S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/11/2018 - 01:03

బెంగళూరు, ఆగస్టు 10: భారత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్వీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారనే ప్రకటన చేసినందుకు టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా ఒక ప్రకటనలో క్షమాపణలు తెలిపారు. మహమ్మద్ అలీ జిన్నా దేశ ప్రధానిగా ఉంటే బాగుంటుందని మహాత్మాగాంధీ ఆకాంక్షించారని దలైలామా ఇటీవల అన్నారు. మహాత్మాగాంధీ ఆకాంక్ష ఫలించి ఉంటే భారతదేశం విభజన జరిగి ఉండేదని కాదన్నారు.

08/11/2018 - 00:44

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని నిర్మించుకునేందుకు రక్షణ శాఖకు చెందిన బైసన్ పోలో గ్రౌండ్‌ను కేటాయించే అంశాన్ని సానుభూతితో పరిశీలించి న్యాయం చేస్తానని టీఆర్‌ఎం ఎంపీలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దీనితో కొత్త భవన నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయే అవకాశాలు మెరుగు పడ్డాయి. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ పక్షం నాయకుడు కే.

08/11/2018 - 00:17

న్యూఢిల్లీ, ఆగస్టు 10: పార్లమెంటు చరిత్రలో మొదటిసారి ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాజ్యసభలో ఎన్‌డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా ఆయనను అభినందిస్తూ మోదీ మాట్లాడారు. ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్ ఇంటిపేరుపై వంగ్య వ్యాఖ్యానం చేశారు.

08/11/2018 - 00:10

న్యూఢిల్లీ,ఆగస్టు 10: పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు పోరాటం మూలంగా ఆంధ్రప్రదేశ్‌కి బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని దేశ ప్రజలందరికి తెలిసేలా చేశామని తెలుగు దేశం పార్లమెంటరీ నాయకుడు సుజనా చౌదరి అన్నారు. ఆంధ్రకు జరిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు.

08/11/2018 - 00:42

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషులు ఏడుగురికి క్షమాభిక్ష పెట్టి విడిచిపెట్టాలన్న తమిళనాడు ప్రభుత్వ వినతిని కేంద్రం అంగీకరించడం లేదని, ఈ చర్య అంతర్జాతీయ సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతుందని సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఇది ఒక ప్రమాదకర దృష్టాంతంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించింది.

08/11/2018 - 00:04

న్యూఢిల్లీ, ఆగస్టు 10: అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటంతో తక్షణ తలాక్‌ను నేరంగా ప్రకటించేందుకు ఉద్దేశించిన ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం రాజ్యసభలో ప్రవేశపెట్టడంలో విఫలమైంది. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో చర్చకు చేపట్టటం లేదని చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం సభలో ప్రకటించారు.

08/10/2018 - 16:45

న్యూఢిల్లీ: జీవ ఇంధనాల సత్ఫలితాలు ఇక ప్రతి పల్లెకు చేరాలని ప్రధాని మోదీ అన్నారు. ఆయన జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ పది వేల కోట్ల రూపాయలతో 12 ఆధునిక రిఫైనరీల నిర్మాణం జరుగుతుందని అన్నారు. దీనివల్ల 15 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

08/10/2018 - 16:44

న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో టీఆర్‌ఎస్ ఎంపీలు శుక్రవారంనాడు భేటీ అయ్యారు. కొత్తగా చేపట్టే సచివాలయం భవనాల నిర్మాణానికి బైసాన్ పోలో, జింఖాన మైదానంలోని భూములను కేటాయించాలని కోరారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వల్ల భూముల బదలాయింపులో జాప్యం జరుగుతుందని తాము భావిస్తున్నట్లు అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

08/10/2018 - 16:43

న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో ఆప్ పార్టీ ఏ కూటమిలోనూ చేరదని ఆ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ అన్నారు. ఆయన హరియాణలోని రోహతక్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో విద్య, ఉద్యోగ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని అన్నారు. వచ్చే హరియాణా ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ, లోకసభ స్థానాల్లో పోటీచేస్తుందని అన్నారు.

08/10/2018 - 16:42

న్యూఢిల్లీ: త్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలో మోక్షం లభించలేదు. ఏకాభిప్రాయం లేనందున సభలో చర్చించలేకపోయామని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. గత ఏడాది ఈ బిల్లుకు లోకసభలో ఆమోదం లభించింది. కాని రాజ్యసభలో ఎన్డీయే మైనార్టీలో ఉన్నందున ఈ బిల్లుకు ఆమోదం దక్కలేదు.

Pages