S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/23/2018 - 00:13

విశాఖపట్నం, డిసెంబర్ 22: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే తమ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్ ముగింపు సందర్భంగా విశాఖలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు, అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన నాయకుడే ప్రధాని అవుతారని పేర్కొన్నారు.

12/23/2018 - 00:12

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు జీఎస్టీ నుంచి కొండంత ఊరట కల్పించింది. క్రిస్మస్ కానుకగా మొత్తం 23 వస్తు, సేవలపై పన్ను రేటు తగ్గించింది. సినిమా టికెట్లు, టీవీలు, మానిటర్ స్క్రీన్‌లు, పవర్ బ్యాంక్‌లు సహా అనేక వస్తువుల ధరలు జీఎస్టీ కౌన్సిల్ శనివారం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో మరింతగా తగ్గనున్నాయి. అలాగే నిల్వ ఉంచిన కూరగాయలపై లెనీని కూడా జీఎస్టీ మినహాయించింది.

12/23/2018 - 00:02

హైదరాబాద్, డిసెంబర్ 22: దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కార్మిక వర్గాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా చేపట్టనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు ఐక్యంగా పిలుపు ఇచ్చాయి.

12/22/2018 - 23:42

హైదరాబాద్, డిసెంబర్ 22: రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్‌ను తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌లు శనివారం నాడు కలిసి ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులపై నివేదికలను అందించారు. శుక్రవారం నాడు రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు.

12/22/2018 - 22:31

అహ్మదాబాద్, డిసెంబర్ 22: సమాజాన్ని కులాలు, మతాల పేరుతో విభజించి రాజకీయంగా లబ్ధిపొందాలనే శక్తులపై భద్రతా ఏజన్సీలు అప్రమత్తంగా ఉండాలని, దేశానికి ఈ శక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశాన్ని తీవ్రవాదంతో విచ్ఛిన్నం చేయాలనే చీకటి శక్తులు, సంస్థలపై నిఘా పెట్టాలని ఆయన పోలీసులను కోరారు. దేశమంతా ఒక్కటే అనే సమభావాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఆయన పోలీసులను కోరారు.

12/22/2018 - 22:28

శబరిమల, డిసెంబర్ 22: కేరళలో ప్రసిద్ధ శబరిమల అయప్పస్వామి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకటిలాడింది. మండల వార్షిక పూజల నేపథ్యంలో ఒక్కరోజే లక్ష మంది యాత్రికులు తరలితరలి వచ్చారు. గత కొంతకాలంగా నిరసనలో హోరెత్తిపోయిన శబరిమల పరిసరాల్లో ఉత్సహపూరిత వాతావరణం కనిపించింది. శుక్రవారం ఒక్కరోజే 1.12,260 మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

12/22/2018 - 16:41

చెన్నై: రాబోయే లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని మక్కల్ నీధి మయ్యమ్ అధినేత, సినీ నటుడు కమల్‌హాసన్ వెల్లడించారు. ఆయన తన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో భావసారూప్యత గల పార్టీలతో పొత్తులు పెట్టుకోనున్నట్లు తెలిపారు. కూటమిలో చేరతామా లేదా కూటమికి నాయకత్వం వహిస్తామా అనేది ఇపుడే చెప్పలేమని అన్నారు.

12/22/2018 - 16:39

న్యూఢిల్లీ: అగస్టా హెలికాఫ్టర్ల ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మిషెల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ శనివారంనాడు అదుపులోనికి తీసుకున్నారు. మిషెల్‌ను విచారించే అవకాశం కల్పించాలని ఈడీ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక జడ్జి అరవింద్ కుమార్ అందుకు అనుమతినివ్వటంతో ఈడీ మిషెల్‌ను విచారించి అదుపులోకి తీసుకున్నారు.

12/22/2018 - 17:29

న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్‌ను 40 రకాల వస్తువులపై తగ్గించారు. ఈ మేరకు ఇక్కడ జరిగిన జీఎస్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సాధారణ ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను ఈ పరిధిలోనికి తీసుకువచ్చారు. దాదాపు 40 రకాల వస్తువులను జీఎస్టీ పన్ను పరిధిని 18 నుంచి 12కు తగ్గించారు. అలాగే మరికొన్ని వస్తువులను 5శాతం పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు. జీఎస్టీ మండలి సమావేశం ఇంకా కొనసాగుతుంది.

12/22/2018 - 13:32

న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే ఆల్కా లంబా తన పదవికి రాజీనామా చేశారు. సిక్కుల ఊచకోతకు సంబంధించి రాజీవ్‌గాంధీకి ఇచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ప్రవేశపెట్టిన తీర్మానంపై దుమారం చెలరేగింది. ఈ ప్రితిపాదనను వ్యతిరేకిస్తూ ఆల్కా లంబా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఆప్ అధిష్టానం ఆమెను రాజీనామా చేయమని కోరటంతో లంబా తన పదవికి రాజీనామా చేశారు.

Pages