S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/17/2016 - 08:33

బీజింగ్, జనవరి 16: ఆసియా వౌలికాభివృద్ధి బ్యాంక్ (ఎఐఐబి)ను శనివారం ఇక్కడ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఘనంగా ప్రారంభించారు. భారత్, మరో 56 దేశాలు వ్యవస్థాపక సభ్యులుగా వ్యవహరిస్తున్న ఈ బ్యాంక్‌ను గత నెల 25న బీజింగ్‌లో చైనా స్థాపించినది తెలిసిందే.

01/17/2016 - 08:30

న్యూఢిల్లీ, జనవరి 16: స్టార్టప్‌ల విషయంలో భారత్ ఆలస్యంగా నిద్ర లేచిందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అయితే గతంలో తాను ఆర్థిక మంత్రిగా పని చేసినందున ఈ ఆలస్యానికి తానే బాధ్యత వహిస్తానని చెప్పారు. చిన్న పారిశ్రామికవేత్తలకు అనువైన వాతావరణాన్ని కల్పించడం గురించి రాష్టప్రతి మాట్లాడుతూ, ‘ఈ జాప్యానికి బాధ్యతను నేను ఎవరిమీదకో నెట్టలేను.

01/17/2016 - 08:11

కెపిహెచ్‌బికాలనీ, జనవరి 16: గ్రేటర్ ఎన్నికలను పురస్కరించుకొని కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో శనివారం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. ఆయా ప్రాంతాలలో కార్పోరేటర్‌లుగా పోటీ చేసేందుకు ఉత్సాహం ఉన్న అభ్యర్ధులతోపాటు పార్టీ ప్రకటించిన ఆయా అభ్యర్ధులు నామినేషన్లను దాఖలు చేసేందుకు వారి వారి అనుచరులతో పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

01/17/2016 - 08:48

హైదరాబాద్, జనవరి 16: త్వరలో జరగనున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపును అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కేవలం 43శాతం మాత్రమే ఓట్లు పోల్ అయ్యాయని, ఈ సారైనా పోలింగ్ శాతాన్ని పెంచాలన్న సంకల్పంతో ఉన్న అధికారులు ఇప్పటికే ఓటర్ల సౌకర్యార్దం ప్రత్యేక యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే!

01/17/2016 - 07:47

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లు అంటే ఉరుకులూ పరుగులూ, నెల రోజుల ముందు నుండే సన్నద్ధత, రికార్డులు సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకోవడం, మంత్రులతో భేటీలు, ఎమ్మెల్యేలతో చర్చలు, ఎంపిలతో మాట్లాడటం ఇలా కోలాహలంగా ఉండేది, కాని నేడు గుట్టుచప్పుడు కాకుండానే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లు జరిగిపోతున్నాయి, అంతే కాదు, దాదాపు ప్రతి రోజూ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లే, ఒక రోజు ప్రత్యక్షంగానూ, మరో రోజు వీడియో కాన్ఫర

01/17/2016 - 07:45

‘‘నీకు ప్రపంచ పటాల గురించి తెలుసా? ’’
‘‘ఓ సినిమాలో కృష్ణ్భగవాన్ చెప్పినట్టు మేమూ టెన్త్ పాసైన వాళ్లమే. దేశాలను గుర్తించే పరీక్షలు రాసిన వాళ్లమే. ఆబిడ్స్ హెడ్ పోస్ట్ఫాసు చుట్టూ, సికిందరాబాద్ స్టేషన్ వద్ద, రాజేశ్వర్ థియేటర్ వద్ద శ్రీరామా బుక్ డిపో ఉంది కదా? అక్కడ కూడా దొరుకుతాయి ’’
‘‘కవి హృదయం అర్ధం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటావ్! కొనుక్కోవడానికి కాదు నేనడిగింది’’

01/17/2016 - 07:42

ప్రణాళిక రచించు. లేదా రచించబడిన ప్రణాళికలో భాగమైపో. ఇదీ వర్తమాన రాజకీయ నీతి. దీనినే చాణక్యుడు షడ్యంత్రం అంటాడు.
జాతికి గల స్వేచ్ఛ వేరు. దేశ స్వేచ్ఛ వేరు. ప్రజల స్వేచ్ఛ వేరు. అప్పుడప్పుడు జాతి, దేశం కలగలిసిపోతుంది. దానినే కొంతమంది దేశీయత, జాతీయత అని అంటారు. దేశాలకు స్వేచ్ఛ ఏ ప్రాతిపదికన ఉంటుందనేది ఆయా స్థల కాలాలను బట్టి ఉంటుంది.

01/17/2016 - 07:37

వరుసగా మూడో ఏడాది కూడా విద్యాభివృద్ధికై విరాళాన్ని ఇవ్వడంలో అజీమ్ ప్రేమ్‌జీ మూడో స్థానంలో నిలిచాడు. ఈయన ఇచ్చిన విరాళం రూ.27,514 కోట్లు. ఈయన తర్వాత నందన్ నీలేఖని, నారాయణమూర్తి, కె.దినేష్, శివనాడార్‌లు వరుసగా వున్నారు. ఆసుపత్రులకు విరాళాన్ని ఇచ్చే వర్గాల్లో దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబాని పదో స్థానంలో వున్నాడు.

01/17/2016 - 07:12

శ్రీశైలం, జనవరి 16:సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

01/17/2016 - 07:03

చంద్రగిరి, జనవరి 16 : ‘మనం చేసే కర్మ ఫలాలే భవిష్యత్తు తరాలు అనుభవిస్తామని స్వామి వివేకానంద చెప్పిన సూక్తి అక్షర సత్యం. అందుకే ఇప్పుడు మనం మంచి పనులు చేస్తే అవి భవిష్యత్తు తరాల వారికి అంది మేలు చేస్తాయ‘అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్రాంతి సంబరాలు నారావారి పల్లెకు విచ్చేసిన సిఎం చంద్రబాబు నాయుడు శనివారం తిరుగు ప్రయాణం అవడానికి ముందు విలేఖరులతో మాట్లాడారు.

Pages