S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/16/2016 - 22:34

‘ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయనగానే కొద్దిగా టెన్షన్ పడినమాట నిజమే. కామెడీ చేయడం కష్టమేనని అర్థమైంది. కానీ, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ విజయంతో పూర్తి కాన్ఫిడెన్స్‌తో వున్నా’ అని కథానాయకుడు శర్వానంద్ తెలిపారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై శర్వానంద్, సురభి జంటగా రూపొందిన ఎక్స్‌ప్రెస్‌రాజా ఈనెల 14న విడుదలైన సంగతి తెలిసిందే.

01/16/2016 - 18:47

చెన్నై: తమిళనాడులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. కడలూరు సమీపంలోని వానమతిదేవి గ్రామ శివారులో చెట్టును కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు సేలంలోని ఎంఐటీ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.

01/16/2016 - 18:36

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ఎన్నికలకు శనివారం ఒక్కరోజే 1003 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. తెరాస 277, భాజపా 93, తెదేపా 187, కాంగ్రెస్‌ 200, స్వతంత్ర అభ్యర్థులు 249 నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇప్పటి వరకు 1097 నామపత్రాలు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

01/16/2016 - 18:11

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో శనివారం సాయంత్రం ప్రముఖ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీలో చేరారు. పార్టీ కండువాతో ఆమెను చంద్రబాబు స్వాగతించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తెలుగువారందరికీ సేవ చేయాలన్న ఉద్దేశంతో టీడీపీలో చేరానని, హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చింది చంద్రబాబేనని జయసుధ చెప్పారు.

01/16/2016 - 17:18

చిత్తూరు: విలువలతో కూడిన జీవితం గడపాలని..టెక్నాలజీని వినియోగించుకుంటూ ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం నారావారిపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలన్నారు. నైపుణ్యం, సమర్థతతో ఏదైనా సాధించొచ్చని చెప్పారు.

01/16/2016 - 16:11

విశాఖపట్టణం: గ్రామాల అభివృద్ధితోనే రామరాజ్యం సాధ్యమని గాంధీ విశ్వసించారని, వెంకయ్య, తమ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై దృష్టిపెట్టిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. శనివారం ఇక్కడి గీతం వర్సిటీలో ప్రారంభమైన గాంధీ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించిన వెంకయ్య గ్రామాల అభివృద్ధితోనే రామరాజ్యం సాధ్యమని గాంధీ విశ్వసించారన్నారు.

01/16/2016 - 16:09

అనంతపురం: జిల్లా అభివృద్ధికి కొందరు అడ్డుపడుతున్నారని టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడిని ఆయన అనంతపురం నగరంలో రోడ్డు విస్తరణ పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ప్రభాకర చౌదరితో తనకు ఎలాంటి విభేదాలు లేవని జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు

01/16/2016 - 16:08

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ‘అంకుర భారత్‌’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పథకం ముఖ్యాంశాలను అరుణ్ జైట్లీ వివరించారు. ప్రధానిగా నరేంద్రమోదీ వచ్చాక దేశంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు.

01/16/2016 - 14:12

ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర గ్రామంలో ఉన్న పత్తి గోదాంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చే సరికి పత్తి పూర్తిగా కాలిపోయిందని బాధిత పత్తి రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.కోటి పత్తి ఆగ్నికి ఆహుతైందని తెలిపారు.

01/16/2016 - 14:11

హైదరాబాద్‌: విజయనగరం జిల్లా కొండశిఖరగూడలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్‌నెపంతో ఒకరిని హతమార్చారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మావోయిస్టుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.

Pages