S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/22/2015 - 06:04

మోదీ రష్యా పర్యటనలో ఖరారుకు అవకాశం

12/22/2015 - 06:11

తెలంగాణకు 45వేల217 కేటాయింపు కేంద్ర పథకంగా మంజూరు

12/21/2015 - 18:48

హైదరాబాద్‌: ఫిఫా అధ్యక్షుడు సీప్‌ బ్లాటర్‌, ఉపాధ్యక్షుడు మిచెల్‌ ప్లాటినీలను ఎనిమిదేళ్లపాటు ఫుట్‌బాల్‌ సంబంధిత ఏ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఫిఫా ఎథిక్స్‌ కమిటీ నిషేధించింది. లంచం, అవినీతికి సంబంధించిన ఆరోపణలపై విచారించి ఈ తీర్పును వెలువరించింది.

12/21/2015 - 18:47

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 45వేలకు పైగా గృహాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని ఇళ్లను కేంద్రం మంజూరు చేయటం విశేషం. గతంలో రాష్ట్రానికి 10వేల ఇళ్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

12/21/2015 - 18:36

గువహటి: అసోంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. గత నెలలో బీజేపీలోకి చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రణబ్ కుమార్ గొగోయ్ అనర్హులుగా ప్రకటించారు.126 మంది సభ్యులున్న అసోం అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్కు 69 ఎమ్మెల్యేలున్నారు.

12/21/2015 - 16:48

చెన్నై: రోడ్డు ప్రమాదంలో నలుగురు అన్నదమ్ములు ఒకేసారి మరణించిన విషాద సంఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కావేరి పట్టణానికి చెందిన ఈ నలుగురు అన్నదమ్ములు పండ్ల వ్యాపారస్థులు. వీరంతా ఆటోలో వెళ్తుండగా ఆటో టైరు పేలి రోడ్డు పక్కన గొయ్యిలో పడడంతో ప్రమాదం జరిగింది.

12/21/2015 - 14:08

ఢిల్లీ : నిర్భయ కేసులో బాల నేరస్థుడి విడుదలపై స్టే ఇవ్వాలంటూ ఢిల్లీ మహిళా కమిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ ఘటనలో బాల నేరస్థుడు నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.

12/21/2015 - 13:51

న్యూఢిల్లీ : ఢిల్లీ క్రికెట్ సంఘంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అరోపణలపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ లోకసభలో వివరణ ఇచ్చారు. క్రికెట్ స్టేడియంలో వీఐపీ బాక్సుల నిర్మాణం ద్వారా 35 కోట్లు సేకరించినట్లు మంత్రి తెలిపారు. 114 కోట్లు ఖర్చు చేసి ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో పునర్నిర్మాణం చేపట్టినట్లు జైట్లీ సభలో పేర్కొన్నారు.

12/21/2015 - 11:55

దిల్లీ: దిల్లీ క్రికెట్ సంఘంలో తాను అక్రమాలకు పాల్పడ్డానంటూ దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ సభ్యులపైనా అర్థంలేని ఆరోపణలు చేయటం తగదని జైట్లీ ఆగ్రహం వ్యక్తంచేశారు.

12/21/2015 - 07:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: పార్లమెంటు భవనాన్ని సందర్శించే వారు మీడియాతో మాట్లాడవద్దని ప్రభుత్వం సలహా ఇచ్చింది. ‘మీడియాతో మాట్లాడవద్దని సందర్శకులను కోరుతున్నాం’ అని లోక్‌సభ సెక్రటేరియట్ జారీ చేసే జనరల్ పాస్‌లపై ఎర్ర అక్షరాలతో రాసి ఉంటోంది. అలాగే మొబైల్ ఫోన్లు, కెమెరాలు, తుపాకులులాంటి మారణాయుధాలను కూడా పార్లమెంటు భవనంలోపలికి తీసుకు రావద్దని సందర్శకులకు సూచించారు.

Pages