S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిజిటల్‌కు మారాలి

హైదరాబాద్, డిసెంబర్ 3: రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబాలు, సామాన్యులు నగదురహిత వ్యవహారాలు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ కోరారు. నగదురహిత కార్యకలాపాలను కొనసాగించే అంశంపై అవగాహన కల్పించేందుకు సచివాలయంలో ఉద్యోగులకు ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. కేంద్రం 500, వెయ్యి నోట్లను రద్దు చేయడంతో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వం, ఉద్యోగులు, ప్రజలు మారాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో లావాదేవీలన్నీ డిజిటల్ తరహాలోనే కొనసాగుతాయని వివరించారు. నోట్ల రద్దువల్ల సమాజంలో విప్లవాత్మక మార్పు వస్తోందని కొత్త సిఎస్ ప్రదీప్ చంద్ర పేర్కొన్నారు.

అందని ఆసరా!

హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా సామాజిక పింఛన్ల కింద ఎకాఎకి రూ.397 కోట్ల నిధులు విడుదల చేసింది. ఆ నిధులు బ్యాంకుల్లో, పోస్ట్ఫాసుల్లో చెల్లింపులకు సిద్ధంగా ఉన్నాయి. కానీ చిల్లర కష్టాలతో పింఛనుదారులకు నగదు చెల్లింపులు నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పింఛనుదార్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయా క్యాటగిరీలను బట్టి వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ప్రభుత్వం పింఛను చెల్లిస్తోంది. దీనివల్ల బ్యాంకులకు నగదు చెల్లింపుల్లో కష్టాలు ఎదురవుతున్నాయి.

ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పెద్ద నోట్ల రద్దు ప్రభావం బడ్జెట్‌పై భారీగా పడినందున కేంద్రం తాత్కాలిక ఆర్థిక వెసులుబాటు కల్పించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. నోట్ల ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు చేయాల్సిన సాయంపై ఆరు అంశాలతో కూడిన ప్రతిపాదనలను కేంద్రానికి అందించారు. అరుణ్ జైట్లీ అధ్యక్షతన శనివారం జిఎస్‌టి గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు లేకుండా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అరుణ్ జైట్లీతో సమావేశమై పెద్ద నోట్ల రద్దు కారణంగా రాష్ట్రాలకు ఎదురవుతున్న సమస్యలను చర్చించారు.

ఇ-పోస్‌లు వచ్చేశాయ్!

అమరావతి, డిసెంబర్ 3: పెద్దనోట్ల చలామణిపై ఆంక్షల విధింపు, కొత్త నోట్ల కొరత వల్ల రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. ఎప్పటికప్పుడు రిజర్వు బ్యాంకు అధికారులతో మాట్లాడి రాష్ట్రానికి నగదు తెప్పిస్తూ మరోవైపు నగదు రహిత విధానం కోసం ఇ-పోస్ మిషన్లు తెప్పించడం కోసం చేస్తున్న కృషి ఫలించింది. ఇప్పటికే రెండు ప్రత్యేక విమానాల్లో రూ.2,420 కోట్ల విలువైన నోట్లు రప్పించారు. ఇప్పటివరకు ప్రభుత్వ శాఖలకు 7,832 ఇ-పోస్ మిషన్లు సరఫరా అయ్యాయి.

ఇదే చివరి క్యూ

మొరాదాబాద్, డిసెంబర్ 3: దేశంలో నల్లకుబేరులకు ఎక్కడికక్కడ ముకుతాడు వేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. తాజాగా మరో షాక్ ఇచ్చారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తమ దగ్గర ఉన్న నల్లధనాన్ని తెలుపుగా మార్చుకునేందుకు తెలివిగా జన్‌ధన్ ఖాతాలలో పెద్ద ఎత్తున జమ చేసుకున్న వారికి తల బొప్పికట్టించే నిర్ణయాన్ని మోదీ శనివారం ప్రకటించారు. జన్‌ధన్ ఖాతాలలో అక్రమంగా, చట్టవ్యతిరేకంగా నగదు డిపాజిట్ చేసిన వారందరినీ జైలుకు పంపడం ఖాయమని ప్రకటించారు. అక్రమంగా జమ అయిన నగదు మొత్తాన్ని పేదలకు అందజేస్తామని మోదీ విస్పష్టంగా తేల్చిచెప్పారు.

