S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/18/2016 - 00:38

ముంబైలో నిర్వహించిన ప్రతిష్టాత్మక మారథాన్‌కు విశేష స్పందన లభించింది. దాదాపు 50వేలమంది ఔత్సాహికులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు తరలివచ్చారు. అందాలనటి కత్రినాకైఫ్, ఆమె ట్రెయినర్ యాస్మిన్ కరాచీవాల, ప్రముఖ నటులు ఆర్.మాధవన్, గుల్షన్‌గ్రోవర్, అబ్రహం సహా పలువురు హాజరయ్యారు. మంచి ఆరోగ్యం, చక్కటి ఫిట్‌నెస్ ఉండాలంటూ చైతన్యం కలిగించేందుకు ఏటా ఈ మారథాన్ నిర్వహిస్తారు.

01/18/2016 - 00:32

‘నాన్నకు ప్రేమతో.. చిత్రం ఓ బొమ్మ అయితే, దేవిశ్రీ తన సంగీతంతో దానికి ప్రాణం పోశాడు. నా జీవితంలో ఓ భావోద్వేగమైన పాటగా ఇది నిలిచిపోతుంది. నాన్నకు ప్రేమతో టైటిల్ పాట అనుభూతిని మిగిల్చింది’ అని నటుడు ఎన్టీఆర్ తెలిపారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి పతాకంపై ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్‌లో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ విడుదలైన సంగతి తెలిసిందే.

01/18/2016 - 00:28

సిద్ధార్థ్, త్రిష, హన్సిక ప్రధాన తారాగణంగా సర్వంత్ రామ్ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ పతాకాలపై అందిస్తున్న చిత్రం ‘కళావతి’. తమిళంలో ‘అరన్మణి-2’గా విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడు సుందర్ సి. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం దిల్‌రాజు విడుదల చేసి, తొలి కాపీని సుందర్ సికి అందించారు.

01/17/2016 - 22:34

నిన్ను వదిలి వెళ్లడం తప్పదా మమీ కన్నీళ్లతో అడిగాడు వరుణ్. ‘ఈ ఒక్క సంవత్సరమే నాన్నా, వచ్చే సంవత్సరం నుంచి మనిద్దరం కలిసే ఉంటాం, సరేనా? అంటూ అనునయించింది సీత.
‘అయితే ఈ రోజంతా నువ్వు నాతో ఉండు. రేపే నేను స్కూళ్లో జాయిన అవుతా’
‘సరే’నంటూ ఇద్దరూ కలిసి గుడి, పార్కు, రెస్టారెంటూ తిరిగి రాత్రికి ఇంటికి చేరారు.

01/17/2016 - 22:32

నిన్ను వదిలి వెళ్లడం తప్పదా మమీ కన్నీళ్లతో అడిగాడు వరుణ్. ‘ఈ ఒక్క సంవత్సరమే నాన్నా, వచ్చే సంవత్సరం నుంచి మనిద్దరం కలిసే ఉంటాం, సరేనా? అంటూ అనునయించింది సీత.
‘అయితే ఈ రోజంతా నువ్వు నాతో ఉండు. రేపే నేను స్కూళ్లో జాయిన అవుతా’
‘సరే’నంటూ ఇద్దరూ కలిసి గుడి, పార్కు, రెస్టారెంటూ తిరిగి రాత్రికి ఇంటికి చేరారు.

01/17/2016 - 22:09

ఈ అనంత కోటి సృష్టికి మూలం భగవంతుడు. మనము ఆ భగవంతుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలము. నింగి, నేల, గాలి, నీరు, అగ్ని పంచభూతాలను వరంగా ప్రసాదించాడు. వాటిని మనం సక్రమంగా వినియోగించుకొంటే జీవితం ఆనందమయం అవుతుంది భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి సైతం భగవంతుని యందు భక్తి, ప్రకృతి అందు సంరక్షణ కలిగియుండాలి.

01/17/2016 - 21:15

సావాసగాండ్రను తీసుకుని వచ్చి వాళ్లకు మేము వండుకున్నవన్నీ పంచి పెట్టాడు. చట్లన్నీ ఖాళీ అయిపోయేట్లు చేశాడు. కుండలు పగలగొట్టాడు. దూడల కట్టు తాళ్ళు విప్పి తల్లుల దగ్గరకు తోలాడు. ఆవుల పొదుగులలో ఒక్క చుక్క పాలు కూడా అవి మిగల్చలేదు. పిల్లలు ఏడ్చినా ఇంట్లో పాలు, పెరుగు లేకుండా చేశాడు. మా ఇల్లు కొల్లబోయింది. నల్లపూసల తాడు ఎప్పటినుంచో అమర్చుకుంటే బాగుండుననుకుంటున్నాను.

01/17/2016 - 21:07

కాబట్టి మీరు నాకోసం సంబంధాలేం వెతకొద్దు. నావల్ల నీలూ పెళ్లి ఆలస్యం అవుతుందనుకుంటే దానికి చేసెయ్యండి నాకేం అభ్యంతరం లేదు. అయినా జీవితానికి పెళ్ళొక్కడే పరమావధి అన్నట్టు మాట్లాడతారేంటి? ఇప్పుడిప్పుడే నేను పెళ్లి చేసుకోను. ఏది ఏమైనా నేను ఖచ్చితంగా అమెరికా వెళ్లి ఎం.ఎస్. చెయ్యాల్సిందే’’ అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పింది.

01/17/2016 - 21:02

క. ఘనముగ నయ్యింద్రోత్సవ
మొనరించు మహీనతులకు నొగి నాయుర్వ
ర్ధనము నగుఁ బెరుఁగు సంతతి
యనవరతము ధరణిఁ బ్రజకు నభివృద్ధి యగున్

01/17/2016 - 08:41

సిడ్నీ, జనవరి 16: వరుస విజయాలతో దూసుకుపోతున్న టెన్నిస్ డబుల్స్ జంట సానియా మీర్జా- మార్టినా హింగిస్‌ల ఖాతాలోకి మరో విజయం వచ్చి చేరింది. 29వ వరుస విజయంతో ఈ ఏడాది శుభారంభం చేసిన సాన్‌టినా శుక్రవారం సిడ్నీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో విజయభేరి మోగించింది. కరోలిన్ గార్షియా, క్రిస్టినా మ్లడెనోవిక్ జంటపై 1-6, 7-5, 10-5 స్కోరుతో గెలిచి తమ జంటకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది.

Pages