S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/17/2016 - 07:00

సూళ్లూరుపేట, జనవరి 16: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం ఇస్రో ప్రతిష్టాత్మకంగా నింగిలోకి పంపనున్న సతీష్ థావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పిఎస్‌ఎల్‌వి సి-31 రాకెట్ ప్రయోగం ఈనెల 20న జరగనుంది. నావిగేషన్ సేవలకు సంబంధించిన శ్రీహరికోట నుంచి నింగిలోకి పంపించేందుకు ఇస్రో ఈరాకెట్ ప్రయోగం చేస్తోంది. రాకెట్ ప్రయోగ ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేసింది.

01/17/2016 - 06:57

ముంబయి, జనవరి 16: సంజయ్ లీలా బన్సాలీ తీసిన ‘బాజీ రావ్ మస్తానీ’ చిత్రం ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో సగం అవార్డులను ఎగరేసుకు పోయింది. శుక్రవారం రాత్రి ప్రకటించిన అవార్డుల్లో ఆ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమగాయని ఉత్తమ కొరియోగ్రాఫీ సహా మొత్తం తొమ్మిది అవార్డులను దక్కించుకుంది. కాగా, ‘పికు’ చిత్రంలో నటనకు గాను దీపికా పదుకోనెకు ఉత్తమ నటి అవార్డు లభించింది.

01/17/2016 - 06:39

మహబూబ్‌నగర్, జనవరి 16: ఆర్డీఎస్ ఎగువ ప్రాంతంలో తుంగభద్ర నదిపై కర్నాటక ప్రభుత్వం మరో ప్రాజెక్టును నిర్మించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే తుంగభద్ర నుండి ఆర్డీఎస్‌కు (రాజోలిబండ) రావల్సిన నీటి కేటాయింపులు లేక ఒకపక్క ఆయకట్టుకు నీరందక ఆయకట్టు బీడు వారింది.

01/17/2016 - 06:35

విజయవాడ, జనవరి 16: సికింద్రాబాద్ మాజీ శాసనసభ్యురాలు, ప్రఖ్యాత సినీ నటి జయసుధ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నివాస గృహంలో ఆయన సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.

01/17/2016 - 06:28

హైదరాబాద్, జనవరి 16: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో మిత్రపక్షాలైన తెలుగు దేశం- భారతీయ జనతా పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ‘చిచ్చు’ సద్దుమణగలేదు. ఆశావాహుల ఆందోళనలు, నిరసనలతో రెండు పార్టీల కార్యాలయాలు హోరెత్తాయి. గత ఎన్నికల్లో విజయం సాధించిన, బలమైన డివిజన్లను పంపకానికి ఎలా పెడతారంటూ రెండు పార్టీల్లోనూ ఆశావహులు, అనుచరులు నిలదీస్తున్నారు.

01/17/2016 - 06:16

హైదరాబాద్, జనవరి 16: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయ. రాజకీయ పార్టీల్లో రెబెల్స్ సంఖ్య పెరుగుతోంది. బలం లేదని టికెట్ ఇవ్వనన్నారు.. స్వతంత్రంగా మా బలమేంటో చూపిస్తామంటూ రంగంలోకి దిగుతున్న రెబెల్స్ బెడద అన్ని పార్టీలనూ పీడిస్తోంది. నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరిరోజు కావడంతో శనివారం ఒక్కరోజే వెయ్యి నామినేషన్లు దాఖలయ్యాయ.

01/17/2016 - 06:09

న్యూఢిల్లీ, జనవరి 16: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశి థరూర్ భార్య సునందా పుష్కర్‌ది సహజ మరణం కాదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బి.ఎస్.బస్సీ చెప్పారు. అయితే ఆమె శరీరంలో ఎలాంటి రేడియోధార్మిక పదార్థాల అవశేషాలు ఉన్నట్లుగా పరీక్షల్లో తేలలేదని ఆయన శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) మెడికల్ బోర్డు నివేదిక ఆధారంగా ఆయన ఈ విషయం చెప్పారు.

01/17/2016 - 06:06

న్యూఢిల్లీ, జనవరి 16: దేశంలో నూతన ఆవిష్కరణల వ్యాపారం ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. అలాంటి స్టార్టప్‌లకు మూడేళ్లపాటు పన్ను మినహాయింపు ప్రకటిస్తూ, మూడేళ్లపాటు తనిఖీలులేని విధానాన్ని, క్యాపిటల్ గెయిన్స్ పన్నునుంచి మినహాయింపు ప్రకటించారు. అలాగే పదివేల కోట్లతో కార్పస్ నిధి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు.

01/17/2016 - 06:04

న్యూఢిల్లీ, జనవరి 16: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 13 రాష్ట్రాల్లోని మైనారిటీ యువత ఐసీస్‌కు ఆకర్షితులు కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోలీసు, నిఘా సంస్థల అధిపతులు ఆదేశించారు. శనివారం తన కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఐసీస్ కుట్రలు, అరికట్టేందుకు పోలీసు, నిఘా సంస్థల కృషి, చర్యలను సమీక్షించారు. భారతదేశంలోని కుటుంబ విధానం, సంప్రదాయాలు, కుటుంబ విలువలు..

01/17/2016 - 06:02

హైదరాబాద్, జనవరి 16: ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాల అజమాయిషీలో ఇసుక వేలం పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలికింది. సరికొత్తగా ఇసుక రీచ్ వేలానికి రంగం సిద్ధం చేసింది. మూడు దశల్లో ఇసుక రేవుల వేలంపాట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యూబిక్ మీటర్‌కు 550 రూపాయిలు మించకుండా విక్రయాలు చేయనుంది. 550 రూపాయిల లోపు ఉండేలా విక్రయించాలని, అలాంటివారే ఈ-బిడ్డింగ్‌లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది.

Pages