S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/23/2018 - 02:16

బాసర, సెప్టెంబర్ 22: నిర్మల్ జిల్లా బాసర ఆర్‌జేయుకేటీ యూనివర్సిటిలో శనివారం విద్యార్థిని కళాశాల వసతిభవనంపై నుండి పడి ఆత్మహత్యకు పాల్పడిందని బాసర ఎస్సై మహేష్ తెలిపారు. పోలీసులు కళాశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన అనూష (17) ఆర్‌జేయుకేటీలో పీయుసీ రెండవ సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. శనివారం ఉ. 12 గంటల ప్రాంతంలో కళాశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

09/23/2018 - 02:31

* వివరాలు వెల్లడించిన సీపీ రవీందర్

09/23/2018 - 01:28

సిమ్లా, సెప్టెంబర్ 22: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో శనివారం ఒక వాహనం లోయలో పడి మూడు జంటలు సహా మొత్తం 13 మంది మృతి చెందారు. కుడ్డు నుంచి టియుని రోడ్డు మీదుగా వెళ్తున్న ఈ వాహనం సనైల్ వద్ద బాగా లోతున్న లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.

09/23/2018 - 01:05

కూసుమంచి, సెప్టెంబర్ 22: హైదరాబాద్‌లో గాంధీభవన్ ముందు ఆత్మహత్యకు యత్నించిన కౌలురైతు శనివారం మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే కూసుమంచి మండలంలోని భగవత్‌వీడు గ్రామానికి చెందిన దేవబత్తిని వెంకటేశ్వర్లు శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ గాంధీభవన్ ముందు పురుగులమందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేయగా అక్కడ స్థానికులు అంబులెన్స్ ద్వారా ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.

09/23/2018 - 00:56

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 22: ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్న సమయం. అంతలోనే రైలు ఆగిపోయింది. బోగిల్లో అలజడి నెలకొంది. మహిళల అరుపులు కేకలతో ప్రయాణీకులు ఉలిక్కిపడ్డారు. క్షణాల్లోనే మహిళల మెడల్లో ఉన్న పుస్తెల తాళ్లతోపాటు ఇతర బంగారు ఆభరణాలు దోపిడి దొంగలు లాక్కెళ్లారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని దివిటిపల్లి రైల్వేస్టేషన్‌కు సమీపంలో చోటు చేసుకుంది. శనివారం

09/22/2018 - 23:55

అల్లాదుర్గం, సెప్టెంబర్ 22: అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐబీ చౌరస్తా సమీపంలో ఓ సెక్యూరిటి గార్డ్ దారుణ హత్యకు గురయ్యాడు. అల్లాదుర్గం సీఐ ఇన్‌చార్జి, మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం శుక్రవారం రాత్రి ఐబీ చౌరస్తా సమీపంలో బీటీ రోడ్డు ప్రక్కన రాకేశ్‌సింగ్ యాదవ్(45)ను దారుణంగా హత్య చేసి రోడ్డు ప్రక్కన గల చెట్టు క్రింద పడవేసినట్లు మృతదేహం ఉంది.

09/22/2018 - 23:12

చిత్తూరు, సెప్టెంబర్ 22: వాల్మీకిపురం సీఐ తేజామూర్తి లైంగిక వేధింపుల కేసు విచారణకు జిల్లా ఎస్పీ రాజశేర్ బాబు శనివారం ఆదేశాలు జారీ చేసారు. విచారణ అధికారిగా చిత్తూరు మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ నారాయణ స్వామిని నియమించారు. వాల్మీకిపురం సీఐగా ఉన్న తేజామూర్తి ఇటీవల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఒక మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారులు ఇటీవల అతనిపై సస్పెన్షన్ వేటు వేసారు.

09/22/2018 - 23:00

ఒంగోలు, సెప్టెంబర్ 22: ఒంగోలు మంగమూరు రోడ్డులోని సాంబశివ నగర్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో కూలిపనులు చేస్తున్న ఇద్దరు కూలీలు శనివారం ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికి అక్కడే మృతి చెందారు. ఒంగోలు తాలూకా పోలీసులు కధనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒంగోలు సాంబశివ నగర్‌లో ఒక కొత్త అపార్ట్‌మెంట్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

09/22/2018 - 00:19

బొంరాస్‌పేట, సెప్టెంబర్ 21: తండ్రి దివ్యాంగుడు.. తల్లి వయస్సు పైబడింది.. పెళ్లికి ఇద్దరు చెల్లెళ్లు.. తాను ఎదో కష్టం చేస్తే తప్ప కుటుంబ ఆర్థిక పరిస్థితులు చక్కబడేలా లేవని భావించి దుబాయ్ వెళ్లి తమ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని భావించాడు.

09/22/2018 - 00:16

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఫ్యూచర్ మేకర్ లైఫ్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (ఎఫ్‌ఎంఎల్‌సీ) మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో సంస్థ అధినేత రాధేశ్యామ్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా సుమారు 3వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.

Pages