S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/02/2018 - 21:56

దర్శకుడు అనిల్ రావిపూడి ‘నాటకం’ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఆశిష్‌గాంధీ, ఆషియా నర్వాల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి. గోగన దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండడంతో చిత్ర నిర్మాతలు ఈ సినిమాని ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

09/02/2018 - 21:53

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు నుండి తాను నటిస్తున్న అరవింద సమేత షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఇటీవలే ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ మృతితో వారి కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. తండ్రి అంటే ఎంతగానో ఇష్టపడే ఎన్టీఆర్ ఈ విషాదంనుండి ఎప్పుడు తేరుకుంటాడో తెలియదు కానీ నిర్మాత నష్టపోకుండా ఉండేందుకు ఆయన తిరిగి ఈరోజునుండి షూటింగ్‌లో పాల్గొననున్నాడు.

09/02/2018 - 21:52

సమ్మోహనం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అతిధిరావ్ హైదరి తన అందంతోపాటు తన అభినయాన్ని కూడా చక్కగా ప్రదర్శించి అన్నివర్గాల ప్రేక్షకులని అలరించి మెప్పించింది. ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆమె మరో చిత్రంలో నటించనుంది. విశాల్ హీరోగా గత ఏడాది వచ్చిన డిటెక్టివ్ సినిమా దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది.

09/02/2018 - 21:50

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమా ఏకధాటిగా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంది. గత కొన్ని రోజులుగా హైదరాదాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపిన ఈ టీమ్ తదుపరి షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. అమెరికా, న్యూయార్క్, కాలిఫోర్నియా, లాస్‌వేగాస్ లాంటి ప్రాంతాల్లో ప్లాన్ చేసారు. దాదాపు రెండు నెలలపాటు అక్కడే షూటింగ్ జరగనుందట.

08/31/2018 - 22:31

మాస్ కథానాయకుడు విశాల్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకంపై ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పందెం కోడి-2’. గతంలో మాస్ హీరో విశాల్, ఎన్.లింగుస్వామి కాంబినేషన్‌లో వచ్చిన ‘పందెంకోడి’ సూపర్ డూపర్ హిట్ అయి విశాల్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘పందెంకోడి 2’.

08/31/2018 - 22:29

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసిన బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తెలుగులో ఇప్పటికే సావిత్రి మహానటి బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, రాష్ట్ర రాజకీయాలలో మహానాయకులుగా పేరొందిన ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిల బయోపిక్‌లు సైతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇందులో చంద్రబాబునాయుడు బయోపిక్‌ను పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు.

08/31/2018 - 22:28

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ ప్రతిష్టాత్మక చిత్రం సైరా. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌కోసం సిద్ధం అవుతుంది. ఇటీవలే హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్స్‌లో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ షెడ్యూల్‌ని జార్జియాలో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాలను అక్కడ భారీ ఎత్తున తెరకెక్కిస్తారట.

08/31/2018 - 22:27

కె.యస్.నాగేశ్వరరావు దర్శకుడిగా తిరుమల తిరుపతి వేంకటేశ్వరా ఫిలింస్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీమతి చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న ‘లవ్ ఈజ్ బ్లైండ్’ అనే చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలోని మహానటి సెట్‌లో లాంఛనంగా ప్రారంభమయంది. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో ఉన్న ప్రతిభగల కొత్త తరాలవారిని ప్రోత్సహించడంలో భాగంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం.

08/31/2018 - 22:25

జాతీయ నటుడు కమల్‌హాసన్ నటుడిగా ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్నాడో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటుడిగానే కాకుండా దర్శకుడిగా, అటు నిర్మాతగా కూడా పాపులర్ అయ్యారు. తాజాగా విశ్వరూపం 2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటివరకు ఆయన బ్యానర్‌లో ఆయన హీరోగానే సినిమాలు తీసేవారు. కానీ కమల్‌హాసన్ విక్రమ్ హీరోగా ఓ సినిమాను మొదలుపెట్టారు.

08/31/2018 - 22:25

తాజాగా గీత గోవిందం సినిమాతో వంద కోట్ల హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస అవకాశాలతో జోరు మీదున్నాడు. ఇప్పటికే పలువురు నిర్మాతలు ఆయనకోసం క్యూ కడుతున్నారు. అయితే విజయ్ తన తదుపరి సినిమాను క్రాంతిమాధవ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు ఆయన మరో సినిమాకు ఓకే చెప్పాడట.

Pages