S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/15/2017 - 02:32

లక్నో, ఏప్రిల్ 14: ప్రముఖుల జయంతులకు సెలవులు ఇచ్చుకుంటూపోతే విద్యార్థులు విలువైన కాలం వృధా అవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో సెలవులు ఇవ్వడం సరైంది కాదని శుక్రవారం ఇక్కడ అభిప్రాయపడ్డారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 126వ జయంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

04/15/2017 - 01:53

నాగపూర్, ఏప్రిల్ 14: నగదు రహిత లావాదేవీలను ప్రోత్ససించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార్ యోజన కింద నగదు అవార్డులు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం నాగపూర్‌లో నిర్వహించిన మెగా డ్రా లో విజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేశారు.

04/15/2017 - 01:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: రైతుల ఆత్మహత్యలపై మహారాష్ట్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బాచు కడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాందేడ్ జిల్లాకు చెందిన ఈ ఎమ్మెల్యే ‘ మద్యపానం అలవాటు వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాని చెబుతున్నారు. అదంతా అవాస్తం. అదే నిజమైతే బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్, మధుర ఎంపీ హేమమాలిని రోజూ మద్యం తాగుతారు. అలా అని ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందా? ’అని ప్రశ్నించారు.

04/15/2017 - 01:20

నాగపూర్, ఏప్రిల్ 14:కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిధన్ ఉద్యమం కేవలం అవినీతిని అంతం చేయడానికే ఉద్దేశించింది కాదని, దీని వల్ల పేదల గళానికి మరింత బలం చేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నగదు రహిత లావాదేవీలను విస్తృతంగా ప్రోత్సహించే లక్ష్యంతో అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా శుక్రవారం నాడిక్కడ రెండు కీలక పథకాలను ఆయన ప్రారంభించారు.

04/15/2017 - 00:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: సంగీతం మతానికి అతీతమైనదని, సుదీర్ఘమైన సంగీత ప్రస్థానంలో తాను ఎంతో విశిష్టమైన ఖ్యాతిని పొందడానికి తల్లిదండ్రుల పట్ల అంకిత భావమే కారణమని ప్రముఖ నేపథ్య గాయకుడు కెజె.యేసుదాస్ స్పష్టం చేశారు. సంగీతం మహా సాగరం లాంటిదని, దానిని ఆస్వాదించేందుకు ఒక జీవితం సరిపోదని ఆయన పేర్కొన్నారు. ‘నేను క్రైస్తవ కుటుంబానికి చెందిన వాడిని.

04/14/2017 - 23:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలోని నల్లధనాన్ని వెలికితీయడంలో నిమగ్నమైన ఆదాయపు పన్ను (ఐటి) శాఖ శుక్రవారం ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ రెండో దశను ప్రారంభించింది. ఈ రెండో దశలో దర్యాప్తు చేయడానికి 60వేలకు పైగా మందిని గుర్తించింది. వీరంతా పెద్ద నోట్లను రద్దు చేసి, పాత నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించిన కాల పరిమితి సమయంలో అక్రమాలకు పాల్పడినట్లుగా భావిస్తోంది.

04/14/2017 - 23:24

శ్రీనగర్, ఏప్రిల్ 14: అల్లరి మూకలు రాళ్లదాడి చేసినా సిఆర్‌పిఎఫ్ జవాన్లు సహనం, సంయమనం పాటించారని, ఒక వేళ్ల కాల్పులు జరిపివుంటే ఎంతో మంది యువకులు చనిపోయి ఉండేవారని జమ్మూకాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఎస్‌పి వైద్ స్పష్టం చేశారు. యువకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నా జవాన్లు సంయమనం కోల్పోలేదని శుక్రవారం ఆయన ప్రశంసించారు.

04/14/2017 - 23:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: పార్టీ సంస్థాగత ఎన్నికలు, కొత్త కార్యవర్గం ఏర్పాటు, మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ, రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికలు, వచ్చే సంవత్సరం తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చించేందుకు బిజెపి జాతీయ కార్యవర్గం శనివారం ఒడిశ్శా రాజధాని భువనేశ్వర్‌లో సమావేశమవుతోంది.

04/14/2017 - 04:27

చిత్రం..గురువారం రాష్టప్రతిభవన్‌లో కార్యక్రమం అనంతరం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో గ్రూప్ ఫొటో దిగిన అవార్డు గ్రహీతలు

04/14/2017 - 04:23

చిత్రం..
గురువారం రాష్టప్రతిభవన్‌లో ప్రణబ్ చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న పరసాల పొన్నమ్మాళ్

Pages