S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/12/2018 - 03:42

మేడ్చల్, ఫిబ్రవరి 11: మండలంలోని కోణాయిపల్లిలో భారీ చోరీ జరిగిన సంఘటన జరిగింది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొణాయిపల్లి గ్రామ వాస్తవ్యుడైన నరేందర్ సింగ్ శనివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంటిలో దొంగలు చొరబడి భారీ చోరికి పాల్పడ్డారు. ఇంటిలోనికి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి నరేందర్‌సింగ్ నిద్రిస్తున్న గది తలుపులను బయటి నుంచి మూసివేశారు.

02/12/2018 - 02:03

జూలూరుపాడు, ఫిబ్రవరి 11: మొదట చిల్లర దొంగల పనిలే అని అనుకున్నారు..తెల్లారే సరికి మరొక దొంగతనం జరగటంతో పోలీసులు దృష్టి సారించారు... ఇంతలోనే సరిగ్గా వారం రోజులకి మండల కేంద్రంలో దొంగలు మరొక పెద్ద దొంగతనానికే పాల్పడ్డారు.

02/12/2018 - 01:59

డోన్, ఫిబ్రవరి 11 : నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ప్యాపిలిలో మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. వ్యక్తిగత కక్షలతో ఓ యువకుడిని దారుణంగా నరికి చంపారు. ప్యాపిలి పట్టణానికి చెందిన బోయ మధు అలియాస్ బంగి మధు(32)పై ప్రత్యర్థులు ఆదివారం తెల్లవారుజామున వేటకొడళ్లతో దాడి చేసి దారుణంగా చంపారు. పోలీసులు తెలిపిన వివరాలు..

02/12/2018 - 01:36

నూజివీడు, ఫిబ్రవరి 11: ఏ కష్టం వచ్చిందో, ఏ ఇబ్బంది వచ్చిందో, ఎవరికీ చెప్పకుండా, ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఆర్ధిక పరిస్ధితుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నామని పేర్కొంటూ జీవితాంతం కలసి ఉండాల్సిన దంపతులు, ఇద్దరు కలసి ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన కలిదిండి నాగార్జున ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

02/12/2018 - 01:29

విశాఖపట్నం(క్రైం), ఫిబ్రవరి 11: ఆర్టీసీ బస్సు కింద పడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకరు నేవల్ ఉద్యోగి కాగా, మరొకరు గుర్తు తెలియని మహిళగా పోలీసులు గుర్తించారు. నగరంలోని మద్దిలపాలెం ప్రాంతంలో ఉంటున్న ఎఎస్‌జి నాగేంద్రబాబు (35) నేవల్‌లో పెట్టీ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు.

02/12/2018 - 01:25

విశాఖపట్నం(క్రైం), ఫిబ్రవరి 11: ఎన్‌ఏడీ కాలనీలో నివాసముంటున్న సాయివివేక్ ఎన్‌ఏడీ కొత్తరోడ్డు సమీపంలో గల ఎంఓవీలో క్యాజువల్ లేబర్‌గా పని చేస్తున్నాడు. దుర్గాపురంలో ఉంటున్న రాజుకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె (17) సమీపంలోని ఎన్‌ఏడీ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం పదవ తరగతి చదువుతుంది. స్కూలుకు వెళ్లినప్పుడు తరుచూ బాలిక వెంట సాయివివేక్ పడుతూ ప్రేమించమని వేధించేవాడని పోలీసులు తెలిపారు.

02/12/2018 - 00:42

సిరిసిల్ల, ఫిబ్రవరి 11: ఆదివారం సెలవు దినం కావడంతో ఇద్దరు చిన్నారుల పాలిట మృత్యువు రూపంలో కబలించింది. ఆదివారం సిరిసిల్ల మండలం చంద్రంపేట శివారులోని ఇటుక బట్టీల వద్ద ఆడుకోవడానికి వెళ్ళిన కార్మికుల కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువు పాలయ్యారు. బింజూ సునాన(4), రింకూ సునా(2) అనే ఇద్దరు పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి నీటి కోసం తవ్విన గుంతలో పడి దుర్మరణం పాలయ్యారు.

02/11/2018 - 23:59

చండూరు, ఫిబ్రవరి 11: కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన కురుపాటి శ్రీను, జిల్లా నరేష్‌లు తాపీ పని కోసం చొల్లేడు గ్రామానికి వెళ్తున్నారు.

02/12/2018 - 03:36

నల్లగొండ లీగల్, ఫిబ్రవరి 10: కక్షిదారులు తమ కేసులను లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకొని సమయం, ధనం ఆదా చేసుకోవచ్చని జిల్లా జడ్జి డి.తిరుమలరావు అన్నారు. శనివారం నల్లగొండలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో రాజీ పడిన ఫిర్యాదుదారుడికి అతను కోర్టుకు చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు.

02/11/2018 - 02:46

హైదరాబాద్, ఫిబ్రవరి 10: హైదరాబాద్‌లోని మెట్రోపాలిటన్ క్రిమినల్ కేసుల కోర్టు కాంప్లెక్స్‌లో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 9879 కేసులను పరిష్కరించారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన బాధితులకు 25.44 కోట్ల రూపాయల పరిహారం అందేవిధంగా తీర్పులు చెప్పారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

Pages