S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవిడ్-19 మృతులు ఏడుగురు

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 (కరోనా) వైరస్ సోకిన సంఖ్య ఆదివారం నాటికి 341కి చేరుకుంది. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడి మరణించడంతో ఈ వ్యాధి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. బిహార్‌లో ఒక వ్యక్తి ఈ వైరస్‌తో మరణించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదేవిధంగా పాట్నాలో 38 ఏళ్ల వయసున్న వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఖతర్ నుంచి ఇటీవల తిరిగివచ్చాడు. ఈ యువకుడు కరోనా వైరస్ బారిన పడి ఆదివారం మరణించాడు.

‘కుర్లా’ ఎక్స్‌ప్రెస్‌లో కలకలం

గుంతకల్లు, మార్చి 22: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్‌లో ఆదివారం కరోనా కలకలం రేగింది. ముంబయి-కోయంబత్తూ రు(కుర్లా) ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తిపై తోటి ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేయడంతో అతడిని గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముంబయి నుం చి తమిళనాడులోని హోసూర్‌కు బీ-4 కోచ్‌లోని బెర్త్-37లో ప్రయాణిస్తున్న షా మహ్మద్ తీవ్రంగా దగ్గుతుండటంతో తోటి ప్రయాణికులు విధి నిర్వహణలో ఉన్న టీటీఈ కిషోర్‌కు ఫిర్యాదు

ఏపీలో 30లక్షల హ్యాపీ హోమ్స్

అమరావతి: బలహీన వర్గాల ప్రజలకు గృహ నిర్మాణం పథకంలో ప్రభు త్వం నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టనుంది. దేశంలోనే తొలిసారిగా ఇండో - స్విస్ ఇంధన సామర్థ్య సాంకేతికతను బలహీన వర్గాల గృహ నిర్మాణంలో వినియోగించనున్నారు. సుమారు 30లక్షల ఇళ్లలో ఈ నూతన సాంకేతికత ఉపయోగించటం ద్వారా ఇళ్లలో ఉష్ణోగ్రత 4నుంచి 8డిగ్రీల వరకు తగ్గటంతో పాటు కనీసం 20శాతం మేర విద్యుత్ ఆదా చేయాలని సంకల్పించారు. స్విట్జర్లాండ్ ప్రభు త్వ విభాగమైన ఫెడరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ (ఎఫ్‌డీఎఫ్‌ఈ) సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ)

దండకారణ్యంలో మారణకాండ

భద్రాచలం టౌన్, మార్చి 22: దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. పచ్చటి అడవిలో మరోమారు నెత్తురు చిందింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ రేంజ్ సుకుమా జిల్లాలో మావోయిస్టులు మారణహోమం సృష్టించారు. మాటువేసి మెరుపుదాడితో భద్రతా బలగాలను మట్టుబెట్టారు. కూంబింగ్‌కు వచ్చిన బలగాలనే లక్ష్యంగా చేసుకున్న మావోలు మూకుమ్మడిగా కాల్పులకు దిగి 17మంది జవాన్లను దారుణంగా హతమార్చారు. మావోల కాల్పుల ధాటికి జవాన్లు చెల్లాచెదురవ్వగా వారిలో 17మందిని తొలుత మావోయిస్టులు అపహరించారు. బలగాల గాలింపు చర్యల్లో ఆదివారం 17మంది జవాన్ల మృతదేహాలు లభ్యమయ్యాయి.

రాష్ట్రం.. నిర్మానుష్యం!

అమరావతి, మార్చి 22: కరోనా నియంత్రణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ‘జనతా కర్ఫ్యూ’ స్వచ్ఛందంగా జరిగింది. పూర్తిస్థాయిలో విజయవంతమైంది.. రాష్టవ్య్రాప్తంగా 90శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. కర్ఫ్యూతో కరోనాను కట్టడి చేయవచ్చనే భావనతో ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇళ్లలోంచి బయటకు కదల్లేదు. ఆదివారం సెలవురోజు కావటంతో ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికారులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 7గంటల లోపు పాలు, ఇతర నిత్యావసరాలకు మాత్రమే ప్రజలను అధికారులు బయటకు అనుమతించారు.

