S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గానయోగి ‘వోలేటి’ ( అమృతవర్షిణి)

ఎన్ని విప్లవాత్మక మార్పులొచ్చినా, ఆకాశవాణి అంటే అభిమానించేవారున్నారు. మాధ్యమాలన్నింటి కంటే రేడియోకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రజల కోసమే పనిచేసే సంస్థ రేడియో.
సంగీతం, సాహిత్యం, నాటకం లాంటి కళలపై ఆసక్తిని శ్రోతల్లో కలిగించే ఉత్తమమైన ప్రసార సాధనం. అప్పుడూ, ఇప్పుడూ ఇదే - ఇతర మాధ్యమాల ప్రభావం ఆకాశవాణి మీద ఎప్పుడూ ఉండదు. రేడియో వల్ల గుర్తింపు పొందిన వారు కొందరు. రేడియోకే కీర్తిని తెచ్చినవారు మరి కొందరూ.

-మల్లాది సూరిబాబు 9052765490

మనలో మనం - ఎడిటర్‌తో ముఖాముఖి

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
దొంగనోట్ల ముద్రణలో సిద్ధహస్తులు కొత్తనోట్లు ముద్రించలేరా?
వాళ్లు ముద్రించే లోపు కొత్త నోట్లు రద్దుకావచ్చు

ప్యాకేజీతప్ప ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టంగా చెప్పిన తర్వాతకూడా జగన్ మిగతా ప్రజాసమస్యలేవీ లేనట్లు దానిమీదే గొడవపడటం ఎందుకు?
వేరే స్లోగన్ దొరికించుకోలేక.

కొన్నాళ్లు నిశ్శబ్దంగా ఉండి పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉపన్యాసాలు దంచుతున్నాడు. ముఖ్యమంత్రి పీఠం మీద కనే్నశాడంటారా?
ముఖ్యమంత్రి పీఠమే తన మీద కనే్నసిందని అనుకుంటున్నాడేమో!

ప్లాస్టిక్ కరెన్సీ మనకెప్పుడు?

డబ్బు లేనిదే రోజు గడవదు..
చేతిలో నగదు లేకపోతే నరకమే..
జేబులో కరెన్సీ ఉంటే మన పోజులే వేరు..
ఇక కట్టలు దాచినవాడి దర్పమే వేరు...

కానీ చేతిలో చిరిగిన నోటు...
చెల్లని కరెన్సీ ఉన్నా.. లేకున్నా ఒక్కటే..
చిత్తుకాగితం పాటి చేయదు మన విలువ.
ఈ తత్వం ఇపుడు అనుభవంలోకి వచ్చింది అందరికీ.

-ఎస్.కె.రామానుజం

కొత్త స్నేహితులు 27

గౌతమ్ చిటికె వేసి చూన్నాడు, ‘‘చూడబోతే సామ్రాట్ గారు ప్రస్తుతం ఏదో తీరని సమస్యతో కొట్టుమిట్టాడుతున్నట్టున్నారు. అదేవిటో మాకూ చెపితే మాకు తోచిన తరుణోపాయం మేమూ చెప్తాం కదా!’’
‘‘తప్పకుండా.. మన మధ్య స్నేహం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా ఎందుకో నా సమస్య మీతో చెప్పుకోవాలనిపిస్తోంది’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఇంకెందుకూ ఆలస్యం? కానివ్వండి’’ అంటూ అప్పుడే అటుగా వచ్చిన బేరర్‌కు ఆర్డర్ ఇచ్చి కుతూహలంగా సామ్రాట్ వైపు చూశాడు గౌతమ్.

సీతాసత్య

కాశీఖండం 73

ప్రశస్తావయవాలు కల ఆ తార ఒక్కొక్క పరి సౌధాంతరంలో సమున్నత మణిమయ స్తంభానికి చేరగిలబడి బంగారు సాలభంజిక కరణి నిలుచుండిపోతుంది.
దొండపండును పోలిన అధరోష్ఠం కల ఆ తార క్రీడా సౌధంపయిన లీలా విహార సమయాల్లో నితంబ భర, పీనస్తనభర, గర్భభారములచేత సుకుమారం అయిన శరీరం అలసటకి గురికాగా మణిఖచిత కుడ్యాలలో కనవచ్చే తన ప్రతిబింబం హస్తావలింబాం ఇస్తే ఎంత మేలుగా వుండేది అని తలుస్తూ వుంటుంది. తార ఆ భవనాంతర కేళీవనంలో నితరువుల్ని, లతన్ని అవలంబంగా చేకొనడం అద్భుతం కాదు. గర్భభరాలస అయి విహార భవన మణిస్తంభాల నుంచి ప్రసరిస్తున్న కిరణాంకురాల్ని సైతం చేయూతగా పట్టుకొనబోతుంది.

శ్రీపాద కృష్ణమూర్తి

దీపం దర్శయామి

హద్దులుమీరి ఇతరులపైబడి దౌర్జన్యములు కొనసాగిస్తున్నప్పుడు, కొంతకాలం ఓపిక, ఓర్పు పట్టటం సజం. సహనం అంతరిస్తే, అవతలివారిపై దాడి తప్పదు. దురాగతాలు, దౌర్జన్యాలు కొంతకాలం వరకే సాగేది. అన్యాయాలు, అవినీతి, అహంకారాలు మితిమీరినప్పుడు యుద్ధం అనివార్యమగును. తగు సమయంలో వారికి బుద్ధి చెప్పకపోతే ధర్మం నాల్గు పాదాలపై నిలబడలేదు.

-లక్కరాజు శ్రీనివాసరావు

నేర్చుకుందాం

దినముం జిత్తములో సువర్ణముఖరీ తీర ప్రదేశామ్ర కా
నన మద్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా
సననిష్ఠన్నిను జూడగన్న నదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా
సిని మాయానటనల్ సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వరా!

ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతక పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ

టెస్టు క్రికెట్‌కు కొత్త సొబగులు!

క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతూ, కొడిగట్టిన దీపంలా మారిన టెస్టు క్రికెట్‌కు కొత్త రూపాన్ని ఇవ్వడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రయత్నిస్తున్నది. 2020 సంవత్సరం నాటికి టెస్టులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నది. అకానేకానేక మార్పులతో కొత్త సొబగులతో ముస్తాబు చేస్తున్నది. కానీ, ఈ ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుందా అన్నదే అనుమానం. 139 సంవత్సరాల చరిత్ర గల టెస్టు క్రికెట్ ఆదరణ కోల్పోవడం సుమారు మూడు దశాబ్దాల క్రితమే మొదలైంది. వనే్డ, టి-20 ఫార్మాట్స్ విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో టెస్టులకు వచ్చే వారి సంఖ్య తగ్గుతూ వస్తున్నది.

Pages