S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/08/2016 - 20:55

విశాల్, తమన్నా జంటగా హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి అందిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రాన్ని ఈనెల 18న భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని నిర్మాత రాజు విడుదల చేశారు.

11/08/2016 - 20:53

విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా ఆర్.పి.ఎ క్రియేషన్స్, డి.వి. సినీ క్రియేషన్స్ పతాకాలతో తెలుగు, తమిళ భాషల్లో రంజిత్ జయకోడి దర్శకత్వంలో నిర్మాత డి.వెంకటేష్ అందిస్తున్న చిత్రం ‘పిజ్జా-2’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈనెల 11న థియేటర్ ట్రైలర్, 14న ఆడియోను విడుదలచేయనున్నారు.

11/08/2016 - 20:52

రజిత్, షామిలి, నిషా ప్రధాన తారాగణంగా వశిష్ఠ సినీ అకాడమీ పతాకంపై రాము దర్శకత్వంలో ప్రభాత్ వర్మ రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీరామరక్ష’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పాట ఇటీవల విడుదలయ్యాయి. సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

11/08/2016 - 20:50

అక్కినేని నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే దాదాపు ఎనభై శాతం చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ నవంబర్ 15 నుండి 25 వరకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది.

11/08/2016 - 20:47

నిఖిల్ నటించిన చిత్రం ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’. ఈ చిత్రంలో నిఖిల్‌కి జంటగా హెబాపటేల్, నందిత శే్వతలు హీరోయిన్లగా నటిస్తున్నారు. వి.ఐ.ఆనంద్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు. మేఘన ఆర్ట్స్ నిర్మాణంలో మేఘన ఆర్ట్స్ బ్యానర్‌లో డిఫరెంట్ లవ్‌స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ఆడియోని ఈవారమే విడుదలచేసి నవంబర్ 18న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

11/08/2016 - 20:46

అనుపమ పరమేశ్వరన్ ‘అ ఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పేరు. ఆ సినిమాలో అనుపమ నెగెటివ్ కేరెక్టర్‌లో కనిపించింది. ‘అ ఆ’ సినిమాలో అనుపమ నితిన్‌ని గాఢంగా ప్రేమించే పాత్ర చేసి అందరినీ అలరించింది. మళ్లీ వెంటనే నాగచైతన్య పక్కన ఒక రోల్‌లో ప్రేమమ్ చిత్రంలో చేసింది. ఈ సినిమాలో అనుపమకి పెద్ద స్కోప్ వున్న పాత్ర పడలేదు. ఇక ఈ సినిమాల తరువాత మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజి అయ్యింది.

11/06/2016 - 21:19

అక్కినేని నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ ప్రేమలో పడ్డ సంగతి తెలిసిందే. పెద్దకుమారుడు చైతన్య హీరోయిన్ సమంతను, చిన్న కుమారుడు అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ శ్రీయ భూపాల్‌ను పెళ్లిచేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరిలో మొదట అఖిల్ వివాహం జరగనుండగా దానికి ఏర్పాట్లు మొదలైనాయికూడా. కాగా ఇంతవరకు నాగ్-చైతన్య, అఖిల్-శ్రీయల ఫొటోలు కనువిందు చేశాయి. ఇప్పుడు ఆ రెండు జంటలు తీసుకున్న ఓ సెల్ఫీ అందర్నీ ఆకట్టుకుంది.

11/06/2016 - 21:17

సూర్య కథానాయకుడిగా స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా రూపొందిస్తున్న చిత్రం సింగం-3. ఈ చిత్రాన్ని సుర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో అందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

11/06/2016 - 21:18

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్ విడుదల కానుంది. నేడు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఎబిసి డిజిటల్ మీడియా వారు తెలుగు పరిశ్రమలో తొలిసారిగా ఓ వైవిధ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఓ ఆండ్రాయిడ్ యాప్‌ను వారు రూపొందించారు. అది సోమవారం విడుదల కానుంది.

11/06/2016 - 21:13

విజయ్ ఆంటోనీ కథానాయకుడుగా ఫాతిమా విజయ్ ఆంటోనీ, మల్కాపురం శివకుమార్ సమర్పణలో మానస్ రుషి ఎంటర్‌ప్రైజెస్, విన్ విన్ విన్ క్రియేషన్స్, ఆరా సినిమాస్ పతాకంపై ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో కె.రోహిత్, ఎస్.వేణుగోపాల్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం బేతాళుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

Pages