S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/12/2018 - 16:46

ఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఏం నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన రేపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరనున్నారనే ఊహాగానాలు గత కొద్దిరోజుల నుంచి వినిపిస్తున్నాయి.

07/12/2018 - 14:00

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పలు స్వయంసహాయక బృందాల మహిళలతో ప్రధాని మోదీ గురువారం ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలానికి చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు కౌసర్‌ సాహెన్‌ బేగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌసర్‌ తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, స్వయం సహాయక బృందంలో చేరడం పై ప్రధానితో చెప్పారు.

07/12/2018 - 13:00

పూణే: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు వస్వాని కన్నుమూశారు. 1918 ఆగస్టు 2న నేటి పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌లో జన్మించిన ఆయన మరో కొద్దిరోజుల్లో వంద సంవత్సరాలు పూర్తిచేసుకోనున్నారు. ఇంతలోనే ఆయన కన్నుమూశారు. భక్తులు శోకసముద్రంలో మునిగిపోయారు. శాఖాహారం వల్ల కలిగే ఉపయోగాలపై అనేక ప్రసంగాలు చేశారు. ఆయన పూర్తి పేరు జస్వాన్ పహ్లజ్‌రాయ్ వస్వాని. దాదాపు 150కి పైగా పుస్తకాలు రాశారు.

07/12/2018 - 06:34

న్యూఢిల్లీ, జూలై: దేశానికి సరైన దిశా గమనాన్ని నిర్దేశించ బలమైన వేదిక ఏర్పాటు చేసుకుని, కీలక బాధ్యతలు నిర్వర్తించే సివిల్ సర్వెంట్లు వృద్ధి రేటు పెరిగేలా కృషి చేయాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్, టెలికమ్యూనికేషన్స్, పోస్టల్ మరియు టెలిగ్రాఫ్, బిల్డింగ్ వర్క్స్ సర్వీసులకు చెందిన ట్రెయినీ అధికారులతో రాష్టప్రతి భవన్‌లో సమావేశమయ్యారు.

07/12/2018 - 05:02

మాలౌట్ (పంజాబ్), జూలై 11: దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు.

07/12/2018 - 02:14

న్యూఢిల్లీ, జూలై 11: విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత తెలుగు భాషాభివృద్ధికి నడుం బిగిస్తే లాభమేమిటని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భాషకు ప్రాధాన్యత పెంచే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ప్రకటన చూసి ఆశ్చర్యం వేసిందని ఆయన ఎద్దేవా చేశారు.

07/12/2018 - 05:03

న్యూఢిల్లీ, జూలై 11: తాజ్ మహల్ చారిత్రక కట్టడాన్ని పరిరక్షించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉత్తర ప్రదేశ్ (యూపీ) సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. పరిరక్షిస్తారా? లేక కూల్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కట్టడాన్ని పరిరక్షించేందుకు అవసరమైన విజన్ డాక్యుమెంట్‌ను యుపీ ప్రభుత్వం రూపొందించకపోవడం పట్ల కోర్టు మండిపడింది. ప్రభుత్వం తీరు నిరాశజనకంగా ఉందని కోర్టు పేర్కొంది.

07/12/2018 - 01:39

న్యూఢిల్లీ, జూలై 11: వివాహేతర సంబంధాల విషయంలో పురుషులతో సమానంగా మహిళలను పరిగణించి వారిని కూడా ఐపీసీ సెక్షన్ 497 పరిధిలోకి తీసుకురావాలని దాఖలైన పిటిషన్ వాదనలను కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించింది. పురుషులతో సమానంగా మహిళలను ఈ సెక్షన్ కింద పరిగణిస్తే వివాహబంధానికి ఉన్న పవిత్రత మంటగలుస్తుందని, దీనిని పరిరక్షించాలని కేంద్రం సుప్రీంకోర్టు బుధవారం నివేదించింది.

07/11/2018 - 22:36

భోపాల్, జూలై 11: బాలికలపై అత్యాచారానికి పాల్పడే కామంధులకు మరణ శిక్ష విధించే విధంగా చట్టాన్ని తేనున్నట్లుల ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో మైనర్లపైన దాడులు అత్యాచారాలు ఘటనలు పెరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు.

07/11/2018 - 22:35

న్యూఢిల్లీ, జూలై 11: కేంద్ర ప్రభుత్వం చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ పోస్టుకు కావాల్సిన విద్య, వృత్తి నైపుణ్య అర్హతలను తగ్గించడంలో ఆంతర్యమేమిటో తెలియజేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేస్తూ బ్యాంకుల్లో సైతం ఎకానమిస్టు పోస్టుకు ఉన్నతార్హతలు అడుగుతున్నారని, అలాంటిది చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ పోస్టుకు అర్హతలు ఎందుకు తగ్గించారని, ఇందులో ఏమన్నా నిగూఢత ఉందా?

Pages