S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/25/2019 - 02:36

కీసర, ఫిబ్రవరి 24: ఆదివారం కీసరలో పిచ్చికుక్క ముగ్గురు చిన్నారులపై దాడి చేసి గాయ పర్చింది. శివాజీనగర్ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం చిన్నారులు ఆరు బయట ఆడుకుటుండగా పిచ్చికుక్క చిన్నారులు నిత్య, వైష్ణవి, వేణుల చెయ్యి, నడుము, కాలిపై దాడిచేసి గాయ పర్చింది. వెంటనే అక్కడ ఉన్న కాలనీ వాసులు కుక్కను చంపే ప్రయత్నం చేయగా పారిపోయింది. చిన్నారులను వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స అందించారు.

02/25/2019 - 02:35

ఖైరతాబాద్, ఫిబ్రవరి 24: రాజ్‌భవన్ రోడ్‌లో ఆదివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన కారు నర్సింగ్ కాలేజీ మలుపు వద్ద ఖైరతాబాద్ వైపు నుంచి వస్తున్న డీసీఎంను ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన డీసీఎం రోడ్డుకు మధ్యలో ఏర్పాటు చేసిన ఫౌంటెన్లను ధ్వంసం చేసుకుంటూ కొంత దూరం ప్రయాణించి ఆగిపోయింది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

02/25/2019 - 02:28

గాజువాక (విశాఖ), ఫిబ్రవరి 24: నాటు సారాయి అనుకుని గుర్తు తెలియని రసాయనం (కెమికల్) తాగి ముగ్గురు మృతి చెందారు. మరో 12 మంది అస్వస్థతకు గురై విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న సంఘటన విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్ సమీపంలో గల ఎస్టీకాలనీలో ఆదివారం చోటుచేసుకుంది.

02/25/2019 - 02:27

తిరుపతి, ఫిబ్రవరి 24: తిరుమలలోని శేషాద్రినగర్ కాటేజీ రూమ్ నెంబరు 215లో ఢిల్లీ, పంజాబ్‌కు చెందిన పది మంది భక్తులు హుక్కా తాగుతుండగా తిరుమల టూ టౌన్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తిరుమలకు నిషిద్ధ వస్తువులు వెళ్లకుండా టీటీడీ యాజమాన్యం ప్రతి నెల లక్షల రూపాయలు చెల్లించి నిఘా వ్యవస్థ రూపొందించిన విషయం పాఠకులకు విధితమే.

02/24/2019 - 23:37

గౌహతి, ఫిబ్రవరి 24: అస్సాంలో కల్తీ మద్యం తాగిన విషాద సంఘటనలో మృతుల సంఖ్య 124కు పెరిగింది. మరో 331 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు ఆదివారం తెలిపారు. జోర్హాట్ వైద్య కళాశాల ఆసుపత్రి (జేఎంసీహెచ్)లో 71 మంది మృతి చెందగా, మరో 272 మంది చికిత్స పొందుతున్నారని ఆరోగ్య శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు.

02/24/2019 - 23:36

శ్రీనగర్, ఫిబ్రవరి 24: కాశ్మీర్‌లోయలో ఉగ్రవాదుల కోసం ఆర్మీ వేటను ముమ్మరం చేసింది. ఆదివారం దక్షిణ కాశ్మీర్‌లో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పుల ఘటనలో జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఒక డీఎస్పీ అధికారి అమరుడయ్యారు. కుల్గాం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిఘా సమాచారం మేరకు పోలీసులు ఈ ప్రాంతంలో గాలింపు చర్యలను ఉధృతం చేశారు.

02/24/2019 - 23:24

కామవరపుకోట/్భమడోలు, ఫిబ్రవరి 24: పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ప్రసిద్ధిచెందిన గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద ఆదివారం సాయంత్రం దారుణ ఘటన వెలుగుచూసింది. బౌద్ధారామాలను తిలకించడానికి వచ్చిన ప్రేమికులుగా భావిస్తున్న జంటలో యువతి దారుణ హత్యకు గురికాగా, యువకుడు తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

02/24/2019 - 22:29

సంగారెడ్డి, ఫిబ్రవరి 24: బతుకుదెరువు నిమిత్తం పిల్లాపాపలతో వలస వచ్చిన కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన సంఘటన జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పరిధిలోని హనుమాన్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ముగ్గురు బాలురు నీటి గుంతలో పడి విగత జీవులయ్యారు. సంగారెడ్డి రూరల్ సీఐ శివకుమార్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

02/24/2019 - 01:13

జీడిమెట్ల, ఫిబ్రవరి 23: గాజులరామారం డివిజన్ దేవెందర్‌నగర్, కట్టమైసమ్మ బస్తీలో ఇరు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకున్న సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే... కట్టమైసమ్మ బస్తీలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఓ గది, రెండు బేస్‌మెట్‌లను రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. అధికారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తుల పై స్థానికులు వివాదానికి దిగారు.

02/24/2019 - 01:11

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 23: ఈత నేర్చుకోవడానికి వచ్చి ఈత కొలనులో మునిగి ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శివరాంపల్లి వద్ద ఏ టూ జడ్ ఈత కొలనులో మహ్మద్ ఖాజా అనే విద్యార్థి శనివారం ఈత నేర్చుకోవడానికి వచ్చాడు. స్విమ్మింగ్ ఫూల్‌లో కోచ్ లేకపోవడంతో అక్కడ సరైన నిర్వాహణ లేని కారణంగా ఖాజా స్వతహాగా ఈత నేర్చుకునే ప్రయత్నం చేశాడు.

Pages