S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/21/2015 - 06:26

హైదరాబాద్, డిసెంబర్ 20: విజయవాడ కాల్‌మనీ- సెక్స్ రాకెట్ కేసు ప్రకంపనల నేపథ్యంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలపై ఉక్కు పాదం మోపేందుకు రాష్ట్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వడ్డీ వ్యాపారుల నియంత్రణ బిల్లు రూపొందించేందుకు కసరత్తును ప్రారంభించింది. ఈ బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టడం అనుమానమే.

12/21/2015 - 06:25

హైదరాబాద్, డిసెంబర్ 20: కాల్ మనీపై రాజకీయాలు వద్దని బిజెపి అగ్ర నాయకుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. కాల్ మనీపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం మాని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పాలక, ప్రతిపక్షాలకు సూచించారు.

12/21/2015 - 06:24

హైదరాబాద్, డిసెంబర్ 20: హైదరాబాద్‌లోని నాగోల్ ప్రాంతంలో కల్తీ నూడుల్స్, పహాడీ షరీఫ్‌లోని కల్తీ నూనె తయారు చేస్తున్న కేంద్రాలను సౌత్‌జోన్ టాస్క్ఫోర్సు ఆదివారం సీజ్ చేశారు. ఆరుగురిని ఆరెస్టు చేసి ఏడు వందల నూడుల్స్ బస్తాలు, 70 బస్తాల పిండి, నాలుగు డ్రమ్ముల నూనెను స్వాధీనం చేసుకున్నారు.

12/21/2015 - 06:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసే క్రమంలో భారత దేశాన్ని బానిస దేశంగా మార్చిన ఈస్టిండియా కంపెనీ చరిత్రను పునరావృతం చేయవద్దని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరించారు.

12/21/2015 - 06:23

న్యూఢిల్లీ, డిసెంబర్ 20:్ఢల్లీ క్రికెట్ బోర్డులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలను నిగ్గు దేల్చేందుకు మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం సారథ్యంలో దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.

12/21/2015 - 06:22

హైదరాబాద్, డిసెంబర్ 20: కృష్ణా నదిలో శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీరు అడగంటి డెడ్ స్టోరేజికి చేరుకోవడంతో వచ్చే వేసవిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని, ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. శ్రీశైలంలో ప్రస్తుతం 30 టిఎంసి నీరు మాత్రమే అందుబాటులో ఉంది.

12/21/2015 - 05:39

విజయవాడ, డిసెంబర్ 20: కూచిపూడిని అభివృద్ధి చేసే విషయంలో నాట్యశాస్త్రాన్ని ఔపోసన పట్టి నాట్యరంగానికే జీవితాలను అంకితం చేసినవారే సారథ్యం వహించాలని, అప్పుడే పూర్తి న్యాయం జరుగుతుందని ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచారిణి, శంకరాభరణం ఫేం మంజుభార్గవి అన్నారు.

12/22/2015 - 05:43

సౌదీ అరేబియా ఇతర దేశాలలోని మసీదులకు నిధులు సమకూర్చడమే కాకుండా, ఛాందస వాహబీ ఇస్లాంను ప్రోత్సహిస్తున్నదని జర్మనీ ఛాన్సలర్ బహిరంగంగా ప్రకటించారు. ప్రపంచంలో వహాబీ ఇస్లాం విస్తరించడానికి ప్రధాన కారణం ఇదే. అమెరికాకు ఇది తెలియంది కాదు. అమెరికా విదేశాంగ మంత్రిగా పనిచేసిన మడెలైన్ అల్‌బ్రైట్, సౌదీ రాజు ఫహద్‌తో చర్చలు జరిపినప్పుడు, ఇతర దేశాల్లోని మసీదులకు నిధులను సమకూర్చే అంశాన్ని లేవనెత్తారు.

12/21/2015 - 04:52

‘‘చదువురాని మొద్దూ... కదలలేని ఎద్దు’’- మళ్లీ మరోసారి అదే పాట- ‘‘చదువురాని మొద్దూ’’- కుర్రవాడు తన్మయంగా సూక్తులు వల్లెవేసేస్తున్నాడు బాలుడు. వాళ్లయ్యకి మండిపోయింది.
‘‘పెద్దోళ్లని తిట్టిపించడానికట్రా? రుూ సతుకులు... మీయమ్మని పిలూ’’- అంటూ అరిచాడు రైతుకూలీ రాజయ్య. కుర్రాడు పుస్తకంలోంచి తలెత్తలేదు. ‘‘విద్యలేనివాడు వింత పశువు’’- అంటూ అందుకున్నాడు మళ్లీ.

Pages