S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/13/2019 - 04:26

జైపూర్: మైనర్ బాలికపై అత్యాచారం, హతమార్చిన కేసులో ఓ వ్యక్తికి అల్వార్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్ కుమార్ అలియాస్ ధర్మేంద్ర యాదవ్ అనే వ్యక్తి ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిపి, ఆ తర్వాత ఆమెను దారుణంగా హతమార్చిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. పోస్కో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్ కుమార్ శర్మ కేసును విచారించిన తర్వాత బుధవారం తీర్పును వెల్లడించారు.

06/13/2019 - 04:24

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రీ ప్రజాపతి ఇళ్లపై సీబీఐ బుధవారం దాడులు నిర్వహించింది. అక్రమ మైనింగ్ కేసు నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అమేథీలో ఆయనకున్న మూడిళ్లలో సోదాలు జరిపినట్టు వారు తెలిపారు. అదేవిధంగా అమీర్‌పూర్ జిల్లాలో, న్యూఢిల్లీ తదితర ప్రాంతాల్లోని 11 స్థావరాలపై ఏకకాలంలో దాడులు జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు.

06/12/2019 - 04:52

జగదేవ్‌పూర్, జూన్ 11: ఆడుకుంటూ ఇంటిముందు ఉన్న నీటి సంపులో జారి పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.

06/12/2019 - 04:52

గూడూరు, జూన్ 11: నీటి తొట్టెలో పడి ఏడాది వయస్సు గల చిన్నారి మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దుబ్బగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. దుబ్బగూడెంకు చెందిన మూడు రమేష్ రెండవ కుమార్తె అభినయ (01) మంగళవారం ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టెలో పడిపోయింది. అభినయ నీటి తొట్టెలో పడిపోయిన విషయాన్ని తల్లితండ్రులు గమనించలేదు.

06/12/2019 - 04:48

గరిడేపల్లి, జూన్ 11 : మద్యానికి బానిసై వేధిస్తూ నిత్యం కొడుతూ, దూషిస్తూ కసాయిగా మారిన కొడుకుని కన్నతల్లే కడతేర్చిన సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని సుభాష్ నగర్ (కొత్తపోడు) గ్రామానికి చెందిన బెజ్జం సతీష్ అలియాస్ చంటి (28)ని తల్లి మరియమ్మ హతమార్చింది. సతీష్‌కు తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం జరగ్గా ఇద్దరు పిల్లలున్నారు.

06/12/2019 - 04:31

హైదరాబాద్, జూన్ 11: మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో మంగళవారం నాడు పిటీషన్ దాఖలైంది. వార్డుల విభజన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయడం లేదని పిటీషనర్ పేర్కొన్నారు. 53 మున్సిపాల్టీలకు రాష్ట్రంలో జూలై 2వ తేదీతో గడువు ముగుస్తుందని, ఇప్పటి నుండి ఏర్పాట్లు చేయకపోతే ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదని పిటీషనర్ పేర్కొన్నారు.

06/12/2019 - 04:30

గచ్చిబౌలి, జూన్ 11: సినిమాలు, టీవీ సిరియల్స్, క్రైం కథనాలు సమాజంపై ప్రభావం చూపిస్తాయనడంతో సందేహం లేదు. టెలివిజన్‌లో వచ్చే క్రైం కథనాలను చూసిన కొందరు మంచివారిగా మారితే ఇంకొంతమంది కిల్లర్‌గా మారుతున్నారు. మాట్రిమోనీ మోసాలను టీవీలో చూసిన యువతి కిల్లర్‌గా మారింది.

06/12/2019 - 01:21

యాచారం, జూన్ 11: రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధుడు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి యాచారం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని తక్కళ్లపల్లి తండాకు చెందిన వర్త్యావత్ హనుమ (60) కూలిపనులు చేస్తున్నాడు.

06/12/2019 - 01:20

మేడ్చల్, జూన్ 11: రోడ్డు ప్రమాదంలో తనయుడి కళ్ల ముందే తల్లి దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం మెదక్ తుప్రాన్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ(55) కుమారుడు పవన్ గౌడ్(27)తో కలిసి ద్విచక్ర వాహనంపై మంగళవారం వెళుతుండగా మేడ్చల్ 44వ జాతీయ రహదారి చెక్‌పోస్టు వద్ద కంటైనర్ లారీ ఢీకొట్టింది.

06/12/2019 - 01:20

వనస్థలిపురం, జూన్ 11: అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఐదు లక్షల రూపాయల విలువ చేసే 82 కిలోల గంజాయి, రూ.30 వేల నగదు, ఏడు మొబైల్ ఫోన్‌లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Pages