పెట్టుబడులకు స్వాగతం

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌లో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావలసిందిగా పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఆయన శనివారం ఢిల్లీలో హిందూస్తాన్ టైమ్స్ ఏర్పాటు చేసిన నాయకత్వ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించేందుకు అవసరమైన అన్ని వనరులు, ఖనిజాలు ఉన్నాయి, స్నేహపూర్వక ప్రభుత్వం ఉన్నదని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గత సంవత్సరం 10.99 శాతం వృద్ధిరేటు సాధించిందని చెప్పారు.

150 కోట్లతో గురుకులాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు

యలమంచిలి, డిసెంబర్ 3: రాష్టవ్య్రాప్తంగా ఉన్న గురుకులాల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు రూ.150 కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. శనివారం విశాఖ జిల్లా యలమంచిలి మండలం కొక్కిరాపల్లి గురుకుల పాఠశాలలో ఆరుకోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ప్రభుత్వం గురుకుల పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల ప్రగతికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. సొంత భవనాలు లేని గురుకులాలు ఒక్కో దానికి రూ.21 కోట్లతో కొత్త భవనాలు నిర్మిస్తున్నామన్నారు.

ఆరోగ్యశ్రీకి పాడె కట్టొద్దు

హైదరాబాద్, డిసెంబర్ 3: ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకానికి వెంటనే నిధులు మంజూరు చేసి పేదలకు వైద్య సేవలు అందించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాశారు. కోట్లాది పేదలకు సంజీవని అయిన ఆరోగ్య శ్రీని అనారోగ్యశ్రీగా మార్చరాదని, ఈ పథకానికి పాడె కట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయని పక్షంలో ఈ నెల 9న ఆరోగ్యశ్రీ రోగులు, వారి బంధువులతో కలిసి జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట వైకాపా ధర్నా చేస్తుందని ఆయన ప్రకటించారు. 2016-17లో రూ.910.77 కోట్ల నిధులు అవసరమైతే, రాష్ట్రప్రభుత్వం రూ.

ఒక రంజీ మ్యాచ్.. రెండు పిచ్‌లు..

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఒక రంజీ మ్యాచ్‌ని రెండు పిచ్‌లపై ఆడించే విధానాన్ని అమలు చేయాలని భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ప్రతిపాదించాడు. ఈ విధంగా ఆడితే, విదేశాల్లో టెస్టు సిరీస్‌లకు అద్భుతమైన జట్టును రూపొందించగలుగుతామని శనివారం ఇక్కడ జరిగిన లీడర్‌షిప్ సమిట్ కార్యక్రమంలో మాట్లాడుతూ సచిన్ అన్నాడు. అదే విధంగా ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లు సుదీర్ఘ విరామాల తర్వాత కాకుండా, బ్యాక్ అండ్ బ్యాక్ సిరీస్‌లుగా ఉండాలని సూచించాడు. అప్పుడే ఒక జట్టు స్వదేశంలో, విదేశంలో ఏ విధంగా ఆడుతుందనే విషయం తెలుస్తుందని అన్నాడు.

లోధా సిఫార్సులపై నో కామెంట్!

న్యూఢిల్లీ: లోధా కమిటీ చేసిన సూచనలు, వాటి అమలుపై వ్యాఖ్యానించడానికి సచిన్ నిరాకరించాడు. కమిటీ సిఫార్సులను అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు ఇప్పటికే బిసిసిఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, తాజా ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లో లోధా సిఫార్సుల అమలుపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో చెప్పిన అంశాలకే కట్టుబడి ఉండాలని సభ్య సంఘాలన్నీ ముక్తకంఠంతో తేల్చిచెప్పాయని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నాడు. ఈ నేపథ్యంలో లోధా సిఫార్సుల అమలుపై అడిగిన ఒక ప్రశ్నకు సచిన్ స్పందించలేదు. తాను వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నాడు.

Pages