31 వరకూ లాక్‌డౌన్

విజయవాడ, మార్చి 22: కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో రాష్ట్రంలోనూ ఈ నెల 31వరకూ లాక్‌డౌన్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్ ఒక్కటే మార్గమని, ఎవరూ తిరగకుండా ఉంచగలిగితే కట్టడి చేయగలమనే విశ్వాసం వ్యక్తం చేశారు. టెన్త్ పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని, ప్రజారవాణాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరోన్ వైరస్ నియంత్రణ చర్యలను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.

ఎక్కడి రైళ్లు అక్కడే..

హైదరాబాద్, మార్చి 22: కరోనా వైరస్ మహమ్మారిని పూర్తిగా నియంత్రించడానికి ముందస్తు చర్యగా జనతా కర్ఫ్యూను ఈనెల 31వ తేదీ వరకు కొనసాగించనున్నారు. ఇబ్బందులు ఉన్నా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని రైల్వే సూచించింది. దేశంలో అతిపెద్ద రవాణారంగం అయిన రైల్వే 453 రైళ్లను నిలిపివేసింది. ఈ రైళ్లు ఈనెల 31వ తేదీ అర్ధరాత్రి వరకూ ఆగిపోనున్నాయి. జూన్ 21 వరకు ప్రయాణికులు

సంఘీభావ సంకేతం అద్భుతం

హైదరాబాద్: కరోనా మహమ్మారి వంటి ఆపద సమయంలో సైతం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సమాజం కోసం విధులు నిర్వహిస్తున్న వారికి సంఘీభావంగా చప్పట్లతో సంఘీభావం తెలిపిన కార్యక్రమం తెలంగాణలో మహా అద్భుతంగా జరిగింది. గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకొని ప్రగతి భవన్ నుంచి పల్లెటూరి వరకు వాడవాడలో జరిగిన సంఘీభావ సంకేతానికి ప్రతి పౌరుడు స్పందించిన తీరు అద్వితీయం. కనీవినీ ఎరగని రీతిలో జరిగిన జనతా కర్ఫ్యూతో చీమ చిటుక్కుమనని నిశ్శబ్దం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగిపోయాయి.

31 వరకూ లాక్‌డౌన్

హైదరాబాద్, మార్చి 22: కరోనా నియంత్రణ కోసం జనతా కర్ఫ్యూకు కొనసాగింపుగా ఈ నెల 31 వరకు జనం ఇళ్లకే పరిమితం కావాలని అప్పటివరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమ లు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అప్పటివరకు నిత్యావసర సరుకులు, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. పేదలు ఇబ్బంది పడకుండా 87 లక్షల పైచిలుకు తెల్లరేషన్ కార్డుదారులు అందరికీ ఉచితంగా 12 కిలోల బియ్యంతో పాటు సరకుల కొనుగోలుకు రూ.15 వందల నగదు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. లాక్ డౌన్ అమలులో ఉండడం వల్ల అప్పటివరకు అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలను బంద్ చేయనున్నట్టు వివరించారు.

ఇంట్లోనే ఇండియా

న్యూఢిల్లీ/ముంబయి: ప్రాణాంతకంగా పరిణమిస్తున్న కరోనా వైరస్‌పై యావత్ భారతావని రణన్నినాదం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు జనంలో అనూహ్యమైన, అసాధారణమైన ప్రతిస్పందనకు దారి తీసింది. జనం అంతా ఒక్కటిగా కరోనాను దరి చేరనివ్వమం టూ ఇళ్ళకే పరిమితమై ఓ ఆదర్శనీయ సందేశాన్ని అందించారు. వ్యక్తుల మధ్య సామాజిక దూరాన్ని పాటించాలన్న సందేశాన్ని త్రికరణ శుద్ధిగా పాటించారు. ఎవరూ గుమ్మం దాటకూడదంటూ మోదీ ఇచ్చి న పిలుపును ప్రతి ఒక్కరూ పాటించారు. ఆ విధంగా యావత్ ఇండియా ‘ఇంటి’కే పరిమితమైంది. కరోనా వైరస్‌పై తాము చేపట్టిన యుద్ధంలో ఇది తొలి భాగమేనని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు స్పష్టం చేశా రు.

Pages