S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/22/2015 - 17:12

న్యూఢిల్లీ : జువెనైల్ చట్ట సవరణ బిల్లుకు తృణామూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. దేశ ప్రజలు కోరుకుంటున్న బిల్లుకు ఎంపీలు అందరూ సహకరించాల ని తృణముల్ కాంగ్రెస్ నేత ఒబ్రెయిన్ కోరారు. జువెనైల్ జస్టిస్ బిల్లును మరింత పటిష్టం చేసేందుకు అందరూ ఒక్కటికావాలన్నారు. బాల నేరస్థుల శిక్ష కాలాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

12/22/2015 - 14:08

ముంబయి: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన చిత్రకారిణి హేమా ఉపాధ్యాయ్, ఆమె లాయర్ హరీశ్ భంబానీ హత్య కేసులో ఆమె నుంచి విడిపోయిన భర్త చింతన్ ఉపాధ్యాయ్ ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దాదాపు ఈ హత్య చోటుచేసుకుని వారం రోజులు గడిచిన తర్వాత సోమవారం రాత్రి చింతన్ ను ప్రశ్నించేందుకు పిలిపించిన పోలీసులు అనంతరం మంగళవారం తెల్లవారు జామున 3.30గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

12/22/2015 - 13:36

న్యూఢిల్లీ : రాజ్యసభ నేటి ఉదయంనుంచి వాయిదాల సభగా మారిపోయింది. డిడిసిఎ అంశంపై కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఉదయంనుంచి పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం ఒంటిగంటకు సభ పునఃప్రారంభమైన తరువాత మళ్లిd అదే పరిస్థితి నెలకొంది. దీనితో సభ మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా పడింది.

12/22/2015 - 13:35

న్యూఢిల్లీ : దేశంలోని ఆరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి) కళాశాలల్లో 2014-2015 విద్యాసంవత్సరంలో మొత్తం 63 మంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలయ్యారని కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభకు తెలిపారు. సరైన ప్రతిభ చూపని కారణంగా ఐఐటిలనుంచి విద్యార్థులను తొలగించారా అనే ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు.

12/22/2015 - 13:29

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చే వరకు అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ చేయవద్దని, దరఖాస్తులు స్వీకరించడానికి అభ్యంతరం లేదని న్యాయస్థానం తెలిపింది. సంక్రాంతి సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

12/22/2015 - 13:25

న్యూఢిల్లీ : నిర్భయ తల్లిదండ్రులు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాసానికి వెళ్లారు. రాజ్యసభలో జువనైల్‌ జస్టిస్‌ బిల్లు ఆమోదానికి సహకరించాల్సిందిగా వారు ఆయనను కోరనున్నారు. రాజ్యసభ సమావేశం ప్రారంభమైప్పటినుంచి డిడిసిఎ అంశంపై విపక్షాల ఆందోళనతో వాయిదాలు పడుతున్న విషయం విదితమే.

12/22/2015 - 13:20

న్యూఢిల్లీ : డీడీసీఏ వివాదంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రధాని మోదీ అండగా నిలిచారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అవినీతికి పాల్పడ్డారంటూ జైట్లీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన అంశంపై ప్రధాని మోదీ ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రస్తావించారు. డీడీసీఏ వివాదం నుంచి జైట్లీ బయటపడుతారని మోదీ అన్నారు. డీడీసీఏలో జైట్లీ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని మోదీ అన్నారు.

12/22/2015 - 13:18

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా ఐదుగురు ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పరువు నష్టం దావాకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. సీఎం కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేతలు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్‌సింగ్, రాఘవ్ ఛద్దా, దీపక్ బాజ్‌పాయ్‌లకు నోటీసులు జారీ చేసింది.

12/22/2015 - 11:49

కోల్‌కతా: ఇక్కడి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం ఉదయం రన్‌వేపై ఆగి ఉన్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ బస్సు అదుపుతప్పి ఢీకొంది. ఐతే ఆ సమయంలో విమానంలో ప్రయాణీకులెవ్వరూ లేరు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

12/22/2015 - 11:48

హైదరాబాద్: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఇక్కడి నుంచి బీదర్‌కు బయల్దేరారు. గుల్బర్గాలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ సభలో ఆయన ప్రసంగిస్తారు. మంగళ, బుధవారాల్లో కర్ణాటకలో పర్యటన ముగించాక తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

Pages