S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/30/2018 - 20:20

లోక నాయకుడు కమల్‌హాసన్-శంకర్ కలయికలో సూపర్‌హిట్ చిత్రం భారతీయుడు సినిమాకి సీక్వెల్‌గా భారతీయుడు-2 చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం కోసం లొకేషన్స్ వేటలో వున్నారు దర్శకుడు శంకర్. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఒక లొకేషన్‌ను ఫిక్స్ చేశారట. ఇక ఈ చిత్రం నవంబర్ చివరి వారంలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.

08/30/2018 - 20:17

చియాన్ విక్రమ్, కీర్తి సురేష్ జంటగా తమిళ భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘సామీ స్క్వేర్’. విక్రమ్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తమీన్స్ ఫిలిమ్స్ పతాకంపై శిబూ తమీన్స్ నిర్మిస్తున్నారు.

08/30/2018 - 20:16

అల్లు అర్జున్ తదుపరి సినిమాపై ఇప్పటికే మెగా అభిమానుల్లో సందిగ్ధం నెలకొంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న నా పేరు సూర్య భారీ ఫ్లాప్ అవ్వడంతో ఆయన తదుపరి సినిమా విషయంలో ఎక్కువ కేర్ తీసుకున్నాడు. ఇప్పటికే మనం ఫేమ్ విక్రమ్ కుమార్‌తో సినిమాకు రెడీ అయ్యాడు. దాంతోపాటు అల్లు అర్జున్ మరో సినిమాకు ఓకె చెప్పాడట. అయితే ఈసారి ఆయన తెలుగు, తమిళ భాషల్లో నటించే సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి.

08/30/2018 - 20:14

గోపీచంద్ వరుసగా కొన్ని పరాజయాల తర్వాత ‘పంతం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫర్వాలేదనిపించుకున్నాడు. ప్రస్తుతం బీవీఎస్‌ఎస్‌ప్రసాద్ నిర్మాణంలో కుమార్ అనే ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో గోపీచంద్ ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. అది ప్రధానంగా లవ్ ఎంటర్‌టైనర్‌తో కూడుకున్న యాక్షన్ సబ్జెక్ట్ అట. ఐతే ఈ చిత్రం తర్వాత గోపీచంద్, సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

08/30/2018 - 20:11

నిర్మాణంలో వుండగానే అందరి దృష్టిని ఆకర్షిస్తూ... అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తున్న హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం. ఓవర్సీస్ హక్కులు ఫ్యాన్సీ రేటుతో కంట్రీసైడ్ పిక్చర్స్ అధినేతలు దక్కించుకున్నారు. ఇప్పటివరకు సుమంత్ కెరీర్‌లో ఓవర్సీస్ హక్కులకు లభించని ఫ్యాన్సీ అవౌంట్ ఈ చిత్రానికి దక్కడం విశేషం.

08/30/2018 - 20:09

సౌత్‌లో అటు హీరో విజయ్ నటించిన కత్తి.. ఇటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రాలు సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సంచలన దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఆయనే కథ అందించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లోకి వెళ్లనుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలాబన్సాలీ తీసుకున్నారు.

08/30/2018 - 20:08

నాని హీరోగా నటించిన నిన్నుకోరి సినిమా ఇపుడు కోలీవుడ్‌లోకి వెళ్లనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని, నివేదా థామస్, ఆదిపినిశెట్టి నటించగా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని తమిళంలో చేస్తున్నారు. తమిళ వెర్షన్‌లో హీరో వైభవ్ నటిస్తాడట. హీరోయిన్‌గా నివేదా థామస్‌ని ఎంపిక చేయనున్నట్టు తెలిసింది. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్న విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.

08/30/2018 - 20:06

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 37వ చిత్రం ఇటీవల లండన్‌లో మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ పొల్లాచిలో జరుగనుంది. సెప్టెంబర్‌లో ఈ షెడ్యూల్ మొదలుకానుందని సమాచారం. కె.వి.ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్, ఆర్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ న్యూ ఇయర్ రోజు ఏప్రిల్ 14న విడుదలకానుంది.

08/30/2018 - 20:05

మంత్ర ఆర్ట్స్ పతాకంపై అన్నం చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాలేజ్ పోరగాళ్ళు’. ‘సదుపు తక్కువ సోకులెక్కువ’ ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో మల్లికార్జున, కవిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కెమెరామెన్ శ్రీ్ధర్ నేతృత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి రాంబాబు మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రంలోని పాటలను ఇటీవల ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి టీవీ9లో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేశారు.

08/29/2018 - 19:29

మహానటుడు, మహా రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి తనయుడు నందమూరి తారక రామారావు వారసుడిగా అటు రాజకీయాల్లో.. ఇటు సినిమా రంగంలో తనదైన ప్రత్యేకతను చాటి చెప్పాడు నందమూరి హరికృష్ణ. ఆయన 1956 సెప్టెంబరు 2న జన్మించారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. నందమూరి తారకరామారావు మూడవ కుమారుడు. తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాడు.

Pages