S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/10/2016 - 04:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏ కొద్ది నిజాయితీ ఉన్నా సైన్స్, సాంకేతిక విజానం శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరిని మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ డిమాండ్ చేశారు.

04/10/2016 - 04:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో ప్రధానంగా అసోంపైనే బిజెపి గంపెడంత ఆశలు పెట్టుకుని ఉంది. వరసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌ని గద్దెదింపి ఈ సారి అక్కడ అధికార పీఠం దక్కించుకోవాలని బిజెపి గట్టిగానే ప్రయత్నిస్తోంది. అసోంలోని మొత్తం 3.2 కోట్ల జనాభాలో కోటీ పది లక్షల మంది ముస్లింలున్నారు.

04/10/2016 - 03:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: భారత దేశ నాగరికతకు బహుళత్వం, సహనశీలతలే ప్రధాన గీటురాళ్లని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. మతపరమైన ఉద్రిక్తతల విషయంలో ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకుడు అర్జున్ సింగ్ స్మారకార్థం శనివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రణబ్ ఈ విజ్ఞప్తి చేశారు.

04/10/2016 - 03:59

హైదరాబాద్, ఏప్రిల్ 9: లోక్ అదాలత్‌ల వల్ల సామాన్యులకు ఖర్చులేని సత్వర న్యాయం అందడం తోపాటు న్యాయ స్థానాలపై ఒత్తిడి తగ్గుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూ ర్ వెల్లడించారు. అఖిల భారత న్యాయ సేవాధికార సంస్థ 14వ జాతీయ సదస్సు శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జస్టిస్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయ సహాయం అందించడంలో లోక్ అదాలత్ కీలక భూమిక పోషిస్తోందన్నారు.

04/10/2016 - 04:19

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర తీరాన్ని అభివృద్ధి చేసేందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్లు రాష్ట్ర కార్మిక, యువజన వ్యవహారాల శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయన శనివారం కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఏర్పాటు చేసిన జాతీయ సాగరమాల అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.

04/10/2016 - 04:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగర్‌మాల ప్రాజెక్టు కింద రానున్న నాలుగయిదేళ్లలో కనీసం ఒక కోటి ఉద్యోగాలు సృష్టించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశానికి ఉన్న 7,500 కిలో మీటర్ల తీర ప్రాంతంలో ఓడ రేవులు తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే ఉద్దేశంతో ఈ సాగర్‌మాల ప్రాజెక్టును చేపట్టారు.

04/09/2016 - 12:14

హైదరాబాద్:పేదలకు ప్రయోజనం కలిగిస్తున్న లోక్ అదాలత్‌కు అందరూ పునరంకితం కావాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టి.ఎస్.్ఠకూర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన 14వ అఖిలభారత న్యాయాధికార సంస్థ సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. లోక్ అదాలత్‌కు సవాళ్లు ఎదురౌతున్నాయని, అయినా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

04/09/2016 - 08:27

రహా (అసోం), ఏప్రిల్ 8: అసోం ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతున్నారు. సుడిగాలి ప్రచార సభలతో కాంగ్రెస్ పాలనపైనా, అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్‌పైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం రహాలో జరిగిన ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా శారదా చిట్‌ఫండ్ స్కాంను ప్రముఖంగా ప్రస్తావించారు.

04/09/2016 - 08:25

శ్రీనగర్, ఏప్రిల్ 8: శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (నిట్)లో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. నిట్‌ను కాశ్మీర్ నుంచి మరోచోటికి తరలించడం సహా తమ డిమాండ్లన్నింటి సాధన కోసం స్థానికేతర విద్యార్థులు శుక్రవారం క్యాంపస్‌లో ప్రదర్శన నిర్వహించారు.

04/09/2016 - 08:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల దేశంలోని విద్యాసంస్థలకు ఇచ్చిన ర్యాంకుల తీరును పలువురు విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. ఈ ర్యాంకుల జాబితా తమను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. అయితే యూనివర్శిటీలు సమర్పించిన డాటా ఆధారంగానే ర్యాంకులు కేటాయించినట్టు హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ పేర్కొంటోంది.

Pages