: కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకాలు జారీ చేశారు. దీం తో అధికార యంత్రాంగం కదం తొక్కింది. కొద్దిరోజులుగా అధికారులను అప్రమత్తం చేస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కరోనా నివారణ చర్యలు ముమ్మరం చేసింది. ము ఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాల్లో కంట్రోల్ రూములు,

03/22/2020 - 01:30

న్యూఢిల్లీ, మార్చి 21: కరోనాపై యుద్ధానికి యావత్ భారతం సన్నద్ధమైంది. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలు వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించటం ద్వారా కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశ ప్రజలు సమాయత్తమయ్యారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు ఇళ్లలో ఉండిపోవటం ద్వారా కరోనావైరస్ వ్యాప్తి గొలుసు తుంచేందుకు సిద్ధమయ్యారు. జనతా కర్ఫ్యూ ప్రభావం శనివారం నుంచే కనిపించటం ప్రారంభమైంది.

03/22/2020 - 01:22

హైదరాబాద్: కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీఓ జారీ చేసింది. ఈ జీఓను గెజిట్‌లో కూడా ప్రకటించారు. ఈ జీఓ ప్రకారం కరోనా సోకిన దేశాల నుండి ఎవరైనా తెలంగాణలో అడుగిడితే వెంటన స్టేట్ కంట్రోల్ రూం (040-2465 1119) లేదా 104కు ఫోన్ చేసి వివరాలు అందించాలని ఆదేశించారు. సమాచారం అందించిన వెంటనే ప్రభుత్వ సిబ్బంది అవసరమైన చర్యలు తీసుకుంటుందని జీఓలో తెలిపారు.

03/22/2020 - 01:21

హైదరాబాద్: రాష్ట్రంలో అవసరమైతే ‘టోటల్ షట్‌డౌన్’ చేస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు వెల్లడించారు. ప్రగతిభవన్‌లో శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, కరోనా వైరస్ తెలంగాణలో ఇప్పటివరకు అదుపులోనే ఉందన్నారు. విదేశాల నుండి వస్తున్న వారే కరోనా సోకినట్టు నిర్ధారణ అవుతున్నారన్నారు. తెలంగాణలో నివసిస్తున్న వారికి ఇప్పటివరకు కరోనా ఎఫెక్ట్ కాలేదన్నారు.

03/22/2020 - 01:20

హైదరాబాద్: మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులను ఐదారు రోజుల్లో మూసివేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో శనివారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, మహారాష్టల్రో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. మహారాష్టల్రోని ధర్మాబాద్, చంద్రాపూర్ తదితర ప్రాంతాల్లోని ప్రజలతో ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర తెలంగాణ జిల్లాల ప్రజలకు బంధుత్వాలున్నాయని ఆయన గుర్తు చేశారు.

03/22/2020 - 01:19

హైదరాబాద్: కరోనా వైరస్ నివారణకు రాష్ట్రంలోని దేవాలయాల్లో హోమాలు నిర్వహించేందుకు అనుమతిస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తెలిపారు. ప్రగతి భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ‘ఆంధ్రభూమి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సీఎం జవాబు చెబుతూ, విపత్కర పరిస్థితుల్లో, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఆలయాల్లో హోమాలు చేస్తుంటారన్నారు.

03/22/2020 - 01:18

హైదరాబాద్: తెలంగాణలో కరోనా నిర్ధారణకు సంబంధించి శనివారం మధ్యాహ్నం వరకు 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్‌లో శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఇప్పటికే గాంధీ, ఉస్మానియా, ఐపీఎం, ఫీవర్ ఆసుపత్రి, చెస్ట్ దవాఖానాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. తన అభ్యర్థన మేరకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్

Pages