S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/14/2018 - 02:02

న్యూఢిల్లీ, జూలై 13: జమ్మూకాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ యుఎన్ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన నివేదిక అభూతకల్పన అని కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్పష్టం చేశారు. ‘అది వ్యక్తిగత అభిప్రాయమే. యుఎన్ మానవ హక్కుల కమిషన్ అన్నది అసలు అంతర్జాతీయ సంస్థేకాదు’అని మంత్రి కొట్టిపారేశారు.‘నివేదికకు ఐరాసకు ఎలాంటి సంబంధం లేదు’అని శుక్రవారం మంత్రి తెలిపారు.

07/14/2018 - 01:59

కోయంబత్తూర్/చెన్నై, జూలై 13: తమిళనాడులోని ఓ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. విపత్తులను ఎదుర్కొనేందుకు నిర్వహించిన డ్రిల్ ఓ విద్యార్థినిని బలితీసుకుంది. సంఘటనకు సంబంధించి శిక్షకుడు అర్మూగంను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి దీనిపై విచారణకు ఆదేశించారు. నిర్వాహకులు, ఉన్నత విద్యాశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

07/14/2018 - 01:58

న్యూఢిల్లీ, జూలై 13: దేశంలోని అన్ని జిల్లాల్లో పరిశుభ్రత, పారిశుధ్యం పరిస్థితులను అంచనా వేసి ర్యాంకులు ఇచ్చేందుకు కేంద్రం ప్రతిష్టాకరమైన స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ అనే ప్రాజెక్టును శుక్రవారం ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కింద అన్ని జిల్లాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలవుతున్న తీరును మదింపు వేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తీరును ప్రామాణికంగా తీసుకుంటారు.

07/14/2018 - 01:57

న్యూఢిల్లీ, జూలై 13: ఎంతోకాలంగా భారత నిఘా సంస్థలు వెతుకుతున్న పేరుమోసిన టెర్రరిస్టు, బీజేపీ నేత హరేన్ పాండ్యా హత్యకేసులో నిందితుడైన ఫారుక్‌దెడీవాలాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పోలీసులు పాకిస్తాన్‌కు అప్పగించి భారత్‌కు షాక్ ఇచ్చారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడైన ఫారుక్‌ను ముంబయికి చెందిన శ్యాంతో కలిసి దుబాయి పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.

07/14/2018 - 01:41

ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తాయ. శుక్రవారం కుండపోతగా కురిసిన వర్షానికి దేశ రాజధాని ఢిల్లీ కుదేలయంది. ప్రధాన రోడ్లన్నీ జలాశయాల్ని తలపించాయ. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయ. బస్సులు, కార్లు దాదాపు మునిగే పరిస్థితి ఎదురైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కన్నాట్‌ప్లేస్‌లోని మింటో బ్రిడ్జిలో బస్సులు, కార్లు చిక్కుకుపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.

07/14/2018 - 01:37

లక్నో/వారణాసి, జూలై 13: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుంచి రెండు రోజులు పాటు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. సొంత నియోజకవర్గం వారణాసి, అజాంగఢ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. వారం రోజుల్లోనే రెండోసారి యూపీ పర్యటనకు రావడం వెనక బలమైన కారణాలే ఉన్నాయని రాజకీయ విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

07/14/2018 - 00:30

న్యూఢిల్లీ, జులై 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.శుక్రవారం ఉదయం కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఊమెన్ చాందీ,ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ కేంద్రమంత్రులు పల్లంరాజు, జే.డీ శీలంలతో కలిసి రాహుల్‌గాంధీతో కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం అయ్యారు.

07/14/2018 - 00:51

న్యూఢిల్లీ, జూలై 13: వచ్చే ఏడాది జనవరిలో జరిగి గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొనే అవకాశాలున్నాయి. ఈ మేరకు అమెరికా వైట్‌హౌస్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆహ్వానం పంపినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. అయితే దీనిని అమెరికా ప్రభుత్వం ఇంకా నిర్ధారించలేదు.

07/13/2018 - 13:04

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని.. అచబాల్ చౌక్ వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడ్డారు.మృతులను సబ్ ఇన్‌స్పెక్టర్ మీనా, కానిస్టేబుల్ సందీప్‌గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

07/13/2018 - 12:48

కోయింబత్తూర్: మాక్ డ్రిల్ ఓ విద్యార్థిని ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళితే..గురువారం కోయింబత్తూర్‌లోని కోవై కళ్లైమగల్ ఆర్ట్స్ కళాశాలలో ఎన్డీఎంఏ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ట్రైనర్ టీఆర్ ఆర్ముగం పర్యవేక్షణలో ఈమాక్ డ్రిల్ నిర్వహించారు. లోకేశ్వరి అనే విద్యార్థిని రెండో అంతస్థు నుంచి దూకడానికి భయపడుతుండగా ట్రైనర్ ఆర్ముగం ఆమెను తోసేశారు.

Pages