S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/14/2018 - 04:29

విజయవాడ (క్రైం), జూలై 13: ఇంటర్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పటమట పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... తాడేపల్లిగూడెంలో నివాసముంటున్న మాన్యం శ్రీనివాసరావు స్థానికంగా ఎస్‌బిఐ బ్యాంకు బ్రాంచి మేనేజర్‌గా పని చేస్తున్నారు.

07/14/2018 - 02:50

నిజామాబాద్, జూలై 13: నిజామాబాద్ జిల్లా కేంద్రంగా గంజా యి అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. అటు పోలీసులు, ఇటు ఆబ్కారీ శాఖ అధికారులు ఇటీవలి కాలంలో తరుచూ దాడులు నిర్వహిస్తూ నిల్వలను స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ, గంజాయి స్మగ్లింగ్ దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.

07/14/2018 - 02:33

నార్సింగి, జూలై 13: నానక్‌రాంగూడలో జరిగిన భారీ పేలుళ్లతో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుళ్లతో స్థానిక ప్రజలు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. ఈ భారీ పేలుళ్లకు చుట్టుపక్కల అపార్ట్‌మెంట్స్‌కు పగుళ్లు ఏర్పడగా, మరికొన్ని అపార్ట్‌మెంట్స్ అద్దాలు పగిలి, లోపల ఉన్నవారికి కూడా గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

07/14/2018 - 01:56

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో జరిగే కార్యకలాపాల నియంత్రణ, నిఘా కోసం కేంద్రం ఆధ్వర్యంలోని సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా హబ్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై సుప్రీం తీవ్రంగా స్పందించింది.

07/14/2018 - 00:40

డీ.హీరేహాల్, జూలై 13 : మండలంలోని తమ్మెపల్లి గ్రామంలో బోయ అక్కమ్మ (35) శుక్రవారం హత్యకు గురైంది. సీఐ చలపతిరావు తెలిపిన వివరాల మేరకు మృతురాలి భర్త గంగాధర్ తాగుడుకు బానిసై డబ్బు కోసం అక్కమ్మను నిత్యం వేధించేవాడు. ఇందులో భాగంగానే కూలి పని ముగించుకుని ఇంటికి వచ్చిన అక్కమ్మను డబ్బులు ఇవ్వమని గొడవపడ్డాడు.

07/14/2018 - 00:28

అర్థవీడు, జూలై 13: ప్రియురాలికి ప్రేమలేఖ ఇవ్వలేదన్న ఆక్రోశంతో 7వ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి తగులపెట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన రవితేజ (12) శుక్రవారం మధ్యాహ్నం గుంటూరులోని ప్రభుత్వ వైద్యశాలలో మృతిచెందాడు. ఈనెల 7వ తేదీన జరిగిన ఘటనలో రవితేజకు శరీరంలోని వివిధ అవయవాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో మెరుగైన వైద్యచికిత్స కోసం గుంటూరు వైద్యశాలలో చేర్పించారు.

07/13/2018 - 23:31

ఇందూర్, జూలై 13: ఎడపల్లి మండలం పోచారం గ్రామ ఉప సర్పంచ్ గైని పోచయ్య(ఎల్‌ఐసి) శుక్రవారం తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందారు. నాలుగైదు రోజుల క్రితం ఛాతిలో నొప్పి రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు నిజామాబాద్‌లోని మ్యాక్స్‌క్యూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

07/13/2018 - 23:10

చిత్తూరు, జూలై 13: చిత్తూరు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆడియో వీడియో ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఈఈ నాగేశ్వరరావు ఏసీబీకి చిక్కారు. కార్యాలయంలోనే 8వేలు లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం వల పన్ని పట్టుకొన్నారు. చిత్తూరు జిల్లాలో గ్రామాలకు పలు వౌలిక వసతులు కల్పించే లెవన్ స్టార్ కార్యక్రమాలకు అధికారులు శ్రీకారం చుట్టారు.

07/13/2018 - 23:10

నల్లగొండ రూరల్, జూలై 13: జిల్లాకేంద్రంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుండి చెన్నైకు ఆలుగడ్డల లోడుతో వెళ్తున్న ఎంపీ 06హెచ్‌సి 4519 నెంబరు గల లారీ వేగంగా వచ్చి ఇద్దరి ప్రాణాలను బలిగొంది. నల్లగొండ టౌ టౌన్ సీఐ ఎండి.బాషా తెలిపిన వివరాల ప్రకారం..

07/13/2018 - 23:09

మొగల్తూరు, జూలై 13: కల్లు తీయడానికి తాటిచెట్టు ఎక్కుతున్న ఒక గీత కార్మికుడు విషపుటీగలు కుట్టడంతో మృతిచెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి... పేరుపాలెం సౌత్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు గుబ్బల పెద్దిరాజు (51) శుక్రవారం ఉదయం తాడి చెట్టు ఎక్కుతుండగా విషపుటీగలు దాడిచేశాయి.

Pages