S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/12/2018 - 23:24

గోదావరిఖని, నవంబర్ 12: తల్లికి తెలియకుండా మూడు రోజుల మగ శిశువును విక్రయిస్తున్న ముగ్గురిని రామగుండం కమీషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మంచిర్యాలకు చెందిన పత్తి సత్తమ్మ, గోదావరిఖనికి చెందిన గాధం లక్ష్మి, బి.శ్రీ్ధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

11/12/2018 - 23:19

కొత్తపట్నం, నవంబర్ 12 : మద్యం సేవించి ఒకరు మృతి చెందిన సంఘటన కొత్తపట్నం మండలంలోని బీరంగుంటలోని ప్రియా ఆక్వా చెరువుల వద్ద సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాల్లోకి వెళితే విశాఖపట్నం జిల్లా బొమ్మల లక్ష్మీపురం మండలం పెద్దగంజ గ్రామానికి చెందిన నిమ్మక రాజేంద్రప్రసాద్ (22) అనే వ్యక్తి గత మూడేళ్ల క్రితం నుండి బీరంగుంటలోని ప్రియా ఆక్వా చెరువుల వద్ద పనిచేస్తున్నాడు.

11/12/2018 - 23:12

చిత్తూరు, నవంబర్ 12: చిత్తూరు నగరం గిరింపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రిజిస్ట్రార్ కార్యాలయంలోని రు 59,300 అనధికారిక నగదును స్వాధీనం చేసుకున్నారు.

11/12/2018 - 23:11

తిరుపతి, నవంబర్ 12: నిషేధిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న దుకాణాలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం కొరడా జుళిపించారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ పీవీ రాధాకృష్ణ ఆదేశాల మేరకు సీఐ రామకృష్ణాచారి, డీసీటీఓ చిన్నారెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారి శేషారెడ్డి, ఎస్‌ఐ రామస్వామిలు పాన్ దుకాణాలపై దాడులు నిర్వహించారు.

11/13/2018 - 04:12

తిరుపతి: తిరుపతిలోని సరోజినీదేవి లే ఔట్‌లో ఉన్న ప్రభుత్వ బాలికల పరిశీలన గృహంలోని ఓ అనాథ బాలికపై గత కొనే్నళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో పరిశీలనాగృహం సూపరింటెండెంట్ నందగోపాల్ (58)ను సోమవారం ఉదయం తిరుపతి వెస్ట్ డీఎస్పీ కనకరాజు ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసులు అరెస్టు చేశారు.

11/12/2018 - 22:48

గజపతినగరం, నవంబర్ 12: అదనపు కట్నం తేవాలని ఒత్తిడి చేయడంతోపాటు వేధింపులు కారణంగా కోట్ల లక్ష్మి పురుగుల మందు సేవించి ఇటీవల మృతి చెందింది. మృతురాలి వేధింపులకు ప్రధాన కారకుడైన భర్త కోట్ల సంతోష్‌ను సోమవారం బొబ్బిలి ఏస్పీ గౌతమిశాలి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

11/12/2018 - 22:30

రంపచోడవరం, నవంబర్ 12: రంపచోడవరం అటవీ శాఖ అధికారులు రెండు సిందుగ (చిరుత పులి) చర్మాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రంపచోడవరం అటవీ శాఖ రేంజర్ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..తమకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు రంపచోడవరం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న కళ్లి సత్తిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

11/12/2018 - 22:08

కొత్తగూడెం, నవంబర్ 12: సుజాతనగర్ చెక్‌పోస్టు వద్ద సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3 లక్షల విలువైన చీరలు పట్టుబడ్డాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చీరలు తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి రవాణా శాఖ అధికారికి పంపిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

11/12/2018 - 22:03

వరంగల్ క్రైం, నవంబర్ 12: కర్ణాటకలోని బీదర్ పట్టణం నుండి మహబూబాబాద్ జిల్లాకు ప్రభుత్వం నిషేధించిన గుట్కా రవాణా చేస్తున్న ఇద్దరిని సోమవారం జనగామ చౌరస్తా లో వరంగల్ పోలీసు కమిషనరేట్‌కు చెందిన టాస్క్ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

11/12/2018 - 05:43

గాజువాక/పెదగంట్యాడ, నవంబర్ 11: నాగుల చవితి సెలవు దినం ఆరుగురు కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చింది. యారాడ బీచ్ మృత్యుకెరటం ఆరుగురు యువకులను కొట్టుకు పోయింది. సముద్రంలో గల్లంతైన ఆరుగురు యువకుల ఆచూకీ లభ్యం కాలేదు. యారాడ బీచ్ ప్రమాదాలకు నిలయంగా మారిందన్న సంగతి విసృత ప్రచారం జరుగుతున్నప్పటికీ ఫలితం శూన్యం. యారాడ బీచ్‌లో స్నేహానికి దిగిన అనేక మందిని మృత్యుకెరటాలు పొట్టన పెట్టుకున్న సంఘటనలు కొకొల్లులు.

Pages