S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/22/2020 - 01:16

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అవహేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు.

03/22/2020 - 01:15

హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారిని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్వం సిద్ధమయ్యాయి. స్వచ్ఛందంగా ప్రజలు జనతా కర్ఫ్యూకు మద్దతు పలకాలని అటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో ఆదివారం నాడు ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనున్నది. అత్యవసర సేవలకు మాత్రం ప్రజలు ఇంటి నుంచి బయటపడాలని సూచించడంతో ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు.

03/22/2020 - 01:23

హైదరాబాద్: విదేశాల నుండి రాష్ట్రానికి వస్తున్నవారు ఆరోగ్యం ఏ మాత్రం బాగా లేకపోయినా బయట తిరగవద్దని చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నానని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, విదేశాల నుండి వస్తున్న వారిలో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానం ఏ మాత్రం ఉన్నా, వెంటనే ఐసోలేట్ కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

03/22/2020 - 01:10

హైదరాబాద్, మార్చి 21: కరోనా నివారణకు తెలంగాణలో 24 గంటల పాటు స్వచ్ఛందంగా బంద్ పాటిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ఇచ్చారు. ప్రగతి భవన్‌లో శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు ప్రజలు ఎవరూ రోడ్లపైకి రావద్దని విజ్ఞప్తి చేశారు.

03/22/2020 - 00:13

మాటల సినిమాగా 1931 మార్చి 14న విడుదలైన ‘ఆలం ఆరా’
*

03/22/2020 - 00:10

మాళవికా శర్మ
*
ఫొటో బై రవికుమార్ చౌదరి

03/22/2020 - 00:06

పంచపాదం పితరం ద్వాదశాకృతం
దివ ఆహుః పరే అర్థే పురీషిణం
అధౌమే అన్య ఉపరే విచక్షణం
సప్తచక్రీ షకోర ఆహురర్పితమితి
- ఋగ్వేదం

03/21/2020 - 23:56

ఇవి యేమి పూవులో
ఇవి యేమి తావులో
చెట్ల కొమ్మలు ఎంత పుకిలించెను..

ఎండ కన్నుల రంగు
ఎన్ని వనె్నలు పొంగు
ఇప్పుడీమేరలో ఇగిరించెను..

వనసీమకీ పూట
జన వాటి నీ చోట
కిరణాలు తోలుకొని యేతెంచెను..

చూచిపోవే తల్లి
చూచి పోరా తండ్రి
చిగురు వనె్నల దొనె్న చారణాలు..

చూచి పోవే తల్లి
చూచి పోరా తండ్రి
తులకించు మెలపులీ తోరణాలు..

03/21/2020 - 23:55

సూర్య గురులు శుభగ్రహాలు. పారదర్శక గ్రహాలు. శుద్ధ గ్రహాలు. అంటే అశుద్ధతకు అవకాశమివ్వని గ్రహాలు. ఒకవిధంగా ఈ రెండు గ్రహాలను పవిత్ర గ్రహాలుగాను పరిగణిస్తున్నాం. ఇక్కడ పవిత్రం అంటే అపవిత్రతకు తావులేని గ్రహాలని అర్థం. పైగా సూర్య గురులు మంచి స్నేహితులు. అంటే సఖ్య గ్రహాలు. ఈ కారణంగా సూర్య గురులు యోగ కారకులు. అంటే యోగ సాధకులకు, ధ్యానులకు హితులు, అనుకూలురు.

03/21/2020 - 23:50

చైత్రానికి కుసుమాంజలితో
వయ్యారాల వసంతాన్ని ఆహ్వానిస్తూ
ఆమని కోయిలలు గానం చేసే గొంతుకతో
కవి కోయిలలు పరవశించి పలికిన పదాలతో
ఆశాభావాల్తో ఆహ్వానించాలని పించింది ఉగాదిని.

మరాఠీల గుడెపగ్వా, మళయాళీల విషు,
తమిళుల పూత్తాండు, కన్నడ కూగీ హేలు,
సిక్కుల వైశాఖి, బెంగాలీల పోయ్‌లా బైశాఖి -
ఎక్కడైనా ఉగాదే అదే ‘యుగాది’,
నూతన జీవనానికి ‘నాంది’.

Pages