S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాజపాతోనే భవిత

ఏలూరు, నవంబర్ 26: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో బిజెపి, టిడిపి ప్రభుత్వాలు కట్టుబడి వున్నాయని, ప్రజలంతా బిజెపికి బాసటగా నిలిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తామని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని, వారి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయిందని, మోదీ సర్కారు వచ్చి రెండున్నరేళ్లు అయినా ఒక్క అవినీతి ఆరోపణా రాకపోవడం ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు.

పాక్ కాళ్ల బేరం!

న్యూఢిల్లీ, నవంబర్ 26: జవాను తల నరికినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ సైనిక పోస్టులపై భారత బలగాలు భీకర దాడులు జరపడంతో దాయాది దేశం దిగివచ్చి ఆ దాడులను ఆపాల్సిందిగా భారత్‌కు విజ్ఞప్తి చేసిందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లు పొడుస్తూ సరిహద్దుల వెంబడి కవ్వింపులకు పాల్పడుతున్న పాక్ రేంజర్లు మంగళవారం భారత జవాను తల నరికి దారుణంగా హత్య చేయడంతో ఆ మరుసటి రోజే మన సైనికులు పూంచ్, రాజౌరీ, కెల్, మాచిల్ సెక్టార్లలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాక్ సైనిక పోస్టులపై భీకర దాడులు జరిపి దాయాది దేశానికి మరోసారి గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే.

అస్తమించిన వీరుడు

క్యూబా మహాయోధుడు క్యాస్ట్రో కన్నుమూత
ప్రపంచ వామపక్ష ఉద్యమానికి తీరని విఘాతం
నాలుగు రోజులపాటు సాగనున్న అంతిమయాత్ర
దేశమంతటా ఊరేగింపు, 4న అంత్యక్రియలు
ప్రపంచ దేశాధినేతల సంతాపాలు

అనుక్షణం అప్రమత్తం

నిఘాకు మరింత పదునుపెట్టండి దేశం అంచుల్లో ఉగ్రవాద ముప్పు
వామపక్షవాదంతో ప్రగతికి ప్రమాదం సమూల నిర్మూలనకు ప్రణాళిక రచించాలి
బలగాలకు సాంకేతిక సామర్థ్యం పెంచాలి పోలీస్ శిక్షణలో మరింత ఒడుపు కావాలి
అప్పుడే శాంతి భద్రతలు పరిరక్షించగలం డిజిపిల సదస్సులో నరేంద్ర మోదీ పిలుపు
రోజంతా అకాడమీలో గడిపిన ప్రధాని సంస్కరణలు, సవాళ్లపై విస్తృత సమీక్ష

వచ్చే ఏడాదికి చింతలపూడి ద్వారా గోదావరి జలాలు: మంత్రి ఉమ

జి.కొండూరు, నవంబర్ 26: వచ్చే ఏడాదికి చింతలపూడి ఎత్తిపోతల పథకంతో గోదావరి జలాలను సాగర్ కాలువల ద్వారా 7లక్షల ఎకరాల ఆయకట్టుకు సరఫరా చేస్తానని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. వెల్లటూరులో శనివారం జరిగిన జనచైతన్య యాత్రలో మంత్రి ఉమ పాల్గొన్నారు. గ్రామపార్టీ అధ్యక్షులు పచ్చిగోళ్ళ రామారావు, దేవినేని ఉమ యూత్ నేత పచ్చిగోళ్ళ బాలకృష్ణ, నీటిసంఘాల అధ్యక్షులు పగడాల పెదసాంబయ్య, మందపాటి అర్జునరావు, కారుకొండ శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, కుందేటి శ్రీనివాస్ తదితరులు మంత్రి ఉమను ఘనంగా స్వాగతించారు.

నగదు రహిత చెల్లింపులపై విద్యార్థులకు అవగాహన

విజయవాడ, నవంబర్ 26: నగదు రహిత చెల్లింపులపై విద్యార్థులకు అవగాహన కల్పించి తద్వారా ప్రజల్లో ఆ దిశగా మార్పు తేవాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో ఆయన సమావేశం నిర్వహించారు. నగదు రహిత చెల్లింపులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లాలో వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, ఇంజనీరింగ్ విభాగంలో నగదు రహిత చెల్లింపులపై అవగాహన కల్పించే సమావేశాలు నిర్వహించామన్నారు.

అంబేద్కర్ పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకం

విజయవాడ, నవంబర్ 26: తరతరాలుగా కట్టుబానిసత్వంతో కటిక దారిద్య్రంలో, అస్పృశ్యతతో నలిగిపోయిన దళిత బహుజనులకు దారిచూపిన మహానాయకుడు బాబాసాహెబ్ డా. బిఆర్ అంబేద్కర్ అని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. అంబేద్కర్ సారథ్యంలో రచించిన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు.

ఇక కార్మికుల వేతనాలు బ్యాంకుల ద్వారానే జమ

విజయవాడ, నవంబర్ 26: కార్మికుల వేతనాలు ఆన్‌లైన్ ద్వారా వారి ఖాతాలకు జమచేయాలని, ప్రతి కార్మికునికి తప్పనిసరిగా బ్యాంకు ఖాతా తెరిచేలా యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరు క్యాంప్ కార్యాలయంలో జిల్లా శుక్రవారం రాత్రి కార్మిక శాఖ అధికారులతో నగదు రహిత చెల్లింపులపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగదు రహిత చెల్లింపుల్లో భాగంగా కార్మికులకు వేతనాలను బ్యాంకు ఖాతాలకు జమచేసేలా కార్మిక శాఖ చర్యలు చేపట్టాలన్నారు.

పెద్దనోట్ల రద్దుతో సహకార రంగానికి ముప్పు

మచిలీపట్నం, నవంబర్ 26: పెద్ద నోట్ల రద్దుతో సహకార రంగానికి ముప్పు ఏర్పడిందని ఎపి స్టేట్ అగ్రికల్చరర్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎంప్లారుూస్ యూనియన్ జిల్లా శాఖ అధ్యక్షులు జన్యావుల రామాంజనేయులు ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సహకార సంఘాల్లో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దయిన నోట్ల డిపాజిట్లు, మార్పిడికి కేవలం బ్యాంక్‌లు, పోస్ట్ఫాసుల్లో మాత్రమే అనుమతి ఇవ్వడం గర్హనీయమన్నారు. పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగే కెడిసిసి బ్యాంక్, పిఎసిఎస్‌లలో కూడా డిపాజిట్లు, నోట్ల మార్పిడికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

కృష్ణా విశ్వ విద్యాలయం ఖ్యాతిని ఇనుమడింప చేస్తాం

మచిలీపట్నం, నవంబర్ 26: కృష్ణా విశ్వ విద్యాలయం ఖ్యాతిని ఇనుమడింప చేస్తామని పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. త్వరలోనే కృష్ణా వర్శిటీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న కృష్ణా తరంగ్-2016 కార్యక్రమాన్ని శనివారం ఎంపి కొనకళ్ళ నారాయణరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Pages