S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/06/2017 - 02:58

చెన్నై, డిసెంబర్ 5: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రథమ వర్థంతి సందర్భంగా ఇక్కడి మెరీనా బీచ్‌లో ఆమె సమాధి వద్దకు మంగళవారం ఉదయం అన్నాడిఎంకె పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో చేరుకుని నివాళులర్పించారు. ముఖ్యమంత్రి కె.పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వమ్ పార్టీ కార్యకర్తలతో వౌన ప్రదర్శనగా ‘అమ్మ’ సమాధి వద్దకు చేరుకున్నారు. వీరంతా నలుపు రంగు చొక్కాలను ధరించారు.

12/06/2017 - 02:03

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: దేశంలో నదుల అనుసంధానంతో జల సంపద ఆదా అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. దేశంలో పవర్ గ్రిడ్ మాదిరిగానే నదుల అనుసంధానం సాగాలన్నారు. దేశంలో జల వనరులకు ఎలాంటి ఇబ్బందీ లేదని, అయితే వినియోగం, నిర్వహణ పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

12/06/2017 - 02:01

జైపూర్, డిసెంబర్ 5: కాశ్మీర్‌లో ఉగ్రవాదుల అణచివేతకు ప్రారంభించిన ‘ఆపరేషన్లు’ ఇంకా కొనసాగుతాయని ఆర్మీ అధిపతి జనరల్ బిపిన్ రావత్ మంగళవారం స్పష్టం చేశారు. ఈ ‘ఆపరేషన్లు’ ఎంతకాలం కొనసాగుతాయన్నది ‘పొరుగు దేశం’ (పాకిస్తాన్) వైఖరిపై ఆధారపడి ఉంటుందన్నారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదులపై తమ ‘చర్యలు’ కొనసాగుతున్నందున అక్కడి పరిస్థితి ఎంతో మెరుగుపడిందన్నారు.

12/06/2017 - 02:00

ముంబయి, డిసెంబర్ 5: 70వ దశకం హిందీ రొమాంటిక్ ఐకాన్ శశికపూర్ పార్ధీవదేహానికి మంగళవారం నాడిక్కడ శాంతాక్రూజ్ హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య దివంగత నటుడి అంతిమయాత్ర సాగింది. ఎంతోకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శశికపూర్ ముంబయిలోని కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో సోమవారం కన్నుమూశారు.

12/06/2017 - 01:59

చెన్నై, డిసెంబర్ 5: ఆర్కేనగర్ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఘట్టంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమిళ హీరో విశాల్, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ నామినేషన్లు రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నామినేషన్ల పత్రాలు అంసపూర్తిగా ఉన్నాయన్న కారణంతో ఇద్దరివీ తిరస్కరిస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

12/06/2017 - 01:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పోలవరం పనులు సమీక్షించి, సీఎం చంద్రబాబుతో చర్చించిన తరువాతే టెండర్ల ప్రక్రియ పునఃప్రారంభం, అంచనాల పెంపు తదితర అంశాలపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేసినట్టు తెలిసింది. పోలవరం వ్యవహారంపై రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉమామహేశ్వరరావు మంగళవారం నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు.

12/06/2017 - 01:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: అయోధ్య కేసు విచారణను 2019 లోక్‌సభ ఎన్నికలు జరిగిన తరువాతే చేపట్టాలన్న వాదనను సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. వక్ఫ్ బోర్డుతోపాటు కేసుతో సంబంధం ఉన్న వర్గాల చేసిన వాదనపై సుప్రీం కోర్టు దాగ్బ్రాంతిని, విస్మయాన్ని వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8కి కేసు విచారణను వాయిదా వేసింది.

12/05/2017 - 04:41

అరయ్యవ దశకం హిందీ సినిమాకు స్వర్ణయుగమే. అన్ని అద్భుతాలూ ఆ దశకంలోనే జరిగాయి. అన్ని కళాఖండాలూ ఆ పదేళ్ల కాలంలోనే. యావద్భారత ప్రేక్షకులను అలరించి ఇప్పటికీ అజరామరంగా నిలిచిపోయాయి. సంగీతం, పాటలు మధురాతి మధురాలుగా నిత్యాన్నందాన్ని ఇప్పటికీ కలిగిస్తూనే ఉన్నాయి. ఆ దశకంలో.. ఓ పక్క రాజేంద్ర కుమార్, మరో పక్క ధర్మేంద్ర, ఇంకోపక్క రాజేష్ ఖన్నా..

12/05/2017 - 04:20

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో కేంద్రం, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

12/05/2017 - 04:18

ఖజురహో (మధ్యప్రదేశ్), డిసెంబర్ 4: అవినీతి అంతానికి ఉద్దేశించిన లోక్‌పాల్ చట్టాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నీరుగార్చిందని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోపించారు. ‘చాలా అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సైతం లోక్‌పాల్ చట్టాన్ని పలుచన చేశారు.. ఆ తర్వాత 2016 జూలై 27న ఆ చట్టాన్ని సవరించడం ద్వారా మోదీ కూడా అదే తీరులో వ్యవహరించారు..

Pages