S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/08/2019 - 22:53

కొలంబో, ఫిబ్రవరి 8: ఈ నెల 9,10 తేదీల్లో బెంగళూరులో జరిగే శ్రీలంక, భారత్ సంబంధాల అంశంపై జరిగే సదస్సులో శ్రీలంక ప్రతిపక్ష నేత మహీంద్ర రాజపక్స ప్రసంగించనున్నారు. గత నెలలో రాజపక్స ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు. ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎలా అభివృద్ధి చెందుతాయనే అంశంపై ఈ వేదికను ఏర్పాటు చేశారు.

02/08/2019 - 22:08

చురాబందర్ (పశ్చిమబెంగాల్), ఫిబ్రవరి 7: పశ్చిమబెంగాల్‌లో ప్రజాపరిపాలన స్తంభించిందని, సీఎం మమతా బెనర్జీ రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారని,దళారులకు పరిపాలన అప్పగించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. ఉత్తరబెంగాల్‌లో జల్పాయ్‌పురి జిల్లాలో జరిగిన బీజేపీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధిని మర్చిపోయి చిల్లర రాజకీయాలకు చేయడానికి తృణమూల్ ప్రభుత్వం అలవాటుపడిందన్నారు.

02/08/2019 - 17:09

రాయ్‌గఢ్: ఈ కాపలదారుడు పేదల కోసమే పనిచేస్తాడని, ఎపుడు అప్రమత్తంగా ఉంటాడని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. చత్తీసగఢ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి చవ్చిన తరవాత సీబీఐని రానివ్వటంలేదని, కేంద్ర వైద్య ఆరోగ్య పథకాలను వద్దంటున్నారని అన్నారు.

02/08/2019 - 16:31

న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై మరోసారి లోకసభలో చర్చ జరిగింది. రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పారు. రఫేల్ ఒప్పందాన్ని ప్రధానమంత్రి కార్యాలయం రక్షణ మంత్రిత్వశాఖకు వ్యతిరేకంగా నేరుగా ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుందని ఓ జాతీయ మీడియాలో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

02/08/2019 - 16:26

న్యూఢిల్లీ: కల్తీ మద్యం సేవించి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో 30 మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్, ఖుషీనగర్‌లో కల్తీమద్యం సేవించి 16మంది చనిపోగా తొమ్మిది మంది అధికారులను సస్పెండ్ చేశారు. ఈ రెండు గ్రామాల్లో జరిగిన వేడుకల సందర్భంగా కల్తీ మద్యం సేవించారు. కాగా మృతుల కుటుంబాలకు రెండు లక్షల పరిహారం, అస్వస్థతగురైన వారికి రూ.50,000 వేలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు.

02/08/2019 - 13:07

న్యూఢిల్లీ: విశాఖపట్నంలో పర్యటించాల్సిన ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆయన ఈనెల 16న విశాఖలో పర్యటించాలి. కాని వివిధ కార్యక్రమాల వల్ల పర్యటన ఈనెల 27కి వాయిదా పడినట్లు పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 10న ప్రధాని మోదీ గుంటూరులో పర్యటించనున్నారు.

02/08/2019 - 13:05

న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ఒప్పందానికి సంబంధించి ప్రధాని మోదీ అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రఫేల్ ఒప్పందంపై పీఎంఓ, రక్షణ మంత్రత్వ శాఖ జోక్యం ఉందని ఆరోపించారు. తాము గత ఏడాది కాలంగా దీనిపై మాట్లాడుతున్నా మోదీ, రక్షణ శాఖ మంత్రి విశ్వాసంగా అబద్ధాలు చెబుతూనే ఉన్నారని అన్నారు.

02/08/2019 - 13:03

కర్ణాటక: డబ్బులు ఎరవేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. బీజేపీ నేత యడ్యూరప్ప జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్నగౌడ్‌కు 25 లక్షల రూపాయలు ఎరవేశారని దీనికి సంబంధించిన ఆడియో టేపును ముఖ్యమంత్రి కుమారస్వామి విడుదల చేశారు.

02/08/2019 - 04:47

లక్నో: లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని యూపీ ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అభివృద్ధి పథకాలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా బీజేపీ అగ్రనేత, దివంగత మాజీ ప్రధాని ఏబీ వాజపేయి పేరుతో ఓ మెడికల్ యూనివర్శిటీని ప్రకటించారు.

02/08/2019 - 04:14

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఒకవైపు అంతులేని కాలుష్యం... మరోవైపు ఒక్కసారిగా మారిపోయే వాతావరణం... ఇలా ఎన్నో రకాల సమస్యలతో అల్లాడుతున్న దేశ రాజధాని అందరినీ భయపెడుతున్నది. తమ పరిస్థితి కూడా ఢిల్లీ మాదిరే మారుతుందేమోనన్న భయం దేశంలోని ప్రధాన నగరాలను వేధిస్తున్నది. ఢిల్లీలో వాయు, జల కాలుష్యాలు ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటిపోయాయి.

Pages