S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/10/2018 - 12:32

న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ హంతకులను జైలు నుంచి విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తాము అనుమతి ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ అఫిడవిట్‌ను సుప్రీం కోర్టులో దాఖలు చేసింది.

08/10/2018 - 12:27

న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీలు శుక్రవారంనాడు కూడా ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. ఎంపీ శివప్రసాద్ ఈరోజు హిజ్రా వేషధారణలో వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు.

08/10/2018 - 12:27

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఢిల్లీలోని గోలే మార్కెట్ ప్రాంతంలో నివశించే ఆరేళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతుంది. ఎప్పటిలాగానే స్కూలు నుంచి ఇంటికి వస్తుండగా ఆ పాఠశాలలో పనిచేసే ఎలక్ట్రీషియన్ ఆ చిన్నారిని గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.

08/10/2018 - 12:25

కేరళ: కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 24 ఆనకట్టల గేట్లు ఎత్తివేయటంతో దిగువ ప్రాంతాలను వరద నీరు ముంచెత్తుతుంది. రాష్ట్రంలోని ఇడుక్కి, కోజికోడ్, వయనాడ్, మలప్పరం జిల్లాల్లో సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) రంగంలోకి సహాయక చర్యలు చేపట్టారు.

08/10/2018 - 04:44

ముంబయి: మహారాష్ట్రంలో మరాఠీలు చేపట్టిన చేపట్టిన ప్రత్యేక రిజర్వేషన్ల ఉద్యమం తారస్థాయి చేరుకుంది. గురువారం ఇచ్చిన సమ్మె పిలుపుతో నిరసనకారులు రహదారులను దిగ్బంధం చేశారు. వందతుల నేపథ్యంలో పూనే జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. బంద్ ప్రశాంతంగా నిర్వహించాలని మరాఠా నాయకులు పిలుపునిచ్చారు. రహదారులపై రాకపోకలను నిలిపివేశారని అధికారులు వెల్లడించారు.

08/10/2018 - 04:13

న్యూఢిల్లీ, ఆగస్టు 9: కొత్త సచివాలయం, రోడ్ల నిర్మాణానికి రక్షణ శాఖకు చెందిన బైసన్ పోలో గ్రౌండ్, జింఖానా గ్రౌండ్‌ను కేటాయించేందుకు అప్పటి రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించినా ప్రస్తుత మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తాత్సారం చేస్తూ తెలంగాట్ల పట్ల సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నారని టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి ఆరోపించారు.

08/10/2018 - 04:06

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్‌లో గురువారం కూడా తమ నిరసనను కొనసాగించారు. గాంధీ విగ్రహం వద్ద విభజన హామీలు అమలు చేయాలంటూ ప్లకార్డులను చేతబట్టి నినాదాలిచ్చారు. ప్రతిరోజు ఏదో ఒక వేషంలో కేంద్రంపై నిరసన తెలుపుతున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ హిట్లర్ వేషధారణలో వినూత్నంగా నిరసన తెలిపారు.

08/10/2018 - 01:44

న్యూఢిల్లీ, ఆగస్టు 9: గిరిజన పిల్లలకోసం ఏకలవ్య పాఠశాలలు నెలకొల్పాలని టీఆర్‌ఎస్ ఎంపీ సీతా రాం నాయక్ డిమాండ్ చేశారు. గు రువారం లోక్‌సభ జీరో అవర్‌లో నా యక్ మాట్లాడుతూ ఏళ్లు గడుస్తున్నా విద్య అందుబాటులోకి రావటం లే దన్నారు. ఆగస్టు 9న విశ్వ ఆదివాసు ల దినోత్సవంగా జరుపుకుంటారని, ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రాన్ని కోరినా ఫలి తం లేదని అన్నారు.

08/10/2018 - 01:42

న్యూఢిల్లీ, ఆగస్టు 9: కాంగ్రెస్ పార్టీ దళితులకు ప్రయోజనం కల్పించే ఏ పని చేయలేదని, దళితుల సంక్షేమం పట్టించుకోలేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం దళితుల వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించే స్థాయి, అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. ఇటువంటి విమర్శలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన కోరారు. ఈ అంశంపై ఆయన ట్వీట్ చేశారు.

08/10/2018 - 01:41

న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలకు వస్తున్న ఆదాయంలో 22 శాతం విరాళాలు అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చినవేనని ఒక సంస్థ నివేదికలో వెల్లడించింది. అసలు మనదేశంలోని ప్రాంతీయ పార్టీలకు నిధులు ఎక్కడి నుంచి, ఎంతెంత వస్తున్నాయి, వాటికి విరాళాలు ఇస్తున్న వారెవరు?

Pages