S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/03/2018 - 20:35

కృష్ణా ముకుందా మురారీ.. నందమూరి నందనవనవిహారి.. అంటూ కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు
తెలుపుతూ ఎన్‌టిఆర్ బయోపిక్‌కు సంబంధించిన పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి అభిమానులను
విశేషంగా అలరించారు. బాలకృష్ణ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది.

09/03/2018 - 20:33

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్న ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. భారీ బడ్జెట్‌తో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం తరువాత ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడని తెలిసిందే.

09/03/2018 - 20:31

స్టోన్ మీడియా ఫిల్మ్ బ్యానర్‌లో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ప్రేమకు రెయిన్‌చెక్’. ఈ చిత్రానికి ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ దర్శకత్వం వహించి నిర్మించారు. ఈనెల 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు అభిలాష్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...

09/03/2018 - 20:28

రాజాగౌతమ్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘మను’. నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండెడ్‌గా నిర్మితమైన ఈ చిత్రానికి ఫణీంద్ర నార్‌శెట్టి దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీరిలీజ్ వేడుకులో మోహన్ భగత్ మాట్లాడుతూ.. ‘్ఫణితో పనిచేసిన తర్వాత గర్వంగా అనిపించింది. తప్పకుండా సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది’ అన్నారు.

09/03/2018 - 20:26

కళ్యాణ్, రీహా హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్’. కృష్ణతేజ (వడ్డే నవీన్ వన్ చిత్రం ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ సినీ ప్రొడక్షన్, హర్ష సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై కె.శ్రీకాంత్, కె.చంద్రమోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

09/03/2018 - 20:25

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌లో మళయాల సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్న యాత్ర చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేశారు. దర్శకుడు మహి వి.రాఘవ్ ఈ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నారు. మడమ తిప్పని నాయకుడి పాత్రలో నటిస్తున్న మమ్ముట్టి పూర్తిగా ఆ ప్రజానాయకుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటిస్తున్నారు.

09/03/2018 - 20:23

శషా చెట్రి (ఎయిర్‌టెల్ మోడల్), ఆది సాయికుమార్, కార్తీక్‌రాజు, పార్వతీశం, నిత్యానరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి రవి, అనీశ్ కురువిల్లా, రావురమేష్ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. వినాయకుడు టాకీస్ బ్యానర్‌పై యథార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన కల్పిత కథాంశంతో..

09/03/2018 - 20:21

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ శరవేగంగా షూటింగ్‌ని జరుపుకుంటోంది.

09/02/2018 - 22:05

రవిబాబు నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం అదుగో. ఈ సినిమాలో పంది పిల్ల కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పుడు ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇందులో పిగ్ లెట్ బంటిని పరిచయం చేసారు. దర్శక నిర్మాతలు. చెక్క కంచెకు వేలాడుతూ నవ్వుతూ ఉన్న పంది పిల్ల చాలా క్యూట్‌గా అందర్నీ అలరిస్తోంది. రవిబాబుతోపాటు ఈ చిత్రంలో అభిషేక్ వర్మ, నభా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

09/02/2018 - 22:01

టెలివిజన్ తెరపై కలర్స్ ప్రోగ్రాంతో సందడి చేసిన కలర్స్ స్వాతి ఆ తరువాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుంది. గత కొంత కాలంగా వికాస్‌తో ప్రేమాయణం సాగిస్తున్న స్వాతి.. ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకుంది. వికాస్ పైలట్‌గా పనిచేస్తున్నాడు. ఇరు కుటుంబాల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. హీరోయిన్‌గా తెలుగులో ఇమేజ్ తెచ్చుకోవాలనుకుంది కానీ ఆమె ఆశలు నిరాశలయ్యాయి.

Pages