S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/09/2016 - 07:09

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా డాక్టర్ కె లక్ష్మణ్ నియమితులయ్యారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం ఐదు రాష్ట్రాల పార్టీ శాఖలకు కొత్త అధ్యక్షులను నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి స్థానంలో బిజెపి శాసన సభాపక్ష నేత లక్ష్మణ్ నియమితులయ్యారు.

04/09/2016 - 05:31

శనిసింగనాపూర్ ఆలయ ప్రవేశానికి అనుమతి దేవాలయ ట్రస్టు నిర్ణయం.. వెంటనే అమలు

మహిళల ప్రవేశంపై
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆంక్షలను శనిసింగనాపూర్ దేవాలయ ట్రస్టు శుక్రవారం
ఎత్తివేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర ఆరంభదినంగా జరుపుకునే ‘గుడి పడ్వా’ రోజునుంచే నిర్ణయం
అమలులోకి వచ్చింది.

04/09/2016 - 05:12

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: బ్రిటన్‌లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తీసుకొచ్చే విషయయంలో మీ ఉద్దేశం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఒకప్పుడు భారత్‌కు తరగని వనె్నతెచ్చిన కోహినూన్ వజ్రం ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంది. 105 కేరెట్ల కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే అతిపెద్దది.

04/09/2016 - 05:08

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగినవారంటూ తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన 1253మంది విద్యుత్ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వారికి తెలంగాణ ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో వేతనాలు చెల్లించాలన్న హైకోర్టు ఉత్తర్వులను సవరించింది.

04/08/2016 - 16:28

బెంగళూరు: ఉగాది సందర్భంగా విడుదలైన సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా చూస్తు ఘర్షణ పడిన అభిమానుల్లో ఒకరు మరణించారు. కర్ణాటకలోని పావగడలోని అలంకార్ థియేటర్లో సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా చూస్తున్న ఇద్దరు అభిమానులు మాటామాటా అనుకుని ఘర్షణపడ్డారు. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో రాకేష్‌నాయక్ అనే ప్రేక్షకుడు మరణించాడు.

04/08/2016 - 16:27

బెంగళూరు:అప్పుల ఎగవేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచివెళ్లిపోయిన వ్యాపార దిగ్గజం విజయ్‌మాల్యా పేరు తాజాగా పనామా పత్రాల్లో చోటుచేసుకుంది. బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్‌లో ఆఫ్‌షోర్ కంపెనీ నడుపుతూ పెట్టుబడులు పెట్టారని పనామా పత్రాలు వెల్లడించాయి. ఈ కంపెనీ తరపున లావాదేవీలన్నా స్వయంగా ఆయన ఇంటినుంచి నిర్వహించారని ఆ పత్రాల్లో పేర్కొన్నారు.

04/08/2016 - 06:25

సరుఖేట్రి (అసోం), ఏప్రిల్ 7: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. నాగ్‌పూర్ నుంచి జారీ అవుతున్న ఆదేశాలకు అనుగుణంగా మతతత్వ రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె ప్రజలను కోరారు.

04/08/2016 - 06:20

డెహ్రాడూన్, ఏప్రిల్ 7: ఉత్తరాఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం విషయంలో ఈ నెల 18లోపు ఎలాంటి చర్య తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కేంద్రం ఎలాంటి చర్యకు పూనుకున్నా ఈ కేసులో పిటిషనర్ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఆదేశాలు జారీ చేయవలసి వస్తుందని కూడా ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరించింది.

04/08/2016 - 06:19

బీర్పర (పశ్చిమబెంగాల్), ఏప్రిల్7: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాలను మమతా బెనర్జీ బహిష్కరించారని ఆయన విమర్శించారు.

04/08/2016 - 06:17

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: పనామాలో అక్రమ సంపాదనను దాచుకున్న పన్ను ఎగవేతదారులంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్నేహితులు, శ్రేయోభిలాషులేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ ఆరోపించారు.

Pages