S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/10/2018 - 01:40

న్యూఢిల్లీ, ఆగస్టు 9: అసోంలో చేపట్టిన జాతీయ పౌర రిజిస్టర్(ఎన్‌ఆర్‌సీ)లో తప్పులు సవరించేలా చర్యలు తీసుకోవాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేశాయి. ఒక భారతీయ పౌరుడికి అన్యాయం జరగకూడదని వారన్నారు. కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, వాపపక్షాలకు చెందిన నాయకులు గురువారం రాష్టప్రతి కోవింద్‌తో భేటీ అయ్యారు.

08/10/2018 - 01:40

న్యూఢిల్లీ, ఆగస్టు 9: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభలో బైసన్‌పోలో గ్రౌండ్ కోసం నిరసన తెలపడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శమని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గురువారం ఆయన విలేఖరుతో మాట్లాడుతూ అవినీతిని కప్పిపుచ్చుకోనేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుబీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు.

08/10/2018 - 01:38

ముంబయి, ఆగస్టు 9: భారత స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమం 76వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వతంత్ర పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు చారిత్రక నేపథ్యం ఉన్న ఇక్కడి ఆగస్టు క్రాంతిమైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు ఘనంగా నివాళి అర్పించారు.

08/10/2018 - 01:37

న్యూఢిల్లీ, ఆగస్టు 9: పౌర విమానయాన సంస్థల్లో 298 మంది విదేశీ పైలెట్లు పనిచేస్తున్నారని, వీరిని తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్రం సూచించింది. భారత్‌లో రిజిస్టర్ అయిన విమానాల్లో ఫారిన్ ఎయిర్‌క్య్రూ టెంపరరీ ఆథరైజేషన్ (ఎఫ్‌ఏటీఏ) ద్వారా విదేశీ పైలైట్లు పనిచేసేందుకు 2020 డిసెంబర్ 31వరకు అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా గురువారం లోక్‌సభలో తెలిపారు.

08/10/2018 - 04:37

న్యూఢిల్లీ: షెడ్యూల్‌కులాలు, తెగలపై అత్యాచారాలు, దౌర్జన్యాల నిరోధక చట్టానికి సవరణలు తెస్తూ ఈ చట్టాన్ని బలోపేతం చేస్తూ నిర్దేశించిన సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ చట్టం కింద పోలీసులు కేసులను నమోదు చేసే అంశాలను సడలిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టి, ఈ చట్టాలను కఠినతరం చేస్తే నిబంధనలను రాజ్యసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది.

08/10/2018 - 04:35

న్యూఢిల్లీ: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

08/10/2018 - 00:26

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ముస్లిం మహిళల హక్కుల భద్రత కోసం తీసుకొచ్చిన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు మూడు సవరణలతో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలుత భర్తకు బెయిల్ మంజూరుకు ఆస్కారం లేకుండా

08/10/2018 - 00:12

న్యూఢిల్లీ, ఆగస్టు 9: బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ బలపరిచిన జేడీ(యూ) అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్ ఇరవై ఓట్ల మెజారిటీతో రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హరివంశ్‌కు 125 ఓట్లు రాగా ప్రతిపక్షం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బీకే హరిప్రసాద్‌కు 105 ఓట్లు లభించాయి.

08/09/2018 - 17:59

న్యూఢిల్లీ : ఏపీలో పారిశ్రామిక ప్రోత్సాహానికి ఇస్తామన్న రాయితీలు ప్రకటించాలని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ డిమాండ్‌ చేశారు. ఈరోజు లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక విధానం అమలు చేస్తామని కేంద్రం చెప్పిందని ఆయన గుర్తు చేశారు.

08/09/2018 - 17:57

న్యూఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బిల్లులో నాన్‌బెయిలబుల్‌ అంశం తొలగించడమే కాకుండా మెజిస్ట్రేట్‌ బెయిల్‌ ఇచ్చేలా సవరణ చేశారు.

Pages