S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/16/2016 - 14:07

ఆగిరిపల్లి: కృష్ణాజిల్లా కృష్ణవరంలో కోడిపందేల సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 10మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

01/16/2016 - 13:53

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని నగర పోలీసులు అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా ఆట కట్టించారు. సౌత్‌జోన్‌ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి 80 కేజీల గంజాయి సీజ్‌ చేశారు.

01/16/2016 - 13:51

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండగ సెలవులతో భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో 22 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం, కాలినడక భక్తులకు 6 గంటల సమయం, శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.

01/16/2016 - 13:50

విశాఖ: మునగపాక మండలం కొండకర్లలో విషాదం అలముకుంది. జలపాతం దగ్గర నాటు పడవ బోల్తా పడిన ఘటనలో దంపతులు మృతి చెందారు. జలపాతం చూసేందుకు దంపతులు వచ్చారని స్థానికులు చెప్పారు. మృతులు తునికి చెందిన నర్సింహారావు దంపతులని పోలీసులు చెప్పారు.

01/16/2016 - 13:48

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. ఈమేరకు రెండు పార్టీలు అవగాహనకు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉండగా బీజేపీ 60 స్థానాల్లో, టీడీపీ 90 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. రెండు పార్టీలు ఇవాళ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నాయి.

01/16/2016 - 13:36

హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం జోరందుకుంది. రెండు రోజుల మాత్రమే మిగిలి ఉండటంతో శనివారం భారీగా నామినేషన్ల దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. - బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు కుమార్తె విజయలక్ష్మీ నామినేషన్ వేశారు.

01/16/2016 - 13:26

ములుగు: వరంగల్‌ జిల్లా ములుగు మండలం జాకారం గ్రామ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. హన్మకొండ నుంచి ములుగు వస్తున్న ద్విచక్రవాహనం జాకారం సమీపంలోకి రాగానే ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

01/16/2016 - 13:19

చిత్తూరు : చంద్రగిరి మండలం రంగంపేట, పుల్లయ్యగారిపల్లిలో జల్లికట్టు ఆట ప్రారంభం అయ్యింది. బహుమానంతో కూడిన పలకను ఎద్దు కొమ్ములకు కట్టి...వాటిని గ్రామస్తులు ఊరిపై వదలనున్నారు. ఎద్దులను లొంగదీసుకొని పలకల కోసం యువకులు పోటీపడనున్నారు. యువకులు జల్లికట్టు పేరుతో పశువులను హింసించవద్దని పోలీసుల నోటీసులు పోలీస్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. రంగంపేటలో జల్లికట్టుకు ఏర్పాట్లు చేశారు.

01/16/2016 - 13:17

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. పామ్‌ అవెన్యూ ప్రాంతంలోని ఓ ఇంట్లో ముగ్గురి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమారులు వారి సొంతింట్లోనే నిర్జీవంగా పడి ఉండగా.. మహిళ భర్త తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

01/16/2016 - 13:13

హైదరాబాద్‌: విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మినుములూరులో 6, పాడేరులో 8డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్రతకు ఏజెన్సీవాసులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మరో వైపు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

Pages