S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/16/2018 - 17:25

తిరువనంతపురం: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గవర్నమెంట్ ప్రెస్‌కు సమీపంలో శశిథరూర్‌కు కార్యాలయం ఉంది. దాదాపు 15మంది కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో కార్యాలయంలో శశిథరూర్ లేరు.

07/16/2018 - 17:22

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ సభలో ప్రసంగిస్తుండగా కొన్ని టెంట్లు కూలిపోయాయి. ఇది గమనించిన ప్రధాని స్పెషల్ ప్రొటెక్షన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ ప్రమాదంలో 24 మంది గాయపడ్డారు. గాయపడినవారికి వెంటనే వైద్యసాయం అందించాల్సిందిగా సూచించారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులందర్నీ పరామర్శించారు. ఈ ఘటనలో 15మందికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా మోదీ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.

07/16/2018 - 17:21

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో సిండికేట్ రాజకీయాలు నడుస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆయన పశ్చిమ మిడ్నాపూర్‌లోని కిసాన్ ర్యాలీలో మాట్లాడుతూ ఇక్కడ ఏ పని జరగలన్నా సిండికేట్ అనుమతి తప్పనిసరి అని విమర్శించారు. ఇక్కడ ప్రజాస్వామ్యం లోపించిందనటానికి నిదర్శనం ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని అన్నారు.కేంద్రం పంపే నిధులు సైతం సిండికేట్ అనుమతి లేకండా జరగదని అన్నారు.

07/16/2018 - 17:19

బీహార్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయని బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. సోమవారంనాడిక్కడ జరిగిన లోక్‌సంవాద్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2006 నుంచి తాము ఈ డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని అన్నారు. ఈ అంశంపై తాము ఫైనాన్స్ కమిషన్ ముందు నివేదిక ఉంచుతామని అన్నారు.

07/16/2018 - 13:48

జమ్ము కాశ్మీర్‌: కుప్వారా జిల్లా సఫావాలీ గాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు-భద్రతాదళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని సైన్యం హతమార్చింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.

07/16/2018 - 13:00

యానాం: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం, పశువుల్లంక వద్ద శనివారం పడవ బోల్తాపడిన ఘటనలో గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. ఇప్పటి వరకు ఒక్క మహిళ మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగిలిన ఆరుగురు విద్యార్థుల మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.

07/16/2018 - 03:59

మహబూబ్‌నగర్: కర్నాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద తాకిడి మొదలైంది. వారం రోజులుగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం ఆల్మట్టి ప్రాజెక్టులోకి దాదాపు లక్ష క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దాంతో ఆల్మట్టికి జలకళ సంతరించుకుంది.

07/16/2018 - 03:57

వరంగల్, జూలై 15: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని దర్గా కాజీపేట వద్ద రైల్వే హైటెన్షన్ వైర్లు తెగిపోయాయి. కాకినాడ నుండి సికింద్రాబాద్‌కు వెళ్తున్న గౌతమి ఎక్స్‌ప్రెస్ దర్గా కాజీపేటకు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా రైల్వే హైటెన్షన్ వైర్లు తెగి కిందపడిపోవడంతో గౌతమి ఎక్స్‌ప్రెస్ ఉన్నఫళంగా ఆగిపోయింది. ఈ సంఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.

07/16/2018 - 01:25

చెన్నై, జూలై 15: జమిలి ఎన్నికలకు సూపర్‌స్టార్ రజనీకాంత్ జై కొట్టారు. లోక్‌సభకు, అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజా ధనం వృథా కాదని, సమయం ఆదా అవుతుందన్నారు. జమిలి ఎన్నికలను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికల వల్ల ప్రయోజనాలను గుర్తించాలన్నారు. ఈ ఎన్నికలు సజావుగా జరిగేందుకు పార్టీలు సహకరించాలన్నారు.

07/16/2018 - 01:10

ఫతేహబాద్ (హర్యానా), జూలై 15: ప్రజాస్వామ్యంలో చట్టసభలు అత్యున్నత వేదికలని, ఈ సభల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు అర్థవంతమైన చర్చలు జరిపి ప్రజల సమస్యలకు పరిష్కారం కనుగొనాలని రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. చట్టసభల గౌరవాన్ని, హుందా తనాన్ని పరిరక్షించేందుకు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన కోరారు.

Pages