S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/17/2020 - 06:01

గచ్చిబౌలి, జనవరి 16: రెండు వారాలుగా కనిపించకుండా పోయన ఐటీ ఉద్యోగిని రోహిత అదృశ్యం కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులు, భర్త నుంచి దూరంగా వెళ్లి ఉద్యోగం సంపాదించుకుని స్వతంత్రంగా జీవించాలని పారిపోయినట్లు పూణె పోలీసులకు రోహిణి వాంగ్మూలం ఇచ్చింది.

01/17/2020 - 06:00

అల్వాల్, జనవరి 16: రాజీవ్ రహదారిపైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సంఘటన అల్వాల్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరయాంజాల్ - హకీంపేట చౌరస్తాలో జరిగింది. అల్వాల్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం మచ్చబొల్లారం నివాసులైన జగదీష్, శిరీష్ తూంకుంటలోని బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకలకు జనవరి 14 రాత్రి హాజరై తిరిగి హకీంపేట నుంచి మచ్చబొల్లారంలోని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.

01/17/2020 - 05:59

ఘట్‌కేసర్, జనవరి 16: ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధి అవుషాపూర్‌లో గురువారం తెల్లవారుఝామును జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

01/17/2020 - 05:57

కేపీహెచ్‌బీకాలనీ, జనవరి 16: స్నేహితుల మధ్య తగాదా హత్యకు దారి తీసిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి పర్వదినం సందర్భంగా కేపీహెచ్‌బీకాలనీ 3వ ఫేజ్‌లోఆజ్‌బెస్టాస్ కాలనీలో నివాసం ఉంటున్న జోసెఫ్ సుమన్ అనే వ్యక్తి కేపీహెచ్‌బీకాలనీలోని తన స్నేహితుడు ప్రశాంత్, మరి కొందరి స్నేహితులతో కలిసి సుమన్ ఇంటిపై పార్టీ చేసుకున్నారు.

01/17/2020 - 00:58

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు మరణశిక్ష అమలుకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై సరైన నివేదిక అందజేయాలని తీహార్ జైలు అధికారులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి సతీష్ కుమార్ అరోరా పలు ఆదేశాలు ఇచ్చారు. ఉరి తేదీని మార్చాలని తీహార్ జైలు అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

01/15/2020 - 05:34

వనపర్తి, జనవరి 14: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా సోమవారం రాత్రి వనపర్తి సమీపంలోని ఎకో పార్కు వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసుల పైకి కారు దూసుకోని వెళ్లడంతో కారును ఆపడానికి వెళ్లిన హెడ్‌కానిస్టేబుల్ (హెచ్‌సీ నెంబర్ 1733) సలీమ్‌ఖాన్ (57) మృతి చెందాడు.

01/15/2020 - 05:01

రావులపాలెం, జనవరి 14: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలో చోటు చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి లేని కారణంగా బాలిక ఓ హాస్టల్‌లో తొమ్మిదవ తరగతి చదువుకుంటోంది. సంక్రాంతి సెలవులు కావటంతో తన స్వగ్రామం వచ్చింది. ఆదివారం రాత్రి కన్నతండ్రి కూతురని కూడా చూడకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు.

01/15/2020 - 05:00

కొత్తచెరువు, జనవరి 14: నాలుగేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం జరిపాడు. అనంతపురం జిల్లా కొత్తచెరువులో మంగళవారం ఈ దారుణం జరిగింది. కొత్తచెరువుకు చెందిన బోయ వెంకటేష్(70) స్థానిక మఠంలో నివసిస్తున్నాడు. మంగళవారం అంగడి వద్ద ఆడుకుంటున్న చిన్నారి(4)ని చాక్‌లెట్ ఇస్తానని చెప్పి మఠం లోపలికి తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు.

01/15/2020 - 04:02

వికారాబాద్, జనవరి 14: పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వెండి ఆభరణాలు, నగదును సీజ్ చేశారు. ఈ సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణానికి చెందిన జ్యూవలెరీ వ్యాపారి మురళీకృష్ణ సోమవారం హైదరాబాద్ నుంచి తాండూరుకు కారులో వెళ్తున్నాడు. అనంతగిరి ఘాట్ రోడ్డులోని కెరెళ్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేశారు.

01/15/2020 - 00:30

హైదరాబాద్: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో తవీనకొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కొనుగోళ్లలో అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 22 మందిని అరెస్టు చేసింది.

Pages