S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/08/2018 - 05:03

నర్సంపేట, డిసెంబర్ 7: నర్సంపేట మండలంలోని దాసరిపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో రూ.7.50లక్షల రూపాయల నగదును పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. దాసరిపల్లిలో ఓ కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో నగదు డంప్ అయిందని తెలుసుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లోకి దూసూకెళ్లి నగదును పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు.

12/08/2018 - 04:57

కొత్తకోట, డిసెంబర్ 7: మండల పరిధిలోని విలియంకొండ స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కర్నూల్ నుండి కారులో హైదరాబాద్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో లారీని వెనుక నుండి ఢీకొట్టగా సరస్వతి (50) అక్కడికక్కడే మృతిచెందింది.

12/08/2018 - 04:55

బాలానగర్, డిసెంబర్ 7: మండల కేంద్రంలోని పెట్ర వెంచర్ వద్ద శుక్రవారం నవీన్‌కుమార్(10) మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం కొత్వాల్‌గూడ శంషాబాద్ మండలానికి చెందిన రాజు అతని కుటుంబం వెంచర్‌లో ఆరేళ్లుగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓటువేయడానికి రాజు, అతని భార్య వెళ్లగా ప్రమాదవశాత్తు నవీన్‌కుమార్ గోతిలోపడి మృతి చెందినట్లు ఆయన తెలిపారు.

12/08/2018 - 04:51

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 7: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో ఓటు వేసేందుకు మద్యం తాగి వచ్చిన ఇద్దరిపై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్టు స్థానిక డీఎస్పీ పద్మనాధుల శ్రీనివాస్ తెలిపారు. అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామంలోని ధానవత్ హరి అనే అతను మద్యం సేవించి పోలింగ్ కేంద్రానికి రాగా బ్రీత్ ఎనలైజర్ పెట్టామన్నారు.

12/08/2018 - 04:47

కోల్‌కతా: తమ రథయాత్రకు అనుమతి కోరుతూ బీజేపీ చేసిన విజ్ఞప్తిపై సరైన రీతిలో స్పందించని పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపై ఈనెల 14లోగా అధికారులు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. బీజేపీ చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వ వౌనం ఆశ్చర్యం, దిగ్భ్రాంతిని కలిగించిందని జస్టిస్‌లు విశ్వనాథ్ సోమద్దర్, ముఖర్జీలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

12/08/2018 - 02:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: రిజర్వు బ్యాంకు అదనపుమూలధన నిల్వల విషయంలో జోక్యంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఇందుకు సంబంధించి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన న్యాయవాది ఎంఎల్ శర్మ 50వేల రూపాయలు వ్యాజ్యం విలువగా న్యాయస్థానానికి చెల్లించాలని తీర్పునిచ్చింది.

12/08/2018 - 01:55

విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో వైసీపీ నేత జగన్‌పై గత అక్టోబర్ 25న హత్యాయత్నానికి పాల్పడిన జే శ్రీనివాస్‌కు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. వచ్చే నెల 21 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే మూడు సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం తిరస్కరించింది. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన కేసుకు సంబంధించి, ఇప్పటికే హైకోర్టులో వాజ్యం నడుస్తోంది.

12/08/2018 - 01:09

న్యూఢిల్లీ: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 61 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుడదని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపు గరిష్ఠంగా 50 శాతం మించి పెంచేందకు వీలులేదని ఉమ్మడి హైకోర్టు ఇంతకు ముందే మధ్యంతర ఉత్తర్వులు జారి చేసింది.

12/08/2018 - 00:34

గుంటూరు (లీగల్), డిసెంబర్ 7: దేశవ్యాప్తంగా వివిధ రైల్వే ట్రిబ్యునళ్లలో 33 వేల కేసులు విచారణలో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ట్రిబ్యునళ్ల సంఖ్యను పెంచి విచారణ కొనసాగిస్తున్నామని ఢిల్లీలోని రైల్వే క్లైమ్స్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ చైర్మన్ జస్టిస్ కె కన్నన్ వెల్లడించారు.

12/07/2018 - 03:52

చందర్లపాడు, డిసెంబర్ 6: కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం పొక్కునూరు గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న పవర్ గ్రిడ్ విద్యుత్ టవర్ కుప్పకూలిపోవడంతో పనులు నిర్వహిస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు కార్మికులు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన కేటీపీఎల్ (కల్పతరు ప్రెవేటు లిమిటెడ్ కంపెనీ) ఆధ్వర్యంలో పవర్ గ్రిడ్ విద్యుత్ టవర్‌ల నిర్మాణం జరుగుతోంది.

Pages