S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/03/2017 - 03:22

కవరట్టి/తిరువనంతపురం/చెన్నై, డిసెంబర్ 2: దక్షిణ తమిళనాడు, కేరళ రాష్ట్రాలను ఓఖి తుపాన్ కుదిపేసింది. అలాగే లక్షద్వీప్ దీవుల్లో అల్లకల్లోలం సృష్టించింది. ఉద్ధృతమైన గాలులు, భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. కల్పేని దీవిలో శనివారం ఉదయం ఐదు బోట్లు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

12/03/2017 - 02:58

కోచి: ఆగ్నేయ అరేబియా సముద్రంలో పెనుతుపానుగా మారిన ఓఖీ కల్లోలాన్ని సృష్టిస్తోంది. తుపాను తాకిడికి సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. కనీవినీ ఎరుగని రీతిలో అలలు పెను బీభత్సానే్న సృష్టిస్తున్నాయి. అలల ఉధృతాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చేపల వేటకు వెళ్లిన జాలర్లలో కొంతమందిని రక్షించిన కోస్ట్‌గార్డ్ సిబ్బంది, మరికొందరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

12/03/2017 - 02:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల అధికారిగా ఉన్న ముళ్లపల్లి రామచంద్రన్ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తారు.

12/03/2017 - 02:55

లక్నో, డిసెంబర్ 2: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తొలగించి బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తే బీజేపీ ఓటమి చెందడం ఖాయమని బహుజన్ సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాతి స్థానంలో బీఎస్పీ నిలిచింది.

12/03/2017 - 02:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: అంతర్జాతీయ నావికా సంస్థ (ఐఎంఓ) కౌన్సిల్‌కు మరోసారి భారత్ ఎంపికయింది. దీనిద్వారా ఐఎంఓ కౌన్సిల్‌లో రెండేళ్లపాటు భారత్ కొనసాగనుంది. ఈ కౌన్సిల్ ప్రతినిధిగా బ్రిటన్ హైకమిషనర్ వైకే సిన్హా వ్యవహరిస్తారు. కౌన్సిల్‌లో జర్మనీ తరువాత అత్యధిక ఓట్లు భారత్‌కు లభించాయి. జర్మనీ 146, భారత్ 144, ఆస్ట్రేలియా 143 ఓట్లు సాధించాయ.

12/03/2017 - 02:51

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నల పరంపర సాగుతోంది. శనివారం తాజాగా నాలుగో ప్రశ్న సంధించారు. ‘గుజరాత్ రాష్ట్రానికి మీరేం చేశారు? విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమేనా? విద్యకు అత్యల్పంగా నిధులు వెచ్చించారు. ఇదేనా మీ ప్రభుత్వంలో విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత?’ అని రాహుల్ నిలదీశారు.

12/03/2017 - 02:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఢిల్లీలో అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ శాఖ నడుం బిగించింది. సెంట్రల్ ఢిల్లీలోని దార్యాగంజ్ ప్రాంతంలో ఆక్రమణకు గురైన 875 ఆస్తులను గుర్తించి, ఆక్రమణదారులకు నోటీసులు జారీచేసింది. 15 రోజుల్లో ఆయా ప్రాంతాలను ఖాళీ చేయాలని కొత్వాలి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) పేరుతో ఆదేశాలు జారీ అయ్యాయి.

12/03/2017 - 02:50

కుంతి, డిసెంబర్ 2: జార్ఖండ్‌లోని కుంతి జిల్లాలో బిజెపి నాయకుడొకర్ని గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపేశారు. ఆయన ఇంటి వెలుపలే శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో బీజేపీ నేత కజిన్, తల్లికి బులెట్ గాయాలయ్యాయని ఎస్పీ అశ్వినీకుమార్ సింగ్ వెల్లడించారు. కాల్పుల సమాచారం అందిన వెంటనే ఆయన హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

12/03/2017 - 02:49

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్లి ఒబామాకు ఏపీ చేనేత చీరలను నటి పూనమ్‌కౌర్ బహుకరించారు. ఈ మేరకు భారత పర్యటనలో ఉన్న ఒబామా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏపీ చేనేత రంగం బ్రాండ్ అంబాసిడర్ పూనమ్‌కౌర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు చీరలను ఇచ్చి మిచెల్లి ఒబామాకు అందించాల్సిందిగా పూనమ్‌కౌర్ విజ్ఞప్తి చేశారు.

12/03/2017 - 02:48

కణేకల్లు, డిసెంబర్ 2: అనంతపురం జిల్లాకు అనుకోని అతిథులు వచ్చారు. కర్నాటకలోని అడవుల నుంచి రెండు ఏనుగులు దారితప్పి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. సరిహద్దు సరిహద్దు గ్రామాల్లో తిరుగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున కణేకల్లు మండలంలో ఓ వ్యక్తిని చంపాయి. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రాణభయంతో గణగజ వణుకుతున్నారు.

Pages