S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీధుల్లో విభిన్న చిత్రలేఖనాలు

హైదరాబాద్, నవంబర్ 26: కాస్త లేటైనా..మన జిహెచ్‌ఎంసి అధికారులకు లేటెస్టు ఆలోచన తట్టింది. ఈ నెల 1 నుంచి 24 వరకు పీపుల్స్‌ప్లాజాలో జరిగిన స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్‌లో దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది చిత్రకారుల పెయింటింగ్‌లను చూస్తే గానీ మన పాలకులకు మంచి ఆలోచన రాలేదు. రోడ్లకిరువైపులా ఉన్న పెద్ద పెద్ద భవనాలకు, ప్రహరీగోడలకు అందమైన, ఆకర్షణీయమైన చిత్రలేఖనాలను వేసి ఔరా అన్పించిన ఆర్టిస్టులు సాగర తీరన తాము నిర్వహించుకున్న ఈ ఫెస్టివల్ నగరవాసులకు గుర్తిండిపోయేలా ట్యాంక్‌బండ్‌పై ‘లవ్ హైదరాబాద్’ అక్షరాల శిల్పాని ఏర్పాటు చేశారు.

త్వరలో రూ. 5 కోట్లతో మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్సు

హైదరాబాద్, నవంబర్ 26: సనత్‌నగర్ నియోజకవర్గంలోని ప్రజల కోరిక మేరకు సనత్‌నగర్ వెల్ఫేర్ కేంద్రం ప్రాంగణంలో మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్సును నిర్మించనున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. ఇందుకు రూ. 5 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందని కూడా ఆయన తెలిపారు.

టిడిపి రైతు పోరుకు జిల్లా నుంచి పదివేల మంది రైతులు

హైదరాబాద్, నవంబర్ 26: తెలంగాణ టిడిపి ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఈనెల 30న మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో నిర్వహించే రైతుపోరుకు వికారాబాద్ జిల్లా నుండి పది వేల మంది రైతులను తరలించాలని వికారాబాద్ జిల్లా టిడిపి అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ జి.సుభాష్‌యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన జిల్లా టిడిపి ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రెండున్నరేళ్ళ టిఆర్‌ఎస్ పాలన రైతులు, విద్యార్థులు, యువతను అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.

తాండూరు జాతీయ వ్యవసాయ మార్కెట్‌లో ఆన్‌లైన్ వ్యాపారాలు

తాండూరు, నవంబర్ 26: తాండూరు జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆన్‌లైన్ ద్వారా వ్యాపారాలు గత సెప్టెంబర్ మాసం నుండే ప్రారంభం అయినట్టు తాండూరు జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. కాగా సెప్టెంబర్ 8నుంచి నవంబర్ 22 వరకు రైతులకు సంబంధించిన పంట దిగుబడులు 7.632 లాట్‌లు ఆన్‌లైన్‌లో ఎంట్రీ అయినట్టు కార్యదర్శి వివరించారు. ఆన్‌లైన్ వ్యాపారాలు మొదలయినప్పటి నుండి అన్ని రకాల పంటల దిగుబడులు కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్న, సోయాబీన్, వరి ధాన్యం వంటి పంట దిగుబడులు మొత్తం 40.840 క్వింటాళ్లు క్రయవిక్రయ వ్యాపారాలు సాగినట్టు ఆయన తెలిపారు.

రాబోతుంది ‘నుమాయిష్’

హైదరాబాద్, నవంబర్ 26: ‘నుమాయిష్’ అనగానే పిల్లలే కాదు పెద్దలూ కేరింతలు కొడతారు, ఎగిరి గంతేస్తారు. వచ్చేస్తోంది ‘నుమాయిష్’. ఇంకా కొన్ని రోజులే. కానీ, పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్ అంతా చిన్నాభిన్నం అయినందున, నుమాయిష్‌పైనా ప్రభావం పడుతుందన్న ఆందోళన వర్తక, వాణిజ్య వ్యాపారుల్లో మొదలైంది. ప్రతి ఏడాది డిసెంబర్ నెలాఖరున నగరంలోని నాంపల్లిలో గల ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రదర్శన (నుమాయిష్) ప్రారంభమై ఫిబ్రవరి 15వ తేదీ వరకూ కొనసాగుతుంది. సుమారు 40 రోజుల పాటు జరిగే ఈ ‘నుమాయిష్’కు సందర్శకుల తాకిడి మాములుగా ఉండదు. వేల సంఖ్యలో తరలి వస్తారు. లోపల ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిటలాడుతుంది.

రాజ్యాంగంపై చైతన్యం

హైదరాబాద్, నవంబర్ 26: భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కర్ని చైతన్యపర్చాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం.ప్రశాంతి సూచించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తొలి సారిగా కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం నంచి నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. ఈ క్రమంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కలెక్టరేట్‌లోని సిబ్బందిచే ఆమె కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిజ్ఞ చేయించారు.

తొలగని ‘చిల్లర’ గండం

హైదరాబాద్, నవంబర్ 26: నెల చివరి రోజులు..ఎంత పెద్ద మొత్తంలో జీతం తీసుకుంటున్న ఉద్యోగి అయినా డబ్బులు కాస్త చూసి ఖర్చు పెట్టుకోవల్సిన రోజులు. ఖాతాల్లోనున్న డబ్బును పొదుపుగా ఖర్చు చేసుకుందామనుకునే ఖాతాదారులకు నిరాశే ఎదురవుతోంది. ఇందుకు ప్రజల అవసరాలకు తగిన విధంగా రూ. వంద, యాభై నోట్లు అందుబాటులో లేపోవటమే ప్రధాన కారణం. కొత్త 500 నోటు అందుబాటులోకి వచ్చిందని చెబుతున్నా, అది కేవలం కొన్ని ఏటిఎంలకే పరిమితమైంది. ఏటిఎంలలో అందుబాటులో ఉన్న రూ. 2వేల నోటు తీసుకుని బయట మార్కెట్‌లో 500 నోటుతో చిల్లర తీసుకుంటే అది ఒరిజినల్ నోటేనా? అన్న అనుమానం ప్రజలను వెంటాడుతోంది.

చిన్నారి అపహరణ రూ.20 వేలకు విక్రయం

రాజేంద్రనగర్, నవంబర్ 26 : ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి విక్రయించిన ఓ మహిళను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

రామాయణం.. మీరే డిటెక్టివ్ 12

ఆ ఆదివారం కూడా ఆశే్లష ఉత్సాహంగా రామాలయానికి వెళ్లి హరికథని వినసాగాడు. ఆయన ఇలా కొనసాగించాడు.
‘మనం ఇవాళ నలభై రెండు, నలభై మూడు సర్గలు చెప్పుకుందాం. విశ్వామిత్రుడు రాక్షస సంహారం చేసి, తాటకి మొదలైన వారిని చంపిన రాముడికి ఇలా చెప్తున్నాడు. ‘రామా! భగీరథుడు కాలి బొటన వేలి మీద నిలబడి శివుడి కోసం తపస్సు చేశాడు. వందేళ్ల తర్వాత శివుడు ప్రత్యక్షమై చెప్పాడు.
‘నీ తపస్సుకి సంతోషించాను. భూమి మీదకి జారే గంగని నేను భరిస్తాను’

మల్లాది వెంకట కృష్ణమూర్తి

పజిల్ 603

ఆధారాలు

అడ్డం

నిశాపతి

Pages