S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/23/2019 - 23:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కేసుకు సంబంధించి డాక్యుమెంట్లు కావాలంటూ శనివారం నాడు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. భూముల కొనుగోలు, మనీలాండరింగ్‌కు సంబంధించి వాద్రా ఇప్పటికే పలుమార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు.

02/23/2019 - 23:43

భదోహి, ఫిబ్రవరి 23: ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో సంభవించిన పేలుడులో 13 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం ఒక షాపులో సంభవించిన ఈ పేలుడు వల్ల పక్కనున్న మూడు ఇళ్లు కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్టు భావిస్తున్నామని, వారిని రక్షించడానికి సహాయక చర్యలు ప్రారంభించామని వారు వివరించారు. రోహ్‌తా బజార్‌లోని ఒక షాపులో ఈ పేలుడు చోటు చేసుకుంది.

02/23/2019 - 23:33

వరంగల్, ఫిబ్రవరి 23: వరంగల్ నగరంలోని పలు సంపన్న కాలనీలో అద్దెకు ఉంటూ పగటి పూట దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల మూఠాను వరంగల్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుప్పుట్లు, బట్టల అమ్మకాల ముసుగులో పగటిపూట చోరీలకు పాల్పడుతున్న ఈ అంతర్రాష్ట్ర దొంగల మూఠాను చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. వివరాలను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ శనివారం కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు.

02/23/2019 - 23:33

గణపురం, ఫిబ్రవరి 23: ‘స్టేట్ బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నా... మీ ఖాతా వివరాలు కావాలి’ అంటూ ఆరు సార్లు వరుసగా ఫోన్‌లు చేసి ఖాతా వివరాలు తీసుకుని గంటలో ఖాతా నుండి రూ. 39వేలు మాయం చేసిన సంఘటన భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో జరిగింది. బాధితుడు బండి రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెల్పూరు గ్రామీణ వికాస్ బ్యాంకు అకౌంట్ నంబర్ 73085429835లో రమేష్ పేరున రూ.

02/23/2019 - 23:24

హైదరాబాద్, ఫిబ్రవరి 23: హైదరాబాద్ నగరంలోని ఒక ప్రముఖ ఆస్పత్రికి చెందిన వైద్యుడు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఆనారోగ్యం, మనోవేదనకు గురైన బాధితురాలికి వినియోగదారుల ఫోరమ్ న్యాయం చేసింది. బాధ్యుడైన వైద్యుడి నుంచి బాధితురాలికి రూ.5.50 లక్షల పరిహారాన్ని ఇప్పించింది. ఈ మేరకు శనివారం పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి అకున్ సబర్వాల్ నష్టపరిహారాన్ని బాధితురాలికి అందజేశారు.

02/23/2019 - 23:24

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ఐదుగురు పోలీస్ అధికారులను విచారించడానికి దర్యాప్తు అధికారులకు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాసులు, రాంప్రసాద్, హెచ్‌ఆర్ రెడ్డి, డీఎన్ రెడ్డిలపై బదిలీ వేటు పడింది. మరో ముగ్గురు ఏసీపీలు, ఇద్దరు సీఐలతో పాటు ఇద్దరు ఎస్‌ఐలు ఉన్నారు. వీరికి త్వరలో నోటీలు ఇవ్వనున్నారు.

02/23/2019 - 23:23

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ దాన కిషోర్ బినామీ పేర్లతో తన భూముల్లో అక్రమ నిర్మాణాలను చేపట్టారని ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ జీ దీపక్‌రెడ్డి ఆరోపించారు. ఈమేరకు హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మేనల్లుడైన దీలీప్‌రెడ్డి నిర్మాణాలను తక్షణం నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును అభ్యర్థించారు.

02/23/2019 - 23:17

ఖమ్మం, ఫిబ్రవరి 23: ఇటీవల కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో మావోయిస్టు చర్యలు అధికంగా జరుగుతుండటం, ఎన్నికల వేళ మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడతారనే సమాచారంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పోలీస్ అధికారులు ప్రత్యేకంగా వ్యూహరచన చేస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులు శనివారం పోలవరంలో సమావేశమయ్యారు.

02/23/2019 - 22:50

బెంగళూరు, ఫిబ్రవరి 23: కర్నాటకలోని ఎలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలో శనివారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్‌షో వద్ద సందర్శకుల వాహనాల పార్కింగ్‌వద్ద జరిగిన ప్రమాదంలో 300 వాహనాల దగ్ధమయ్యాయి. బెంగళూరు శివారు ఎలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఏషియా ప్రీయర్ ఎయిర్‌షో ఏర్పాటుచేశారు. షో చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు. సందర్శకులు పార్కింగ్ ఏరియాలోనే వాహనాలు నిలిపారు.

02/23/2019 - 02:00

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 22: విధి నిర్వహణలో పోలీసు అధికారులు, సిబ్బంది వృత్తి నైపుణ్యం మెరుగు పర్చుకునే ప్రక్రియలో భాగంగా కమిషనరేట్‌లో ప్రారంభమైన ‘మొబిలైజేషన్’ కార్యక్రమం శుక్రవారం సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు మైదానంలో కవాతుతో ముగిసింది.

Pages