S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/05/2020 - 04:32

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. రెండు ముఠాలకు చెందిన మొత్తం 13 మందిని సౌత్, నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీ అంజనీ కుమార్ కేసుకు సంబంథించిన వివరాలను వెల్లడించారు.

02/04/2020 - 06:35

గజ్వేల్, జగదేవ్‌పూర్: బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధించడంతో పాటు రూ. 10వేల వంతున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. గజ్వేల్ ఏసీపీ నారాయణ సోమవారం ప్రజ్ఞాపూర్‌లోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘటనకు సంబందించి వివరాలు అందించారు.

02/04/2020 - 06:33

వలిగొండ, ఫిబ్రవరి 3: గ్రామస్థులు, ఇతరులు ఊహించనట్లుగానే లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు చాట్ల పాండు హత్య ఇసుక మాఫియా పనేనని తేలింది. సోమవారం డీసీసీ నారాయణరెడ్డి నేరస్తులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను తెలియజేశారు.

02/04/2020 - 06:09

న్యూఢిల్లీ: శబరిమలతోపాటు వివిధ ప్రార్థనామందిరాల్లోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి విచారణ అంశాలను తామే ఖరారు చేస్తామని సుప్రీం కోర్టు ప్రకటించింది. విచారణ అంశాల క్రోడీకరణకు తదుపరి విచారణను ప్రధాన న్యాయమూర్తి ఏస్‌ఏ బాబ్డే గురువారానికి వాయిదా వేశారు.

02/04/2020 - 06:08

నాగ్‌పూర్: మహారాష్టలోని వార్ధా జిల్లాలో ఓ ఘోరం చోటుచేసుకుంది. 25 ఏళ్ల అధ్యాపకురాలిపై గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నలభై శాతం కాలిన గాయాలతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. అనిత పిసుడ్డే(25)పై సోమవారం ఉదయం 7.15 గంటలకు పెట్రోల్ దాడి జరిగింది.

02/04/2020 - 06:07

న్యూఢిల్లీ: నాలుగు వారాల్లో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయాలని సుప్రీం కోర్టు సోమవారం రాష్ట్రాలను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేసేలా రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని హైకోర్టులను కోరింది. న్యాయాన్ని ప్రజల ముంగిళ్లకు తీసుకెళ్లే లక్ష్యంతో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు సంబంధించిన చట్టాన్ని 2008లో పార్లమెంటు ఆమోదించింది.

02/04/2020 - 06:13

ముంబయి: మహారాష్టలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడికి 400 కిలోమీటర్ల దూరంలోని జలగాం జిల్లాలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకొంది.

02/04/2020 - 06:15

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నోళ్లు తెరుచుకొన్న, నిర్లక్ష్యంగా వదిలివేసిన బోర్లలో పడి చిన్నారులు చనిపోతున్న ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. 2010 సంవత్సరంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి ఎటువంటి చర్యలు సంబంధిత అధికారులు తీసుకోకపోవడం వల్లే చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారనీ..

02/03/2020 - 07:37

జమ్మూ/శ్రీనగర్: పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోవడానికి ప్రయత్నించిన పుల్వామా దాడి నిందితుడు, జైష్-ఏ-మహ్మద్ తీవ్రవాది సమీర్ దార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో అనేక అంశాలు వెలుగు చూశాయి. పుల్వామాలో మానవ బాంబు అమర్చుకుని ఆత్మాహుతి చేసుకున్న ఆదిల్ దార్‌కు సమీర్ దార్ సోదరుడు.

02/03/2020 - 01:05

న్యూఢిల్లీ: నిర్భయ హంతకుల మరణ శిక్షపై స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. సంబంధిత పార్టీల వాదోపవాదాలు ముగిసిన తర్వా త న్యాయమూర్తి సురేష్ ఖాయర్ దీని పై తన ఉత్తర్వులు జారీ చేస్తారు.

Pages