S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/23/2015 - 07:12

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలోని అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు సిహెచ్ మల్లారెడ్డి డిమాండ్ చేశారు. మల్లారెడ్డి మంగళవారం లోక్‌సభలో 377 నిబంధన కింద ఇచ్చిన నోటీసుపై మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు.

12/23/2015 - 06:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, మంచినీటి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ సానుకూలత వ్యక్తం చేశారు.

12/23/2015 - 05:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: హవాలా ఆరోపణలను ఎదుర్కొన్న ఎల్‌కె అద్వానీ బయటపడినట్లే డిడిసిఏ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా బైట పడతారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మోదీ మంగళవారం బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అరుణ్ జైట్లీని గట్టిగా వెనకేసుకు వచ్చారు.

12/23/2015 - 05:43

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: డిడిసిఏలో జరిగిన అవినీతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ సభ్యులు మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యలు చేసిన గొడవ మూలంగా రాజ్యసభ మంగళవారం ఉదయం జీరో అవర్‌లో రెండు సార్లు, ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో రెండు సార్లు వాయిదా పడింది.

12/23/2015 - 05:43

కలబురగి (కర్నాటక), డిసెంబర్ 22: భారతీయ ఉన్నతవిద్యా సంస్థలు ప్రపంచ ర్యాంకింగ్‌లో వెనుకబడి పోకుండా ఉండడం కోసం అవి అంతర్జాతీయ వేదికపై తమకున్న అర్హతలను హైలైట్ చేయడానికి మరింత చురుగ్గా ప్రయత్నించాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రపంచ స్థాయి అధ్యాపక బృందం వల్ల మాత్రమే ప్రపంచ స్థాయి విద్య సాధ్యమని ఆయన స్పష్టం చేసారు.

12/23/2015 - 05:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో వార్షిక శిఖరాగ్ర చర్చలకోసం ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల రష్యా పర్యటనకోసం బుధవారం బయలుదేరి వెళ్లనున్నారు. రష్యాతో ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రత్యేక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటుగా ప్రత్యేకించి అణు విద్యుత్, హైడ్రోకార్బన్లు, రక్షణ, వాణిజ్య రంగాలు లక్ష్యంగా ఈ సారి చర్చలు జరగనున్నాయి.

12/23/2015 - 05:41

ముంబయి, డిసెంబర్ 22: సంచలనం కలిగించిన నటి హేమ, ఆమె లాయర్ హరీశ్ భంబానీ జంట హత్య కేసుల మిస్టరీని పోలీసులు ఛేదించారు. హేమ మాజీ భర్త, నటుడు చింతన్ ఉపాధ్యాయ్ హంతకుడని తేల్చారు. జంట హత్య కేసులో నిందితుడుగా వున్న చింతన్ పోలీసుల విచారణలో ఒక్కోసారి ఒక్కోరకంగా సమాధానాలు చెప్పాడని అడిషనల్ సిపి ఫతేసింగ్ పాటిల్ వెల్లడించారు.

12/23/2015 - 05:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలో మతం పేరుతో జరుగుతున్న హింసను నిరోధించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని వివిధ మతాలకు చెందిన నేతలు పిలుపునిచ్చారు. మిలాదుల్ నబీని పురస్కరించుకుని డిసెంబర్ 24ను అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ప్రకటించాలని సంయుక్త విలేఖరుల సమావేశంలో వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో హిందూ, సిక్కు, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

12/23/2015 - 03:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఇక బాల నేరస్థుల ఆటకట్టు. మైనార్టీ తీరలేదు కాబట్టి ఎలాంటి ఘోరాలకు, నేరాలకు, అఘాయిత్యాలకూ పాల్పడ్డా చిక్కే ఉండదనుకుంటే ఇబ్బందే. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నేపథ్యంలో మహిళలకు మరింత భద్రత కలిగించే దిశగా పార్లమెంట్ బలమైన ముందడుగు వేసింది. హేయమైన, ఘోరమైన ఆకృత్యాలకు పాల్పడే 16-18 సంవత్సరాల వయస్కులను ఇంకెంత మాత్రం బాల నేరస్థులుగా పరిగణించరు.

12/22/2015 - 17:15

న్యూఢిల్లీ: జువైనల్ చట్ట సవరణపై రాజ్యసభలో వాడీవేడీ చర్చ కొనసాగుతోంది. పలువురు సభ్యులు నిర్భయ ఘటన జరిగిన తర్వాత పరిణామాలపై చర్చిస్తున్నారు. బాల నేరస్థులకు, తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి వేర్వేరు జైళ్లు ఉండాలని గులాం నబీ ఆజాద్ అభిప్రాయపడ్డారు. బాల నేరస్థులను పెద్ద నేరస్తులతో కలపి ప్రాసిక్యూషన్ నిర్వహించరాదని సూచించారు. జువైనల్ చట్టం ప్రకారమే బాల నేరస్థులను విచారించాలని తెలిపారు.

Pages