S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/08/2018 - 16:41

చెన్నై:కరుణానిధి అంతిమయాత్ర వేలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య ఆరంభమైంది. రాజాజీ హాలు నుంచి వాలాజీ రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా అంతిమయాత్ర కొనసాగనున్నది. మెరీనా బీచ్‌లోని అన్నాస్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వలాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. రాజాజీ పరిసర ప్రాంతాలు జనసంధ్రంతో నిండిపోయాయి.

08/08/2018 - 16:40

చెన్నై: కరుణానిధి పార్థీవదేహాన్ని ఉంచిన రాజాజీ హాలు వద్ద తోపులాట జరిగింది. తమ ప్రియతమ నేతను దర్శించుకునేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో తోపులాట జరగటంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 33మంది గాయపడ్డారు. కాగా కార్యకర్తలు సంయమనం పాటించాలని కరుణానిధి కుమారుడు స్టాలిన్ విజ్ఞప్తిచేశారు.

08/08/2018 - 16:39

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ఆయన రాజాజీ హాలులో ఉంచిన కరుణానిధి పార్థీవ దేహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. ఆయన కుమార్తె, ఎంపీ కవిత ఉన్నారు.

08/08/2018 - 16:36

చెన్నై: అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే అధినేత కరుణానిధికి పలువురు నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ఆర్జీడే నాయకుడు తేజస్వి యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, కాంగ్రెస్ నేత గలాబ్ నబీ అజాద్ తదితరులు నివాళులర్పించారు.

08/08/2018 - 12:44

చెన్నై: అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే అధినేత కరుణానిధి పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాజకీయ నేతలు ఊమెన్‌చాంది, చిదంబరం, దినకరన్‌, రాజా, సినీ ప్రముఖులు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌, అజిత్-షాలిని‌, సూర్య, కుష్బూ, ప్రభు తదితరులు కరుణానిధికి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.

08/08/2018 - 12:40

చెన్నై: కరుణానిధి మృతికి సంతాప సూచకంగా తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులు మూతపడ్డాయి. అలాగే దుకాణాలను మూసివేశారు. సినిమా షూటింగ్‌లను నిలిపివేశారు. జాతీయ జెండాలను అవనతం చేశారు.

08/08/2018 - 12:39

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి పార్థీవదేహన్ని కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి ఆయన అభిమానులు తరలివస్తున్నారు. కాగా మరోవైపు ఈ సాయంత్రం జరిగే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

08/08/2018 - 12:38

చెన్నై: కరుణానిధి అంత్యక్రియలపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి ట్విట్టర్ వేదికగా స్పందించారు. మెరీనాబీచ్‌పై అమితమైన ఆసక్తి పెంచుకోవటం మూఢనమ్మకం. కరుణానిధి మూఢనమ్మకాలకు వ్యతిరేకం. ప్రభుత్వం కేటాయించిన గాంధీ మండపం కూడా దానికి సమానమైందే అని పేర్కొన్నారు.

08/08/2018 - 12:33

చెన్నై: అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఈ ఉదయం చెన్నై చేరుకున్న మోదీ నేరుగా రాజాజీ హాలుకు వెళ్లి అక్కడ కరుణానిది పార్ధీవదేహనికి నివాళులర్పించి అంజలి ఘటించారు. అనంతరం ప్రధాని స్టాలిన్, కనిమోళిని పరామర్శించారు.

08/08/2018 - 12:24

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలని చెలరేగిన వివాదం సమసిపోయింది. మెరీనాబీచ్‌లోని అన్నాదురై సమాధి పక్కనే స్థలం కేటాయించాలని డీఎంకే చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో డీఎంకే కోర్టును ఆశ్రయించింది. వాదోపవాదాలు విన్న తరువాత కరుణానిధి అంత్యక్రియలకు మెరీనాబీచ్‌లోనే స్థలం కేటాయించాలని ఆదేశించింది. అన్నాదురై సమాధి పక్కన స్థలం కేటాయించాలని కోర్టు పేర్కొంది.

Pages