S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలేజ్ సెట్‌లో

రామ్‌చరణ్ హీరోగా నటించిన ధృవ చిత్రం డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరిలో ఆసక్తిని నెలకొల్పుతోంది. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ సినిమా తర్వాత చరణ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిఅయిన ఈ చిత్రాన్ని శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మితం కానుంది. సుకుమార్ మేకింగ్‌లో రూపొందే ఈ సినిమా పల్లెటూరు నేపథ్యంలో ఉంటుందట. 1980 నాటి కాలంలో జరిగే కథతో సుకుమార్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ గోదావరి జిల్లాల్లో జరపాలని అనుకున్నారట.

పిజ్జా-2 పాటలు

విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా రంజిత్ జయకోడి దర్శకత్వంలో తమిళంలో రూపొందించిన చిత్రాన్ని ఆర్.పి.ఎ. క్రియేషన్స్, డి.వి.సినీ క్రియేషన్స్ పతాకాలపై పిజ్జా-2 పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత డి.వెంకటేష్. ఈ చిత్రంలోని పాటలు ఆదివారం హైదరాబాద్‌లో విడుదలైన సందర్భంగా దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిర్మాతలు బెల్లంకొండ సురేష్, మల్కాపురం శివకుమార్, జె.శివకుమార్, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ‘పిజ్జా చిత్రం థ్రిల్లర్ నేపథ్యంలో రూపొంది ఘన విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత చాలా హారర్ సినిమాలు వచ్చాయి.

అందుకే జయం నిశ్చయమైంది..

కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా, పూర్ణ హీరోయిన్‌గా ఎస్.ఆర్.ఎస్. ఫిలిమ్స్ పతాకంపై శివరాజు కనుమూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జయమ్ము నిశ్చయమ్మురా మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా దర్శక,నిర్మాత శివరాజ్ కనుమూరి ఈ విజయాన్ని పాత్రికేయులతో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లో..
స్పందన బాగుంది
ఈ సినిమా విడుదలన రోజున ఆడియన్స్‌తో కూర్చుని చూశాను. వారి రెస్పాన్స్ చూసి చాలా థ్రిల్ అయ్యాను. ఎక్కడ చూసినా అందరూ బాగుందని అంటున్నారు. కొద్దిగా స్లోగా ఉందని టాక్ రావడంతో 15 నిమిషాల నిడివి తగ్గించాం. ఇప్పుడు చూసే ప్రేక్షకులకు కొత్త ఇంపాక్ట్ కలుగుతుంది.
శ్రీనివాసరెడ్డితోనే..

-శ్రీ

థ్రిల్లర్ కథతో నాగ్

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం ఉదయం అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ఈ షూటింగ్‌కు ఆయన సరికొత్త లుక్‌తో విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నాగార్జున కథానాయకుడుగా పివిపి పతాకంపై ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది-2 చిత్రం ముహూర్తపు సన్నివేశంపై కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వగా ప్రసాద్ వి.పొట్లూరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో నిర్మాత మాట్లాడుతూ తమ సంస్థ మరో ప్రతిష్ఠాత్మక చిత్రంగా దీన్ని రూపొందిస్తోందని, నాగార్జున సూచనలతో స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశామని తెలిపారు.

10కె రన్‌లో చరణ్

హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఆదివారం ఉదయం జరిగిన 10కె రన్‌లో హీరో రామ్‌చరణ్ సందడి చేశారు. నటి
రాశీఖన్నా, క్రీడాకారిణి సానియా మీర్జాలతోపాటు తెలంగాణ ఐటి, మున్సిపల్ మంత్రి కె.టి.ఆర్,
హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొని యువతీ యువకులకు ఉత్సాహం కలిగించారు.

హోమగుండం ప్రత్యేకత ఏమిటి?

* గణపతి విశిష్టత ఏమిటి? - వెంకటేశ్వర రావు, చెన్నై
ఈ సృష్టిలో ఏ పదార్థమూ ఒంటరిగా వుండలేదు. అది గుంపులుగానే వుంటుంది. ఆ గుంపుకే జాతి అనీ గణము అనీ పేరు. అలాంటి గణాలన్నిటిలోనూ అనున్యూతంగా, (అంటే ళ్యశఆజశఖ్యఖఒ) ఒక అవిచ్ఛిన్నతత్త్వం వుంటుంది. ఇది ఏ గణానికి ఆ గణంలో కొంత స్పష్టంగానే కనిపిస్తూ వుంటుంది. ఉదాహరణకు గోవుల గుంపులో గోత్వం అనుశ్యూతంగా వుంటుంది. ఇలా పరిమితంగా కాక ప్రపంచంలోని గణాలన్నిటిలోనూ కలిపి ఒక అవిచ్ఛిన్న అనున్యూత తత్త్వ ఉంటుంది. అదే గణపతి. అందువల్ల గణపతికి చేసే పూజ సర్వదేవతాపూజే అవుతుంది. ఇదే గణపతి విశిష్టత.
* లక్ష్మీ గణపతి అంటే ఏమిటి?

- కుప్పా వేంకట కృష్ణమూర్తి

జ్యోతి స్వరూపుడు స్వామి అయ్యప్ప

కలియుగ దైవంగా పేరొందిన కేరళ రాష్ట్రంలోని శబరిమలలో హరిహరసుతుడు కొలువై భక్తులకోరికలను ఈడేరుస్తున్నాడు. నేటికీ వయోభేదం లేకుండా చాలామంది అయ్యప్పమాలాధారణ పట్ల ఎక్కువ ఆకర్షితులై, దీక్షమాలను ధరిస్తున్నారు. కార్తికమాసంలో కుల, మత, జాతి, బేదాలు లేకుండా మాలధారణ చేసినవారు నల్లవస్త్రాలు ధరించి నుదుట విభూతి, చందన, కుంకుమ రేఖలతో దర్శనమిస్తున్నారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ ఎలుగెత్తి ఆ స్వామి నామాలు ఉచ్చరిస్తూ స్వామి పూజలను, భజనలను తనువు మరిచి భక్తి పారవశ్యంతో నిర్వహిస్తున్నారు.

- వుక్కల్‌కర్ రాజేందర్‌నాథ్

అనుభవంతో ఆత్మజ్ఞానం

ప్రపంచం చాలా విశాలమైనది. అంతులేని కోరికలు, వాటిని సాధించుకోవటానికి చేసే ప్రయత్నాలు జీవన గమనానే్న శాసిస్తుంటాయి. ఎన్నో ప్రలోభాలకు గురిచేస్తుంటాయి. మనిషికి కావలసింది తను ఏదైతే కోరుకున్నాడో అదే. అప్పుడు అతడు తృప్తిపడతాడు. తృప్తి కలగనపుడు ఆశాభంగం చెందుతాడు. అందువలన చాలా విలువైన కాలం గంగపాలౌతుంది. వాస్తవాలను కూడా విడిచిపెడతారు.
జీవితంలో అందరూ నిజమే మాట్లాడాలి. అది కూడా ఉల్లాసవంతంగా మాట్లాడాలి. కానీ మీ మాట ఇతరులకు ఏమాత్రం మంచి చేయనపుడు అది నిజం అయినా చెప్పటంవల్ల లాభంలేదని మనుధర్మశాస్త్రం చెబుతున్నది.

- నిమ్మగడ్డ కాశీవిశే్వశ్వరశర్మ

కాలాగ్ని స్వరూపం కార్తికేయరూపం

జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులువారు నాడు దేశంలో అనేక మతాలను సంస్కరించి, సమన్వయపరిచి షణ్మాతాలను స్థాపించి షణ్మతాచార్యునిగా ప్రసిద్ధి పొందారు. ఆ ఆరుమతాలు- సౌర, శాక్త, వైష్ణవ, గాణపత్య, శైవ, సుబ్రహ్మణ్య (కుమార) మతాలు. అన్నింటికీ కలిపి పంచదేవతారాధన ఏర్పాటుచేసి విధి విధానాలు విశదం చేశారు. కాని అందులో సుబ్రహ్మణ్యుని ప్రస్తావించలేదు. అయితే దీపారాధన ‘శివశక్త్యాత్మకుడైన అగ్నిగర్భు’ని ఆరాధించడమేనని తత్త్వజ్ఞులు చెబుతారు. ఏ పూజకైనా ముందుగా దీపారాధన చేస్తారు. అంటే ఆ విధంగా వైదిక మతంలో సుబ్రహ్మణ్య ఆరాధన చెప్పబడింది.

- ఎ.సీతారామారావు

స్వీయ గమనికతోనే స్వానుభవ అవగాహన

నేను-నేను అంటూ ఒక నేను తలంపు స్వానుభవంలో ఉండుట అందరికి సహజ ప్రమాణమే. ఈ నేనుయే నేనును తెలుసుకొనుటకు ఆలంబనము. కనుక ఈ స్వీయ గమనికలో తర్కవాద సాధన విశ్వాసము శాస్తమ్రుల ప్రసక్తి అవసరం లేదు. ఈ ‘నేను’ యొక్క స్వీయ సాక్షీజ్ఞాన, సంకల్పాది విశిష్ట గుణములను బోధ సూచనాదులతో, స్వానుభవ ప్రమాణముతోనే అవగాహన కలిగి, నేను స్పృహ కలిగి, తనను తానే సూటిగ, స్పష్టంగ, సహజంగ స్వీయ సాక్షీజ్ఞానాదులతో యధాతథంగా స్వీయ గమనిక కలిగియుండవలెను. స్వీయ సాక్షీజ్ఞాన సహజ స్వీయ గమనికలో బోధ సూచనాదులతో స్వానంద వౌనము సహజమసను స్వతఃసిద్ధమగును. స్వానందవౌన స్వీయగమనికలో ఈ నేను తలంపుకు పట్టులేక, నిలువ నీడలేక, తనను తానే వీడును. అదృశ్యమగును.

- వేదాంతం ఉపేంద్రశర్మ

Pages